Ind Vs SA : తొలి వన్డేలో భారత్ ఓటమి.. శార్దూల్ పోరాడినా…

సౌతాఫ్రికాతో జరిగిన తొలి వన్డేలో భారత జట్టు ఓటమి చవి చూసింది. 31 పరుగుల తేడాతో ఆతిథ్య దక్షిణాఫ్రికా భారత్ పై విజయం సాధించింది.

Ind Vs SA : తొలి వన్డేలో భారత్ ఓటమి.. శార్దూల్ పోరాడినా…

Ind Vs Sa

Ind Vs SA : సౌతాఫ్రికాతో జరిగిన తొలి వన్డేలో భారత జట్టు ఓటమి చవి చూసింది. మిడిల్ ఆర్డర్ వైఫల్యంతో పరాజయం పాలైంది. 31 పరుగుల తేడాతో ఆతిథ్య దక్షిణాఫ్రికా గ్రాండ్ విక్టరీ కొట్టింది. తొలుత బ్యాటింగ్ చేసిన సౌతాఫ్రికా 4 వికెట్ల నష్టానికి 296 పరుగులు చేసింది. 297 పరుగుల టార్గెట్ తో బరిలోకి దిగిన టీమిండియా.. 50ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 265 పరుగులు మాత్రమే చేసింది.

భారత జట్టులో ఓపెనర్ శిఖర్ ధావన్(79), విరాట్ కోహ్లి(51) హాఫ్ సెంచరీలతో రాణించారు. ఆ తర్వాత శార్దూల్ ఠాకూర్ అద్భుతంగా బ్యాటింగ్ చేశాడు. హాఫ్ సెంచరీతో నాటౌట్ గా నిలిచాడు. మరో ఎండ్ లో అతడికి సహకారం కరువైంది. సౌతాఫ్రికాలో బౌలర్లలో లుంగి ఎంగిడి, తబ్రైజ్ శంసీ, అండిల్ తలో రెండు వికెట్లు తీశారు. ఎయిడెన్ మార్ క్రమ్, కేశవ్ మహరాజ్ తలో వికెట్ తీశారు.

Yash Dhull : భారత జట్టులో కరోనా కలకలం.. కెప్టెన్, వైస్ కెప్టెన్‌కు పాజిటివ్

ఒకానొక దశలో 181/3 స్కోరుతో ఉన్న భారత్ ను.. దక్షిణాఫ్రికా బౌలర్లు బెంబేలెత్తించారు. భారత మిడిలార్డర్‌ బ్యాటర్లను పెవిలియన్‌కు పంపారు. ఆఖర్లో శార్దూల్‌ పోరాడినా ఓటమి నుంచి జట్టును తప్పించలేకపోయాడు. భారత బ్యాటర్లలో కేఎల్‌ రాహుల్ 12, రిషభ్‌ పంత్ 16, శ్రేయస్‌ అయ్యర్ 17, వెంకటేశ్ అయ్యర్ 2, భువనేశ్వర్‌ 4, బుమ్రా 14* పరుగులు చేశారు.

ఈ మ్యాచ్ లో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న సౌతాఫ్రికా భారీ స్కోర్ సాధించింది. నిర్ణీత 50 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 296 పరుగులు చేసింది. కప్టెన్ బవుమా (110 పరుగులు, 143 బంతులు, 8 ఫోర్లు), డస్సెన్ (129 పరుగులు, 96 బంతులు, 9 ఫోర్లు, 4 సిక్సర్లు.. నాటౌట్) సెంచరీలతో చెలరేగారు. భారత బౌలర్లను చితకబాదడంతో సఫారీల స్కోరు బోర్డు దూసుకుపోయింది. వీరిద్దరూ నాలుగో వికెట్‌కు 204 పరుగులు జోడించి భారత్‌ ఎదుట భారీ లక్ష్యం ఉంచడంలో కీ రోల్ ప్లే చేశారు. బవుమా ఔటైనా.. ఆఖర్లో డస్సెన్‌ దంచి కొట్టాడు.

దక్షిణాఫ్రికా ఇతర బ్యాట్స్ మెన్లలో డీకాక్ (27), మలాన్ (6), మార్క్ రామ్ (4), మిల్లర్ (2) పరుగులు చేశారు. ఎక్స్ ట్రాల రూపంలో 18 పరుగులు వచ్చాయి. భారత బౌలర్లలో బుమ్రా 2 వికెట్లు తీయగా, అశ్విన్ ఒక వికెట్ తీశాడు. మార్క్ రామ్ రనౌట్ అయ్యాడు. డుస్సేన్, మిల్లర్ నాటౌట్ గా నిలిచారు.

Corona Medicines : హోమ్ ఐసోలేషన్‌లో ఉన్నవాళ్లు తీసుకోవాల్సిన మందులు.. ప్రభుత్వం మార్గదర్శకాలు

టెస్టు సిరీస్‌ను కోల్పోయిన టీమిండియా.. మూడు వన్డేల సిరీస్‌నైనా గెలుద్దామని అనుకుంటే ఆదిలోనే ఎదురుదెబ్బ తగిలింది. తొలి వన్డేలో అన్ని విభాగాల్లో రాణించిన సౌతాఫ్రికా జట్టు.. ఘన విజయం సాధించి మూడు వన్డేల సిరీస్ లో 1-0 ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. రెండో వన్డే శుక్రవారం జరగనుంది.