Ind Vs SA : ముగిసిన రెండో రోజు ఆట.. 58 పరుగుల ఆధిక్యంలో భారత్

ఆట ముగిసే సమయానికి టీమిండియా తన రెండో ఇన్నింగ్స్ లో 2 వికెట్లకు 85 పరుగులు చేసింది. భారత్ ప్రస్తుతం 58 పరుగుల లీడ్ లో ఉంది.

Ind Vs SA : ముగిసిన రెండో రోజు ఆట.. 58 పరుగుల ఆధిక్యంలో భారత్

Ind Vs Sa Johannesburg

Ind Vs SA : జోహాన్నెస్ బర్గ్ వేదికగా భారత్, దక్షిణాఫ్రికా జట్ల మధ్య జరుగుతున్న రెండో టెస్టు మ్యాచ్ లో రెండో రోజు ఆట ముగిసింది. ఆట ముగిసే సమయానికి టీమిండియా తన సెకండ్ ఇన్నింగ్స్ లో 2 వికెట్లకు 85 పరుగులు చేసింది. భారత్ ప్రస్తుతం 58 పరుగుల లీడ్ లో ఉంది. ఈ మ్యాచ్ లో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్.. తొలి ఇన్నింగ్స్ లో 202 పరుగులు చేయగా, దక్షిణాఫ్రికా 229 పరుగులకే ఆలౌట్ అయింది.

రెండో ఇన్నింగ్స్ లో ఆదిలోనే భారత్ వికెట్ కోల్పోయింది. ఓపెనర్ కేఎల్ రాహుల్ 8 పరుగులు చేసి మార్కో జాన్సెన్ బౌలింగ్ లో ఔట్ అయ్యాడు. మరో ఓపెనర్ మయాంక్ అగర్వాల్ 23 పరుగులు చేసి డువానే ఒలీవియర్ కు వికెట్ల ముందు దొరికిపోయాడు. ప్రస్తుతం క్రీజులో పుజారా (35), అజింక్యా రహానే (11) ఉన్నారు.

Corona New Variant IHU : కరోనా కొత్త వేరియంట్.. ఒమిక్రాన్ కంటే డేంజర్…?

పుజారా ఇవాళ్టి ఆటలో దూకుడు ప్రదర్శించడం విశేషం. తొలి ఇన్నింగ్స్ లో 3 పరుగులు చేయడానికి 33 బంతులు ఆడిన పుజారా… రెండో ఇన్నింగ్స్ లో 42 బంతుల్లోనే 35 పరుగులు సాధించాడు. అందులో 7 బౌండరీలు ఉన్నాయి.

Dangerous Alexa: 10 ఏళ్ల చిన్నారిని కరెంటు ప్లగ్‌లో వేలు పెట్టమన్న “అలెక్సా”

కాగా, టీమిండియా బౌలర్లలో ముఖ్యంగా పేసర్ శార్దూల్ ఠాకూర్ నిప్పులు చెరిగాడు. దక్షిణాఫ్రికా పతనాన్ని శాసించాడు. కెరీర్ లోనే అత్యుత్తమ బౌలింగ్ గణాంకాలు నమోదు చేశాడు. 61 పరుగులు ఇచ్చిన శార్దూల్.. ఏకంగా 7 వికెట్లు తీయడం విశేషం. దక్షిణాఫ్రికాపై ఓ భారత బౌలర్ నమోదు చేసిన అత్యుత్తమ ప్రదర్శన కూడా ఇదే. ఇక షమీ 2 వికెట్లు తీయగా, బుమ్రా 1 వికెట్ తీశాడు.