IndVsSA 3rd T20 : రాణించిన రుతురాజ్, ఇషాన్.. సౌతాఫ్రికా టార్గెట్ ఎంతంటే

ఓపెనర్లు రుతురాజ్‌ గైక్వాడ్, ఇషాన్ కిషాన్ హాఫ్ సెంచరీలతో రాణించారు. ఆల్‌రౌండర్‌, కెప్టెన్ హార్దిక్‌ పాండ్య 31 పరుగులతో రాణించాడు.

IndVsSA 3rd T20 : రాణించిన రుతురాజ్, ఇషాన్.. సౌతాఫ్రికా టార్గెట్ ఎంతంటే

Indvssa 3rd T20

IndVsSA 3rd T20 : విశాఖపట్నం వేదికగా సౌతాఫ్రికాతో జరుగుతున్న మూడో టీ20 మ్యాచ్‌లో భారత జట్టు నిర్ణీత ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 179 పరుగులు చేసింది. ఓపెనర్లు రుతురాజ్‌ గైక్వాడ్, ఇషాన్ కిషాన్ హాఫ్ సెంచరీలతో రాణించారు. రుతురాజ్ గైక్వాడ్ 35 బంతుల్లో 57 పరుగులు చేశాడు. అతడి స్కోర్ లో 7 ఫోర్లు 2 సిక్స్ లు ఉన్నాయి.

ఇషాన్ కిషన్ 35 బంతుల్లో 54 పరుగులు చేశాడు. అతడి స్కోర్ లో 5 ఫోర్లు, రెండు సిక్స్ లు ఉన్నాయి. ఆల్‌రౌండర్‌ హార్దిక్‌ పాండ్య 31 పరుగులతో రాణించాడు. మిగిలిన బ్యాటర్లు పెద్దగా ఆడలేదు. దక్షిణాఫ్రికా బౌలర్లలో ప్రిటోరియస్‌ రెండు వికెట్లు పడగొట్టాడు. రబాడ, షంసి, కేశవ్‌ మహరాజ్‌ తలో వికెట్‌ తీశారు.

Nikhat Zareen: కమ్యూనిటీని కాదు, నా దేశాన్ని రిప్రజెంట్ చేస్తున్నా – నిఖత్ జరీన్

ఈ మ్యాచ్ లో టాస్‌ నెగ్గిన దక్షిణాఫ్రికా బౌలింగ్‌ ఎంచుకుంది. కాగా, ఈ మ్యాచ్ భారత్ కు కీలకం. బ్యాటింగ్‌, బౌలింగ్‌లో వైఫల్యంతో తొలి రెండు మ్యాచుల్లో భారత్‌ ఓటమిపాలై సిరీస్‌లో 0-2తో వెనకబడింది. దీంతో సిరీస్‌లో నిలవాలంటే ఈ మ్యాచ్‌లో టీమిండియా తప్పక నెగ్గాల్సిన పరిస్థితి ఏర్పడింది. వరుసగా రెండు మ్యాచ్‌లు గెలిచి జోరు మీదున్న సఫారీ సేనను అడ్డుకోవడం పంత్‌సేనకు సవాలే.

వరుసగా 12 విజయాలు.. ఇదీ దక్షిణాఫ్రికాతో సిరీస్‌కు ముందు అంతర్జాతీయ టీ20ల్లో భారత్ ఘనత. మరో మ్యాచ్‌ గెలిస్తే ప్రపంచ రికార్డు. అదే జోరులో సొంతగడ్డపై సఫారీ సేననూ చిత్తు చేస్తుందని అంతా ఆశించారు. కానీ రెండు మ్యాచ్‌లు తిరిగే సరికి పరిస్థితి తలకిందులైంది. ప్రపంచ రికార్డు సంగతి పక్కనపెడితే.. ఇప్పుడు సిరీస్‌ కోల్పోయే ప్రమాదంలో పడింది భారత్‌. విశాఖపట్నం మ్యాచ్‌లో ఓడితే సిరీస్‌లో పంత్‌సేన పనైపోయినట్లే.

IPL 2023: రూ.43వేల కోట్లు దాటిన టెలికాస్టింగ్ హక్కుల ధర

ఇక విశాఖలోని వైఎస్ఆర్ ఏసీఏ-వీడీసీఏ మైదానం సందడిగా కనిపిస్తోంది. కొవిడ్‌ కారణంగా కొన్నేళ్లుగా ఇక్కడ మ్యాచ్‌లు నిర్వహించకపోవడంతో మూడో టీ20కి అభిమానులు భారీగా తరలి వచ్చారు.

భారత జట్టు:
ఇషాన్‌ కిషన్‌, రుతురాజ్‌ గైక్వాడ్‌, శ్రేయస్ అయ్యర్‌, రిషభ్ పంత్‌ (కెప్టెన్), హార్దిక్ పాండ్య, దినేశ్ కార్తీక్‌, అక్షర్‌ పటేల్, హర్షల్‌ పటేల్, భువనేశ్వర్‌ కుమార్‌, యుజువేంద్ర చాహల్‌, అవేశ్‌ ఖాన్.

Must Watch: https://www.youtube.com/watch?v=Q0eu7HCRBgw

సౌతాఫ్రికా జట్టు:
తెంబా బవుమా (కెప్టెన్‌), హెన్రిక్స్‌, ప్రిటోరియస్‌, డసెన్, క్లాసెన్‌, డేవిడ్ మిల్లర్‌, పార్నెల్, కగిసో రబాడ, కేశవ్‌ మహరాజ్‌, ఆన్రిచ్‌ నార్జ్‌, షంసి.