Ind vs SA 1st Test : తొలి రోజు ముగిసిన ఆట.. రాహుల్ సెంచరీ.. భారత్ స్కోర్ 272/3

సెంచూరియన్ వేదికగా దక్షిణాఫ్రికాతో జరుగుతున్న తొలి టెస్ట్ మ్యాచ్ తొలి రోజు ఆటలో భారత్ ఆధిపత్యం ప్రదర్శించింది. తొలి రోజు ఆట ముగిసే సమయానికి కోహ్లి సేన 3 వికెట్ల నష్టానికి 272..

Ind vs SA 1st Test : తొలి రోజు ముగిసిన ఆట.. రాహుల్ సెంచరీ.. భారత్ స్కోర్ 272/3

Ind Vs Sa 1st Test Centurion

Ind vs SA 1st Test : సెంచూరియన్ వేదికగా దక్షిణాఫ్రికాతో జరుగుతున్న తొలి టెస్ట్ మ్యాచ్ తొలి రోజు ఆటలో భారత్ ఆధిపత్యం ప్రదర్శించింది. తొలి రోజు ఆట ముగిసే సమయానికి కోహ్లి సేన 3 వికెట్ల నష్టానికి 272 పరుగులు చేసింది. క్రీజులో ఓపెనర్ కేఎల్ రాహుల్‌ (122*), అజింక్యా రహానె (40*) ఉన్నారు.

ఓపెనర్ కేఎల్ రాహుల్ సెంచరీతో కదం తొక్కాడు. మరో ఓపెనర్ మయాంక్ అగర్వాల్‌ (60) తో కలిసి తొలి వికెట్‌కు 117 పరుగుల భాగస్వామ్యం అందించాడు. ఓపెనర్లు రాణించడంతో తొలి రోజు భారత్ మంచి స్కోరు చేసింది.

KL Rahul : సెంచరీ బాదిన కేఎల్ రాహుల్.. సరికొత్త రికార్డులు నమోదు

టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ ఎంచుకున్న భారత్‌కు శుభారంభం లభించింది. ఓపెనర్లు కేఎల్ రాహుల్‌, మయాంక్‌ అగర్వాల్ (60) ఆచితూచి ఆడారు. తొలి సెషన్‌లో సఫారీ బౌలర్లకు ఎలాంటి అవకాశం ఇవ్వలేదు. ఈ క్రమంలో మయాంక్‌ తన కెరీర్ లో 6వ హాఫ్ సెంచరీ నమోదు చేశాడు. క్రీజులో నిలదొక్కుకున్న సమయంలో ఎంగిడికి వికెట్ల ముందు దొరికిపోయాడు. ఫస్ట్ డౌన్ లో వచ్చిన టెస్ట్ స్పెషలిస్టు ఛటేశ్వర్‌ పుజారా (0) గోల్డెన్‌ డకౌట్‌ కాగా, ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన కెప్టెన్ విరాట్ కోహ్లి మరోసారి నిరాశపరిచాడు.

కేవలం 35 పరుగులు మాత్రమే చేసి ఔటయ్యాడు. ఈ మ్యాచ్‌లో అయినా సెంచరీ దాహం తీరుస్తాడని ఆశించిన అభిమానులకు నిరాశే మిగిలింది. ఎంగిడి బౌలింగ్‌లో స్లిప్‌లో ముల్డర్‌కి క్యాచ్‌ ఇచ్చి కోహ్లి వెనుదిరిగాడు. తర్వాత క్రీజులోకి వచ్చిన అజింక్యా రహానెతో జతకట్టిన కేఎల్.. నిలకడగా పరుగులు రాబట్టాడు. ఈ క్రమంలోనే కేఎల్ రాహుల్‌ సెంచరీ బాదాడు. టెస్టు కెరీర్‌లో రాహుల్ కి ఇది 7వ శతకం కాగా, దక్షిణాఫ్రికాలో తొలి సెంచరీ. సౌతాఫ్రికా బౌలర్లలో మూడు వికెట్లూ లుంగి ఎంగిడికే దక్కాయి.

భారత ఓపెనర్ కేఎల్ రాహుల్ 218 బంతుల్లో (14 ఫోర్లు, ఒక సిక్స్) 100 పరుగుల మార్క్‌ని అందుకున్నాడు. రాహుల్ జోరుతో భారత్ జట్టు భారీ స్కోరుకి బాటలు వేసుకుంది. ఓపెనర్ మయాంక్ అగర్వాల్ తో కలిసి తొలి వికెట్‌కి 117 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పిన కేఎల్ రాహుల్.. ఆ తర్వాత కెప్టెన్ విరాట్ కోహ్లీ కలిసి మూడో వికెట్‌కి 82 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పాడు.

 

Union Bank of India Jobs : యూనియన్ బ్యాంకులో ఉద్యోగాలు.. దరఖాస్తు ప్రక్రియ వివరాలు

వాస్తవానికి కేఎల్ రాహుల్ చాలా నెమ్మదిగా ఇన్నింగ్స్‌ని ప్రారంభించాడు. బంతి పాతబడే వరకూ ఎక్కువగా డిఫెన్స్‌ని ఆశ్రయించిన రాహుల్.. పరుగులు చేసేందుకు ఇబ్బండిపడుతున్నట్లు కనిపించాడు. కానీ.. మయాంక్ ఔటైన తర్వాత స్కోరు బోర్డు నడిపించే బాధ్యత తీసుకున్న రాహుల్.. కోహ్లి ఔట్ తో మరింత బాధ్యతగా ఆడి సెంచరీ నమోదు చేశాడు.