India Vs Sri Lanka: చేతులెత్తేసిన భారత్ టాప్ ఆర్డర్.. డిసైడింగ్ మ్యాచ్‌లో ఓటమి దిశగా!

నిర్ణయాత్మక టీ20 ఇంటర్నేషనల్ మ్యాచ్‌లో టీమిండియా టాప్ ఆర్డర్ చేతులెత్తేసింది. శ్రీలంకతో జరుగుతోన్న మ్యాచ్‌లో 81పరుగులకే భారత్ ఇన్నింగ్స్ ముగించింది.

India Vs Sri Lanka: చేతులెత్తేసిన భారత్ టాప్ ఆర్డర్.. డిసైడింగ్ మ్యాచ్‌లో ఓటమి దిశగా!

Has

India Vs Sri Lanka, 3rd T20 International: నిర్ణయాత్మక టీ20 ఇంటర్నేషనల్ మ్యాచ్‌లో టీమిండియా టాప్ ఆర్డర్ చేతులెత్తేసింది. శ్రీలంకతో జరుగుతోన్న మ్యాచ్‌లో 36పరుగులకే 5వికెట్లు కోల్పోయింది. తొలుత టాస్ గెలిచిన భారత జట్టు కెప్టెన్ శిఖర్ ధావన్.. బ్యాటింగ్ ఎంచుకోగా.. నిర్ణీత 20ఓవర్లలో 8వికెట్ల నష్టానికి కేవలం 81పరుగులు మాత్రమే చేయగలిగారు.

భారత్ తరపున కుల్‌దీప్ యాదవ్ మాత్రమే 20పరుగుల స్కోరు చేయగలిగాడు. టాప్ ఆర్డర్ ఆటగాళ్లు టపాటాపా పడిపోయి.. పెవీలియన్ చేరుకున్నారు. కెప్టెన్ శిఖర్ దావన్, వికెట్ కీపర్ సంజూ శాంసన్, వరుణ్ చక్రవర్తిలు ఈ మ్యాచ్‌లో పరుగులేమీ చెయ్యకుండానే డకౌట్ అయ్యారు. భువనేశ్వర్ కుమార్ 16పరుగులు చెయ్యగా.. రుతురాజ్ గైక్వాడ్ 14పరుగులు, పాడిక్కల్ 9పరుగులు, నితీష్ రాణా 6పరుగులు, రాహుల్ చాహర్ 5పరుగులు చేశారు.

చెత్త రికార్డును తప్పించుకుని..
శ్రీలంకతో జరుగుతున్న మూడో టీ20లో టీమిండియా నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 81 పరుగులే చేయగా.. టీ20 క్రికెట్‌లో ఇది భారత్‌కు రెండో అత్యల్ప స్కోరు 74(2008లో ఆస్ట్రేలియా)లో అంతకుముందు తక్కువ స్కోరుతో చెత్త రికార్డు ఉంది. మరోవైపు శ్రీలంక స్పిన్నర్‌ వానిండు హసరంగ 9పరుగులు ఇచ్చి నాలుగు వికెట్లు తీశాడు, డాసున్‌ శనక 20పరుగులు ఇచ్చి 2వికెట్లు తీసి అత్యుత్తమ గణాంకాలు నమోదు చేశారు.

హసరంగ తీసిన నాలుగు వికెట్ల రికార్డు ఇప్పటివరకు టాప్ రికార్డ్..

టీ20ల్లో ఉత్తమ బౌలింగ్..
4/9 వనిండు హసరంగ vs ఇండియా, కొలంబో (29 జూలై 2021)
4/21 ఇమ్రాన్ తాహిర్ vs నెదర్లాండ్స్, చిట్టగాంగ్ (27 మార్చి 2014)
3/23 యువరాజ్ సింగ్ vs శ్రీలంక, మొహాలీ (12 డిసెంబర్ 2009)