IND vs SL T20I : రెండో టీ20లో చెలరేగిన నిశాంక.. టీమిండియా టార్గెట్ 184

టీమిండియాతో జరుగుతున్న రెండోటీ20లో శ్రీలంక భారీ లక్ష్యాన్ని సాధించింది. లంక 5 వికెట్ల నష్టానికి 183 పరుగులు చేసి 184 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది.

IND vs SL T20I : రెండో టీ20లో చెలరేగిన నిశాంక.. టీమిండియా టార్గెట్ 184

Ind Vs Sl 2nd T20 Sri Lanka Set A Target Of 184 Runs For Team India, Nissanka’s Strong Performance

IND vs SL T20I : టీమిండియాతో ధర్మశాల వేదికగా జరుగుతున్న రెండోటీ20లో శ్రీలంక భారీ లక్ష్యాన్ని సాధించింది. నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి శ్రీలంక 183 పరుగులు చేసింది. దాంతో టీమిండియాకు 184 పరుగుల భారీ విజయ లక్ష్యాన్ని నిర్దేశించింది. లంక ఓపెనర్ పథుమ్ నిశాంక (Pathum Nisanka) హాఫ్ సెంచరీ (53 బంతుల్లో 11ఫోర్లు) 75 పరుగులతో చెలరేగిపోయాడు. తొలుత టాస్ గెలిచిన రోహిత్‌ శర్మ బౌలింగ్‌ ఎంచుకుని శ్రీలంకను బ్యాటింగ్‌కు ఆహ్వానించాడు. భారత బౌలర్లు జస్ ప్రీత్ బుమ్రా, యుజవేంద్ర చాహల్ అద్భుతంగా రాణించారు.

భారత బౌలర్లు ఆరంభంలో కట్టడి చేయడంతో పవర్‌ ప్లే ముగిసే సరికి లంక ఓపెనర్లు 32 పరుగులకే పరిమితమయ్యారు. మరో లంక ఆటగాడు (Danushka Gunathilaka) దనుష్క గుణతిలక (29 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్సులు) 38 పరుగులతో రాణించాడు. వీరిద్దరూ లంక జట్టుకు మంచి శుభారంభాన్ని అందించారు. రవీంద్ర జడేజా వేసిన 8 ఓవర్లో రెండు సిక్సలతో వేగాన్ని పెంచాడు. నాలుగో బంతిని భారీ షాట్‌గా మలిచేందుకు ప్రయత్నించి బౌండరీ వద్ద వెంకటేశ్ అయ్యర్‌కి క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు.

గుణతిలక ఔటయ్యాక క్రీజులోకి వచ్చిన చరిత్‌ అసలంక పేలవ ప్రదర్శనతో ఆకట్టుకోలేకపోయాడు. కేవలం రెండు పరుగులకే అసలంక పరిమితమయ్యాడు. ఆ తర్వాత వచ్చిన మిగతా లంక ఆటగాళ్లలో కమిల్ మిశారా (1), దినేశ్‌ చండిమాల్ (9) సింగిల్ డిజిట్ స్కోరుకే చేతులేత్తేసి వరుసగా పెవిలియన్ చేరారు. లంక వికెట్లను భారత బౌలర్లు వరసుగా పడగొడుతున్నా పట్టువీడని ఆత్మవిశ్వాసంతో ఓపెనర్‌ పథుమ్‌ నిశాంక ఏకంగా 75 పరుగులతో రాణించాడు. నిలకడగా ఆడుతూ ఇన్నింగ్స్‌ని చక్కదిద్దాడు. హాఫ్ సెంచరీ పూర్తి చేశాక మళ్లీ దూకుడును పెంచాడు.


హర్షల్ పటేల్ 17వ ఓవర్లో రెండు సిక్సులు, ఫోర్‌ బాదాడు. బుమ్రా బౌలింగ్‌లో మరో 3 ఫోర్లు బాదాడు. భువనేశ్వర్ కుమార్ 19వ ఓవర్‌ ఆఖరు బంతికి నిశాంక ఎల్బీడబ్ల్యూగా పెవిలియన్ చేరక తప్పలేదు. ఇక కెప్టెన్ దసున్‌ శనక (Dasun Shanaka) 47 పరుగులతో రాణించి నాటౌట్‌గా నిలిచాడు. 19 బంతుల్లో 5 సిక్సులు, 2 ఫోర్లతో 47 పరుగులు సాధించాడు. చివరిగా కరుణ్‌రత్నే ఖాతా తెరవనేలేదు. భారత బౌలర్లలో యుజ్వేంద్ర చాహల్‌, హర్షల్ పటేల్, బుమ్రా, భువనేశ్వర్‌ కుమార్‌ తలో వికెట్ పడగొట్టారు.

Read Also : India Vs SL : కోహ్లీ 100వ టెస్టు.. ప్రేక్షకులు లేకుండానే మ్యాచ్