Ind Vs SL 1st ODI : శ్రీలంకతో తొలి వన్డేలో భారత్ విజయం, చివర్లో సెంచరీతో చెలరేగిన శనక

శ్రీలంకతో జరిగిన తొలి వన్డేలో భారత్ 67 పరుగుల తేడాతో విజయం సాధించింది. 374 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన లంక జట్టు.. 50 ఓవర్లలో 8వికెట్ల నష్టానికి 306 పరుగులు చేసింది. చివర్లో లంక కెప్టెన్ శనక సెంచరీతో చెలరేగాడు. 88 బంతుల్లో 108 పరుగులతో నాటౌట్ గా నిలిచాడు. అతడి ఒంటరి పోరాటం వృథా అయ్యింది. లంకకు ఓటమి తప్పలేదు.(Ind Vs SL 1st ODI)

Ind Vs SL 1st ODI : శ్రీలంకతో తొలి వన్డేలో భారత్ విజయం, చివర్లో సెంచరీతో చెలరేగిన శనక

Ind Vs SL 1st ODI : గువాహటి వేదికగా శ్రీలంకతో జరిగిన తొలి వన్డేలో భారత్ 67 పరుగుల తేడాతో విజయం సాధించింది. 374 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన లంక జట్టు.. 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 306 పరుగులు చేసింది. చివర్లో లంక కెప్టెన్ శనక సెంచరీతో చెలరేగాడు. 88 బంతుల్లో 108 పరుగులతో నాటౌట్ గా నిలిచాడు. 12 ఫోర్లు, 3 సిక్సులు బాదాడు. అతడి ఒంటరి పోరాటం వృథా అయ్యింది. లంకకు ఓటమి తప్పలేదు.

లంక బ్యాటర్లలో నిస్సాంక (72), డిసిల్వ(47) రన్స్ చేశారు. భారత బౌలర్లలో ఉమ్రాన్ మాలిక్ 3 వికెట్లు పడగొట్టాడు. సిరాజ్ 2 వికెట్లు తీశాడు. షమీ, పాండ్యా, చహల్ తలో వికెట్ తీశారు.

Also Read..Virat Kohli: సచిన్ రికార్డు సమం చేసిన కోహ్లీ.. స్వదేశంలో 20వ సెంచరీ నమోదు

తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ 7 వికెట్ల నష్టానికి 373 పరుగుల భారీ స్కోర్ చేసింది. కెప్టెన్ రోహిత్ శర్మ (83), ఓపెనర్ శుభ్ మన్ గిల్(70) హాఫ్ సెంచరీలతో చెలరేగారు. స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ సెంచరీతో కదం తొక్కాడు. విరాట్ 87 బంతుల్లోనే 113 పరుగులు చేశాడు. వీరు ధాటిగా ఆడటంతో టీమిండియా భారీ స్కోర్ సాధించింది.

విరాట్ కోహ్లీ అద్భుత సెంచరీకి తోడు.. కెప్టెన్ రోహిత్ శర్మ, శుభ్ మాన్ గిల్ చెలరేగడంతో టీమిండియా నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్లకు 373 పరుగుల భారీ స్కోరు నమోదు చేసింది. ఈ ఇన్నింగ్స్ లో కోహ్లీ సెంచరీ హైలైట్. వన్ డౌన్ లో వచ్చిన కోహ్లీ 87 బంతుల్లో 12 ఫోర్లు, 1 సిక్స్ తో 113 పరుగులు చేశాడు. అంతర్జాతీయ వన్డేల్లో కోహ్లీకిది 45వ సెంచరీ.(Ind Vs SL 1st ODI)

Also Read..Rohit Sharma: టీ20లకు రోహిత్ గుడ్‌బై చెప్తున్నాడా.. రోహిత్ సమాధానం ఇదే!

అంతకుముందు, రోహిత్ శర్మ 83, గిల్ 70 పరుగులు చేసి శుభారంభం అందించడంతో భారత్ భారీ స్కోరుకు సరైన పునాది పడింది. కోహ్లీకి శ్రేయాస్ అయ్యర్ (28), కేఎల్ రాహుల్ (39) నుంచి చక్కని సహకారం లభించింది.

10TV LIVE : నాన్ స్టాప్ న్యూస్ అప్‌డేట్స్ కోసం 10TV చూడండి.

టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న శ్రీలంకకు ఆ నిర్ణయం తప్పని తెలుసుకోవడానికి ఎక్కువ సమయం పట్టలేదు. టీమిండియా బ్యాట్స్ మెన్ ఆరంభం నుంచే దూకుడుగా ఆడుతూ లంక బౌలర్లపై ఒత్తిడి పెంచారు. లంక బౌలర్లలో కసున్ రజిత 3 వికెట్లు తీసినా.. 10 ఓవర్లలో 88 పరుగులు ఇచ్చుకున్నాడు. మధుశంక, కరుణరత్నే, షనక, ధనంజయ డిసిల్వా చెరో వికెట్ తీశారు. సెంచరీతో కదం తొక్కిన విరాట్ కోహ్లీకి ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డ్ దక్కింది. ఈ గెలుపుతో వన్డే సిరీస్ లో భారత్ 1-0 తేడాతో లీడ్ లో ఉంది.

లంకపై భారత్ విజయం..