Ind Vs SL 3rd T20I : భారత్ దెబ్బ లంక అబ్బ.. మూడో టీ20లో టీమిండియా ఘన విజయం, సిరీస్ కైవసం

శ్రీలంకతో జరిగిన మూడో టీ20లో భారత్ అదరగొట్టింది. సూపర్ విక్టరీ కొట్టింది. మూడో టీ20లో 91 పరుగుల తేడాతో టీమిండియా ఘన విజయం సాధించింది. దీంతో సిరీస్ ను 2-1తేడాతో కైవసం చేసుకుంది. 229 పరుగుల భారీ టార్గెట్ తో బరిలోకి దిగిన శ్రీలంకను భారత బౌలర్లు కట్టడి చేశారు. 137 పరుగులకే లంక ఆలౌట్ అయ్యింది.

Ind Vs SL 3rd T20I : భారత్ దెబ్బ లంక అబ్బ.. మూడో టీ20లో టీమిండియా ఘన విజయం, సిరీస్ కైవసం

Ind Vs SL 3rd T20I : శ్రీలంకతో జరిగిన మూడో టీ20లో భారత్ అదరగొట్టింది. సూపర్ విక్టరీ కొట్టింది. మూడో టీ20లో 91 పరుగుల తేడాతో టీమిండియా ఘన విజయం సాధించింది. దీంతో సిరీస్ ను 2-1తేడాతో కైవసం చేసుకుంది. 229 పరుగుల భారీ టార్గెట్ తో బరిలోకి దిగిన శ్రీలంకను భారత బౌలర్లు కట్టడి చేశారు. 137 పరుగులకే లంక ఆలౌట్ అయ్యింది.

లంక బ్యాటర్లలో నిస్సాంక(15), కుశాల్ మెండిస్(23), ధనుంజయ(22), అసలంక(19), శనక(23) రన్స్ చేశారు. భారత బౌలర్లలో అర్ష్ దీప్ సింగ్ 3 వికెట్లు తీశాడు. కెప్టెన్ హార్దిక్ పాండ్య, చాహల్, ఉమ్రాన్ మాలిక్ తలో 2 వికెట్లు పడగొట్టారు. అక్షర్ పటేల్ 1 వికెట్ తీశాడు. రాజ్ కోట్ వేదికగా ఈ మూడో టీ20 మ్యాచ్ జరిగింది. రెండో టీ20లో ఐదు నోబాల్స్ వేసి విలన్ గా మారిన అర్షదీప్ సింగ్ చివరి టీ20లో 3 వికెట్లు తీసి సత్తా చాటాడు.

Also Read..ICC ODI World Cup-2023: కోహ్లీ, రోహిత్ శర్మ ప్రపంచ కప్‌లో కీలక పాత్ర పోషిస్తారు: గంభీర్

ఈ మ్యాచ్ లో టాస్ గెలిచి బ్యాటింగ్ కు దిగిన భారత్.. నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లకు 228 పరుగులు భారీ స్కోర్ చేసింది. మిస్టర్ 360 బ్యాట్స్ మన్ సూర్యకుమార్ యాదవ్ లంక బౌలర్లకు చుక్కలు చూపించాడు. ఆకాశమే హద్దుగా చెలరేడాడు. మెరుపు సెంచరీతో కదం తొక్కాడు. బౌండరీల వర్షం కురిపించాడు. ఈ క్రమంలో సూర్య 51 బంతుల్లోనే 112 పరుగులతో నాటౌట్ గా నిలిచాడు.

ఈ మ్యాచ్ లో విజయంతో మూడు టీ20ల సిరీస్ ను టీమిండియా 2-1తో కైవసం చేసుకుంది. ఇక ఇరు జట్ల మధ్య మూడు వన్డేల సిరీస్ జరగనుంది. తొలి మ్యాచ్ ఈ నెల 10న గౌహతీలో జరగనుంది.

Also Read..Urvashi Rautela: రిషబ్ పంత్ చికిత్స పొందుతున్న హాస్పిటల్ పిక్ షేర్ చేసిన ఊర్వశి.. మండి పడుతున్న నెటిజన్లు

సూర్యకుమార్ యాదవ్ ఇన్నింగ్స్ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిందే. తనకు మాత్రమే సాధ్యమైన రీతిలో చిచ్చరపిడుగులా చెలరేగిన వేళ టీమిండియా భారీ స్కోర్ సాధించింది. సూర్యకుమార్ యాదవ్ ఆకాశమే హద్దుగా చెలరేగి మెరుపు సెంచరీ నమోదు చేశాడు. సూర్య 51 బంతుల్లోనే 112 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. సూర్య స్కోరులో 7 ఫోర్లు, 9 సిక్సర్లు ఉన్నాయంటే అతడి ఊచకోత ఏ విధంగా సాగిందో అర్థం చేసుకోవచ్చు. కేవలం 45 బంతుల్లోనే సెంచరీ పూర్తి చేసుకున్నాడు. సూర్యకుమార్ కు టీ20ల్లో ఇది మూడో సెంచరీ.

10TV LIVE : నాన్ స్టాప్ న్యూస్ అప్‌డేట్స్ కోసం 10TV చూడండి.

మిస్టర్ 360 ఊచకోత..

మిస్టర్ 360 సూపర్ సెంచరీతో భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లకు 228 పరుగులు సాధించింది. ఓపెనర్ శుభ్ మాన్ గిల్ (36 బంతుల్లో 46 పరుగులు..3 సిక్సులు, 2 ఫోర్లు), రాహుల్ త్రిపాఠి (16 బంతుల్లో 35 పరుగులు.. 5 ఫోర్లు, 2 సిక్సులు) రాణించారు. ఓపెనర్ ఇషాన్ కిషన్ 1, కెప్టెన్ హార్దిక్ పాండ్యా 4, దీపక్ హుడా 4 పరుగులకే ఔటై నిరాశపరిచారు.