Ind Vs SA : రిషభ్ పంత్ హాఫ్ సెంచరీ.. లంచ్ విరామానికి భారత్ 130/4

కేప్ టౌన్ వేదికగా దక్షిణాఫ్రికాతో జరుగుతున్న మూడో టెస్ట్ మ్యాచ్ సెకండ్ ఇన్నింగ్స్ లో భారత వికెట్ కీపర్ రిషభ్ పంత్ రాణించాడు. పంత్ హాఫ్ సెంచరీ బాదాడు.

Ind Vs SA : రిషభ్ పంత్ హాఫ్ సెంచరీ.. లంచ్ విరామానికి భారత్ 130/4

Ind Vs Sa Rishabh Pant

Ind Vs SA : కేప్ టౌన్ వేదికగా దక్షిణాఫ్రికాతో జరుగుతున్న మూడో టెస్ట్ మ్యాచ్ సెకండ్ ఇన్నింగ్స్ లో భారత వికెట్ కీపర్ రిషభ్ పంత్ దూకుడు మీదున్నాడు. పంత్ హాఫ్ సెంచరీ బాదాడు. 60 బంతుల్లో 4 ఫోర్లు, ఒక సిక్స్ సాయంతో 51 పరుగులు చేశాడు. మరో ఎండ్ లో కెప్టెన్ విరాట్ కోహ్లి చాలా ఓపికగా ఆడుతున్నాడు. 127 బంతులు ఎదుర్కొన్న కెప్టెన్ కోహ్లి 28 పరుగులు చేశాడు. లంచ్ బ్రేక్ సమయానికి భారత్ 4 వికెట్ల నష్టానికి 130 పరుగులు చేసింది. ప్రస్తుతం 143 రన్స్ ఆధిక్యంలో భారత్ ఉంది.

India Open 2022: ఏడుగురు బ్యాడ్మింటన్ ప్లేయర్స్‌కు క‌రోనా..టోర్నీ నుంచి అవుట్

కేప్ టౌన్ టెస్టులో టీమిండియా మూడో రోజు తొలి సెషన్ లో కఠిన సవాళ్లను అధిగమించింది. ఓవర్ నైట్ స్కోరు 57/2తో రెండో ఇన్నింగ్స్ కొనసాగించిన భారత్ అదే స్కోరు దగ్గర పుజారా (9) వికెట్ కోల్పోయింది. మరో పరుగు తేడాతో అజింక్యా రహానే (1) పెవిలియన్ బాట పట్టాడు. దాంతో భారత్ 58 పరుగులకే 4 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది.

Cricketers Affairs: గర్ల్ ఫ్రెండ్స్‌తో టీమిండియా క్రికెటర్ల ఎంజాయ్మెంట్

ఈ సమయంలో కెప్టెన్ విరాట్ కోహ్లి, రిషబ్ పంత్ జోడీ మొక్కవోని పట్టుదలతో ఇన్నింగ్స్ నిలబెట్టింది. వీళ్లిద్దరూ మరో వికెట్ పడకుండా జాగ్రత్త పడుతూ స్కోరుబోర్డు ముందుకు నడిపించారు. దాంతో లంచ్ విరామానికి భారత్ 4 వికెట్లకు 130 పరుగులు చేసింది. దక్షిణాఫ్రికా బౌలర్లలో రబాడా 2, జాన్సెన్ 2 వికెట్లు తీశారు. కాగా, చివరి టెస్టు మ్యాచ్ తొలి ఇన్నింగ్స్ లో భారత్ 223 పరుగులకు ఆలౌట్ కాగా… దక్షిణాఫ్రికా 210 పరుగులకే ఆలౌట్ అయింది.