IND vs SL 1st T20I : శ్రీలంకకు భారీ లక్ష్యం.. చెలరేగిన ఇషాన్ కిషన్.. రోహిత్ వరల్డ్ రికార్డు..!

లక్నో వేదికగా శ్రీలంకతో జరుగుతున్న తొలి టీ20లో టీమిండియా భారీ స్కోరు సాధించింది. ముందుగా బ్యాటింగ్ చేపట్టిన భారత ఓపెనర్లు మంచి శుభారంభాన్ని అందించారు.

IND vs SL 1st T20I : శ్రీలంకకు భారీ లక్ష్యం.. చెలరేగిన ఇషాన్ కిషన్.. రోహిత్ వరల్డ్ రికార్డు..!

Ind Vs Sl 1st T20i Sri Lanka Have Won The Toss And They Will Bowl First In The 1st T20i

IND vs SL 1st T20I : లక్నో వేదికగా శ్రీలంకతో జరుగుతున్న తొలి టీ20లో టీమిండియా భారీ స్కోరు సాధించింది. ముందుగా బ్యాటింగ్ చేపట్టిన భారత ఓపెనర్లు మంచి శుభారంభాన్ని అందించారు. భారత ఓపెనర్ ఇషాన్ కిషన్ (56 బంతుల్లో 89; 10 ఫోర్లు, 3 సిక్స‌ర్లు) మెరుపు బ్యాటింగ్‌తో చెలరేగాడు. టీమిండియా నిర్ణీత 20 ఓవర్లలో 2 వికెట్లు కోల్పోయి 199 పరుగులు చేసింది. దాంతో శ్రీలంక జట్టుకు 200 పరుగుల భారీ విజయలక్ష్యాన్ని నిర్దేశించింది. శ్రేయస్ అయ్యర్ (28 బంతుల్లో 57 పరుగులు; 5 ఫోర్లు, 2 సిక్స‌ర్లు) హాఫ్ సెంచరీ నమోదు చేయగా.. కెప్టెన్ రోహిత్ శర్మ (32 బంతుల్లో 44 పరుగులు, 2 ఫోర్లు, 1 సిక్స‌ర్) అద్భుతంగా రాణించారు. పేలవ ప్రదర్శనతో ఆకట్టుకోలేకపోయిన కిషన్ తొలి టీ20లో చెల‌రేగిపోయాడు. బౌండ‌రీలు, సిక్స‌ర్ల‌తో లంక బౌల‌ర్ల‌కు చుక్కలు చూపించాడు.

30 బంతుల్లో 6 ఫోర్లు, 2 సిక్స‌ర్లతో తన కెరీర్ లోనే రెండో హాఫ్ సెంచ‌రీని తన ఖాతాలో వేసుకున్నాడు. రోహిత్ శర్మ కూడా తనదైన సత్తా చాటాడు. టీమిండియా భారీ స్కోరుకు చేరువ చేయడంలో కీలకంగా వ్యవహరించారు. వీరిద్దరూ కలిసి వంద పరుగుల (111) భాగస్వామ్యాన్ని అందించారు. జట్టు స్కోరు 111 ప‌రుగుల వ‌ద్ద రోహిత్ శ‌ర్మ క్లీన్ బౌల్డ్ అయ్యాడు. అయినప్పటికీ కూడా ఇషాన్ కిషన్ అదే దూకుడుతో ముందుకు సాగాడు. 17వ ఓవ‌ర్లో ఇషాన్ కిష‌న్ వికెట్ కూడా కోల్పోయింది. ష‌న‌క బౌలింగ్‌లో భారీ షాట్‌కు ప్ర‌య‌త్నించి జ‌నిత్ లియ‌నాగేకు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు. శ్రేయస్ అయ్యర్ వరుస బౌండరీలు, సిక్సర్లతో చెలరేగి 25 బంతుల్లో హాఫ్ సెంచరీ నమోదు చేశాడు.

రోహిల్ వరల్డ్ రికార్డు :
ఈ మ్యాచులోనే కెప్టెన్ రోహిత్ వరల్డ్ రికార్డు నమోదు చేశాడు. వ్యక్తిగత స్కోరు 37 పరుగులు వద్ద టీ20 ఫార్మాట్లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా రోహిత్ శర్మ చరిత్ర సృష్టించాడు. రోహిత్ శర్మ 3,307 పరుగులతో మొదటి స్థానంలో నిలిచాడు. న్యూజిలాండ్‌ ఆటగాడు మార్టిన్‌ గప్తిల్ 3,299 పరుగులతో రెండో స్థానానికి నెట్టేశాడు. భారత జట్టు మాజీ కెప్టెన్ విరాట్‌ కోహ్లీ 3,296 పరుగులతో మూడో స్ధానానికి పడిపోయాడు. శ్రీలంక బౌలర్లలో లహీరు కుమారా, దసున్ షనక తలో వికెట్ తీసుకున్నారు.

Read Also : IND vs SL 1st T20I : తొలి టీ20లో టాస్ గెలిచి శ్రీలంక ఫీల్డింగ్.. టీమిండియాలో ఆరు మార్పులు..!