IND vs WI: 20వేల మంది వరకూ ఓకే.. మూడో టీ20కి బీసీసీఐ పర్మిషన్

ఈడెన్ గార్డెన్స్ వేదికగా జరగనున్న మూడో టీ20కి బీసీసీఐ ప్రత్యేక అనుమతులిచ్చింది. క్రికెట్ అసోసియేషన్ ఆఫ్ బెంగాల్ సభ్యులు చర్చలు జరిపి 20వేల మంది స్టేడియానికి రావొచ్చని వెల్లడించారు.

IND vs WI: 20వేల మంది వరకూ ఓకే.. మూడో టీ20కి బీసీసీఐ పర్మిషన్

Eden Gardens

IND vs WI: ఈడెన్ గార్డెన్స్ వేదికగా జరగనున్న మూడో టీ20కి బీసీసీఐ ప్రత్యేక అనుమతులిచ్చింది. క్రికెట్ అసోసియేషన్ ఆఫ్ బెంగాల్ సభ్యులు చర్చలు జరిపి 20వేల మంది స్టేడియానికి రావొచ్చని వెల్లడించారు.

‘మిగతా ఆఫీస్ బేరర్లతో చర్చలు జరిపి.. మీ రిక్వెస్ట్ ప్రకారం ఈడెన్ గార్డెన్స్ వేదికగా వెస్టిండీస్ తో జరిగే మూడో టీ20కి స్టేడియం తెరిచి ఉంచుకోవచ్చు’ అని బీసీసీఐ ప్రెసిడెంట్ సౌరవ్ గంగూలీ.. సీఏబీ చీఫ్ అవిశేక్ దాల్మియాకు రాసిన ఈ-మెయిల్ లో పేర్కొన్నారు.

దీంతో సీఏబీ దాని సభ్యులకు ఇతర వర్గాలకు మాత్రమే కాంప్లిమెంటరీ టిక్కెట్లు పంపిణీ చేయనుంది.

Read Also: కోల్‌కతాకు కెప్టెన్‌గా శ్రేయాస్ అయ్యర్

‘ఈ విజ్ఞప్తిని పట్టించుకునేందుకు బీసీసీఐకు థ్యాంక్స్ చెబుతున్నాం. లైఫ్ అసోసియేట్, యానువల్, హానరరీ సభ్యుల కోరిక మేరకు సీఏబీ చర్చలు సహకారం అందించాయి’ అని అవిశేక్ దాల్మియా అన్నారు.

గతంలో పీటీఐతో జరిపిన ఇంటర్వ్యూలో స్టేడియాలకు ప్రేక్షకులను అనుమతించమని గంగూలీ అన్నారు. ప్లేయర్ల కోసం వారి హెల్త్ రిస్క్ లో పెట్టదలచుకోలేదని అన్నారు. అప్పుడే దాల్మియా కొందరు అభిమానులైనైనా అనుమతించాలని రిక్వెస్ట్ చేశారు.