Ind Vs SA : విరాట్ కోహ్లి హాఫ్ సెంచరీ

కేప్ టౌన్ వేదికగా సౌతాఫ్రికాతో జరుగుతున్న చివరి వన్డే మ్యాచ్ లో విరాట్ కోహ్లి హాఫ్ సెంచరీ చేశాడు. 63 బంతుల్లో 50 పరుగులు చేశాడు కోహ్లి. వన్డే కెరీర్ లో విరాట్ కు ఇది 64వ..

Ind Vs SA : విరాట్ కోహ్లి హాఫ్ సెంచరీ

Virat Kohli

Ind Vs SA : కేప్ టౌన్ వేదికగా సౌతాఫ్రికాతో జరుగుతున్న చివరి వన్డే మ్యాచ్ లో విరాట్ కోహ్లి హాఫ్ సెంచరీ చేశాడు. 63 బంతుల్లో 50 పరుగులు చేశాడు కోహ్లి. వన్డే కెరీర్ లో విరాట్ కు ఇది 64వ అర్థ శతకం.

టీమిండియా ఓపెనర్ శిఖర్ ధావన్ రాణించాడు. హాఫ్ సెంచరీ చేశాడు. 58 బంతుల్లో 50 పరుగులు చేశాడు. ఆ తర్వాత కాసేపటికే ఔటయ్యాడు. 61 పరుగుల వ్యక్తిగత స్కోర్ దగ్గర ధావన్ ని పెహ్లూక్వాయో పెవిలియన్ పంపాడు. భారీ షాట్ కి యత్నించిన ధావన్ డికాక్ చేతికి చిక్కాడు. 116 పరుగుల వద్ద భారత్ ధావన్ రూపంలో రెండో వికెట్‌ను కోల్పోయింది.

Omicron Variant: ఒమిక్రాన్‌ నుంచి ప్రొటెక్షన్‌కి గుడ్డ సరిపోదు.. ఈ మాస్క్‌లే వాడాలి!

ఆ వెంటనే 118 పరుగుల వద్ద భారత్ మూడో వికెట్ కోల్పోయింది. ధావన్ ఔటయ్యాక క్రీజులోకి వచ్చిన రిషబ్ పంత్.. డకౌట్ అయ్యాడు. ఎదుర్కొన్న తొలి బంతికే పంత్ (0) గోల్డెన్‌ డకౌట్‌గా వెనుదిరిగాడు. కీలకమైన సమయంలో అనవసరమైన షాట్‌కు యత్నించి పెవిలియన్‌కు చేరాడు. పెహ్లూక్వాయో బౌలింగ్‌లో పంత్ బౌండరీ కోసం షాట్ ఆడి మగలా చేతికి చిక్కాడు.

Mahesh Babu: గౌతమ్‌ని డబ్బుంది కాబట్టి బతికించుకున్నాం.. లేని వాళ్ళ పరిస్థితి ఏంటి అని ఆలోచించా..

చివరి వన్డే మ్యాచ్ లో టాస్ గెలిచిన టీమిండియా బౌలింగ్ ఎంచుకుంది. తొలుత బ్యాటింగ్ చేసిన దక్షిణాఫ్రికా 49.5 ఓవర్లలో 287 పరుగులకు ఆలౌటైంది. సఫారీ ఇన్నింగ్స్ లో ఓపెనర్ క్వింటన్ డికాక్ సెంచరీ బాదాడు. 130 బంతుల్లో 12 ఫోర్లు, 2 సిక్సర్లతో 124 పరుగులు చేశాడు. మిడిలార్డర్ లో వాన్ డర్ డసెన్ 52, డేవిడ్ మిల్లర్ 39 పరుగులు చేశారు. డ్వేన్ ప్రిటోరియస్ 20 పరుగులు చేశాడు. టీమిండియా బౌలర్లలో ప్రసిద్ధ్ కృష్ణ 3 వికెట్లు తీయగా.. దీపక్ చహర్, జస్ప్రీత్ బుమ్రా తలో రెండు వికెట్లు తీశారు. చహల్ ఒక వికెట్ తీశాడు.