Ind vs SL: కోహ్లీ 100వ టెస్టు కోసం.. స్టేడియాల్లోకి అభిమానులు

ఇండియా.. శ్రీలంకల మధ్య జరిగే తొలి టెస్టు బ్యాట్స్‌మన్‌గా విరాట్ కోహ్లీకి వందో టెస్టు. ఈ మ్యాచ్ ను ప్రేక్షకుల ముందు నిర్వహించేందుకు పూర్తి స్థాయి పరిమితులు అందాయి.

Ind vs SL: కోహ్లీ 100వ టెస్టు కోసం.. స్టేడియాల్లోకి అభిమానులు

Virat Kohli

Ind vs SL: ఇండియా.. శ్రీలంకల మధ్య జరిగే తొలి టెస్టు బ్యాట్స్‌మన్‌గా విరాట్ కోహ్లీకి వందో టెస్టు. ఈ మ్యాచ్ ను ప్రేక్షకుల ముందు నిర్వహించేందుకు పూర్తి స్థాయి పరిమితులు అందాయి. ఇప్పటివరకూ క్లోజ్‌డ్ డోర్ల మధ్య నిర్వహిస్తున్న మ్యాచ్ లను ఓపెన్ గా నిర్వహించనున్నట్లు బీసీసీఐ సెక్రటరీ జై షా స్టేట్మెంట్ లో వెల్లడించారు.

‘ఇండియా.. శ్రీలంకల మధ్య జరిగే తొలి టెస్టు పంజాబ్ లోని మొహాలీ స్టేడియం వేదికగా జరగనుంది. కాకపోతే ఇది క్లోజ్ డ్ డోర్స్ మధ్య నిర్వహించదలచుకోలేదు. రాష్ట్ర క్రికెట్ అసోసియేషన్స్ నిర్ణయం మేరకే ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా అభిమానులను స్టేడియాల్లోకి అనుమతిస్తున్నాం. పీసీఏ ఆఫీస్ బేరర్లను సంప్రదించాం. చరిత్రాత్మకమైన విరాట్ కోహ్లీ వందో టెస్టును చూసేందుకు స్టేడియాల్లోకి అభిమానులు రావొచ్చు’ అని పేర్కొన్నారు.

వెస్టిండీస్‌తో జరిగే వైట్ బాల్ సిరీస్ కూడా క్లోజ్‌డ్ డోర్స్ మధ్య నిర్వహించామని బీసీసీఐ సెక్రటరీ చెప్పారు.

Read Also: ప్లేయర్‌లా ఉన్నప్పటికీ కెప్టెన్‌లాగే ఆడతా- విరాట్ కోహ్లీ

‘విరాట్ కోహ్లీ 100వ టెస్టు కోసం చూస్తున్నా. మా ఛాంపియన్ క్రికెటర్ బెస్ట్ పర్ ఫార్మెన్స్ చూడాలనుకుంటున్నాం. అభిమానులందరికీ ఇది ప్రత్యేక సందర్భం. ఇకపై తర్వాత కూడా చాలా మ్యాచ్ లకు అతను ఆడతాడని భావిస్తున్నాం’ అంటూ పంజాబ్ క్రికెట్ అసోసియేషన్ కన్ఫామ్ చేసింది.