Ind VS SA : ఉత్కంఠపోరులో భారత్ ఓటమి.. సౌతాఫ్రికా క్లీన్‌స్వీప్

చివరి వరకు పోరాడినా ప్రయోజనం లేకపోయింది. గెలుపు అందినట్టే అంది చేజారింది. సౌతాఫ్రికాతో జరిగిన మూడో వన్డేలోనూ భారత్ ఓటమి పాలైంది.

Ind VS SA : ఉత్కంఠపోరులో భారత్ ఓటమి.. సౌతాఫ్రికా క్లీన్‌స్వీప్

Ind Vs Sa

Ind VS SA : చివరి వరకు పోరాడినా ప్రయోజనం లేకపోయింది. గెలుపు అందినట్టే అంది చేజారింది. సౌతాఫ్రికాతో జరిగిన మూడో వన్డేలోనూ భారత్ ఓటమి పాలైంది. ఆఖరి ఓవర్ వరకు ఉత్కంఠభరితంగా సాగిన ఈ మ్యాచ్ లో సౌతాఫ్రికా 4 పరుగుల తేడాతో భారత్ పై గెలుపొందింది.

తొలుత బ్యాటింగ్‌ చేసిన సఫారీ జట్టు 287 పరుగులకు ఆలౌట్ అయ్యింది. 288 పరుగుల టార్గెట్ తో బరిలోకి దిగిన టీమిండియా.. 49.2 ఓవర్లలో 283 పరుగులకే పరిమితమైంది. చివరలో దీపక్ చాహర్ ధనాధన్ ఇన్నింగ్స్ ఆడాడు. హాఫ్ సెంచరీతో మెరిశాడు. చాహర్ 34 బంతుల్లోనే 54 పరుగులు చేశాడు. చాహర్ క్రీజులో ఉన్నంతవరకు గెలుపు భారత్ దే అనే ధీమా కనిపించింది. చాహర్ ఔట్ కావడంతో సీన్ మారిపోయింది.

Reduce Weight : అధిక బరువును తగ్గించే వేడి నీళ్లు..!

భారత బ్యాటర్లలో శిఖర్ ధావన్(61), విరాట్ కోహ్లి(65) హాఫ్ సెంచరీలతో రాణించారు. సూర్యకుమార్ యాదవ్ (39), శ్రేయస్ అయ్యర్(26) రాణించారు. మిగతా వారిలో కేఎల్‌ రాహుల్ 9, పంత్ డకౌట్, జయంత్ యాదవ్ 2, చాహల్ 2, ప్రసిధ్‌ కృష్ణ 2* పరుగులు చేశారు. సౌతాఫ్రికా బౌలర్లలో లుంగి ఎంగిడి, పెహులుక్వాయో చెరో మూడు వికెట్లు తీశారు. ప్రిటోరియస్ 2 వికెట్లు తీశాడు. మగలా, కేశవ్ మహరాజ్ తలో వికెట్ తీశారు. మూడు వన్డేల సిరీస్ ను ఇప్పటికే కైవసం చేసుకున్న దక్షిణాఫ్రికా.. క్లీన్ స్వీప్ కూడా చేసింది.

కేప్ టౌన్ వేదికగా జరిగిన ఆఖరి మ్యాచ్ లో టాస్‌ ఓడి బ్యాటింగ్‌కు దిగిన దక్షిణాఫ్రికా 287 పరుగులు చేసింది. ఆ జట్టు ఇంత స్కోర్ చేసిందంటే దానికి కారణం.. క్వింటన్ డికాక్. ఓపెనర్ డికాక్ సెంచరీతో మెరిశాడు. 130 బంతుల్లో 124 పరుగులు చేశాడు. మరో బ్యాటర్ డస్సెన్ (52) హాఫ్ సెంచరీతో రాణించాడు. త్వరగానే మూడు వికెట్లు పడినా వీరిద్దరూ కలిసి 144 పరుగుల భాగస్వామ్యం నిర్మించి జట్టును ఆదుకున్నారు.

Vamika Kohli : విరాట్ కోహ్లి కూతురిని చూశారా? ఫస్ట్ ఫొటో వెలుగులోకి..

డికాక్ సెంచరీ బాదడంతో సౌతాఫ్రికా భారీ స్కోర్ చేయడం ఖాయం అనుకున్నారు. భారత బౌలర్లు విజృంభించడంతో దక్షిణాఫ్రికా స్వల్ప వ్యవధిలో 3 వికెట్ల నష్టపోయింది. అయితే మిల్లర్ (39), ప్రిటోరియస్‌ (20) ఫర్వాలేదనిపించారు. దీంతో దక్షిణాఫ్రికా భారత్‌ ముందు చాలెంజింగ్ టార్గెటే ఉంచింది. భారత బౌలర్లలో ప్రసిధ్‌ 3, బుమ్రా 2, చాహర్ 2, చాహల్ ఒక వికెట్ తీశారు.