Ind Vs SA : రసవత్తరంగా కేప్‌టౌన్ టెస్ట్.. 8 వికెట్లు తీస్తే గెలుపు భారత్‌దే

కేప్ టౌన్ వేదికగా భారత్, సౌతాఫ్రికా జట్ల మధ్య జరుగుతున్న నిర్ణయాత్మక మూడో టెస్ట్ మ్యాచ్ రసవత్తరంగా మారింది. ఈ మ్యాచ్ లో మూడో రోజు ఆట ముగిసింది.

Ind Vs SA : రసవత్తరంగా కేప్‌టౌన్ టెస్ట్.. 8 వికెట్లు తీస్తే గెలుపు భారత్‌దే

Ind Vs Sa Cape Town Test

Ind Vs SA : కేప్ టౌన్ వేదికగా భారత్, సౌతాఫ్రికా జట్ల మధ్య జరుగుతున్న నిర్ణయాత్మక మూడో టెస్ట్ మ్యాచ్ రసవత్తరంగా మారింది. ఈ మ్యాచ్ లో మూడో రోజు ఆట ముగిసింది. 212 పరుగుల టార్గెట్ తో రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన దక్షిణాఫ్రికా.. ఆట ముగిసే సమయానికి 2 వికెట్ల నష్టానికి 101 పరుగులు చేసింది. ఆ జట్టు గెలవాలంటే ఇంకా 111 పరుగులు చేయాలి.

లక్ష్య ఛేదనలో నిలకడగా ఆడుతున్న దక్షిణాఫ్రికాకు ఆట చివర్లో గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఫామ్ లో ఉన్న కెప్టెన్ డీన్ ఎల్గార్ (30)ని బుమ్రా ఔట్ చేయడంతో దక్షిణాఫ్రికా రెండో వికెట్ కోల్పోయింది. అంతకుముందు మరో ఓపెనర్ మార్ క్రమ్ ను షమీ సులభంగానే పెవిలియన్ కు పంపాడు. ప్రస్తుతం కీగాన్ పీటర్సన్ 48 పరుగులతో క్రీజులో ఉన్నాడు.

Corona Treatment : 50 ఎకరాలు అమ్మి రూ.8 కోట్లు ఖర్చు.. అయినా దక్కని ప్రాణం

కాగా, రేపటి ఆటలో 8 వికెట్లు పడగొట్టగలిగితే గెలుపు భారత్ దే. తద్వారా సిరీస్ కూడా వశమవుతుంది. అయితే విజయావకాశాలు ఆతిథ్య జట్టువైపే ఉన్నట్లుగా కనబడుతోంది. ఈ టెస్ట్ మ్యాచ్ లో టాస్ గెలిచిన భారత జట్టు తొలి ఇన్నింగ్స్ లో 223 పరుగులు చేయగా, దక్షిణాఫ్రికా 210 పరుగులకే సాధించింది. అనంతరం రెండో ఇన్నింగ్స్ లో భారత్ 198 పరుగులకు ఆలౌట్ అయింది.

Cricketers Affairs: గర్ల్ ఫ్రెండ్స్‌తో టీమిండియా క్రికెటర్ల ఎంజాయ్మెంట్

భారత్‌ తన సెకండ్ ఇన్నింగ్స్‌లో ఈ మాత్రం స్కోరు చేసిందంటే ప్రధాన కారణం రిషభ్‌ పంత్ (100-నాటౌట్). కష్ట సమయంలో క్రీజులోకి వచ్చిన పంత్ అద్భుతంగా బ్యాటింగ్ చేశాడు. వీరోచిత సెంచరీతో జట్టు ఇన్నింగ్స్‌ను నిలబెట్టాడు. పంత్ కాకుండా కెప్టెన్ విరాట్ కోహ్లీ (29) కాస్త ఫర్వాలేదనిపించాడు. మిగతావారు పూర్తిగా విఫలమయ్యారు. దక్షిణాఫ్రికా బౌలర్లలో జాన్‌సెన్ 4, రబాడ 3, ఎంగిడి 3 వికెట్లు పడగొట్టారు.