Ind Vs WI : చెలరేగిన చాహల్… 1000వ వన్డేలో భారత్ టార్గెట్ 177

వెస్టిండీస్ తో వన్డే మ్యాచ్ లో భారత బౌలర్లు రాణించారు. విండీస్ బ్యాటర్లను కట్టడి చేశారు. ఫలితంగా విండీస్ జట్టు తక్కువ స్కోర్ కే పరిమితం అయ్యింది.

Ind Vs WI : చెలరేగిన చాహల్… 1000వ వన్డేలో భారత్ టార్గెట్ 177

Ind Vs Wi

Ind Vs WI : వెస్టిండీస్ తో వన్డే మ్యాచ్ లో భారత బౌలర్లు రాణించారు. విండీస్ బ్యాటర్లను కట్టడి చేశారు. ఫలితంగా విండీస్ జట్టు తక్కువ స్కోర్ కే పరిమితం అయ్యింది. అహ్మదాబాద్ వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్ లో టాస్‌ గెలిచిన భారత్‌ బౌలింగ్‌ ఎంచుకుంది. తొలుత బ్యాటింగ్‌ చేసిన విండీస్‌ 43.5 ఓవర్లలో 176 పరుగులకే ఆలౌట్ అయ్యింది. భారత్‌కు 177 పరుగుల స్వల్ప టార్గెట్ నిర్దేశించింది.

పర్యాటక జట్టు ఈ మాత్రం స్కోరైనా చేసిందంటే దానికి ప్రధాన కారణం జాసన్‌ హోల్డర్‌ (57 పరుగులు). హోల్డర్‌తో పాటు ఫాబియన్‌ అలెన్ (29 పరుగులు) ఫర్వాలేదనిపించాడు. విండీస్‌ కెప్టెన్ కీరన్‌ పొలార్డ్‌ (0) గోల్డెన్‌ డకౌట్‌గా వెనుదిరిగాడు. చాహల్‌ బౌలింగ్‌లో మొదటి బంతికే క్లీన్‌ బౌల్డ్ అయ్యాడు.

Raj Angad Bawa: ఒకప్పుడు గోల్డ్ మెడల్ విన్నర్ మనువడే వరల్డ్ కప్ విన్నర్

భారత బౌలర్ల దెబ్బకు 79 పరుగులకే ఆరు వికెట్లను కోల్పోయిన విండీస్‌ను హోల్డర్-అలెన్ కలిసి హాఫ్ సెంచరీ (78) భాగస్వామ్యం నిర్మించి ఆదుకున్నారు.

U19 World Cup 2022: తరాలు మారినా తిరుగులేనిది U19 టీమిండియా చరిత్ర… కైఫ్ నుంచి యశ్ వరకూ

భారత బౌలర్లలో స్పిన్నర్లు చాహల్ (4/49), వాషింగ్టన్ సుందర్‌ (3/30) విండీస్‌ను చావుదెబ్బ కొట్టారు. వెస్టిండీస్‌ మిగతా బ్యాటర్లలో షై హోప్‌ 8, బ్రాండన్ కింగ్ 13, డారెన్ బ్రావో 18, బ్రూక్స్ 12, పూరన్ 18, జోసెఫ్‌ 13(నాటౌట్) పరుగులు చేశారు. భారత బౌలర్లలో చాహల్ 4, సుందర్‌ 3, ప్రసిధ్‌ కృష్ణ 2, సిరాజ్‌ ఒక వికెట్‌ తీశారు.

కాగా, భారత్‌కు ఇది చారిత్రక మ్యాచ్‌. టీమిండియాకు ఇది 1000వ వన్డే మ్యాచ్. వన్డే క్రికెట్ లో ఇన్ని మ్యాచులు ఆడిన తొలి జట్టుగా టీమిండియా రికార్డులకెక్కింది.