Ind Vs WI : చారిత్రక 1000వ వన్డేలో భారత్ ఘనవిజయం

చారిత్రక 1000వ వన్డేలో భారత జట్టు చిరస్మరణీయ విజయాన్ని సాధించింది. మూడు వన్డేల సిరీస్ లో భాగంగా వెస్టిండీస్ తో జరిగిన తొలి వన్డేలో టీమిండియా 6 వికెట్ల తేడాతో ఘనవిజయం నమోదు చేసింది.

Ind Vs WI : చారిత్రక 1000వ వన్డేలో భారత్ ఘనవిజయం

India Won On West Indies

Ind Vs WI : చారిత్రక 1000వ వన్డేలో భారత జట్టు చిరస్మరణీయ విజయాన్ని సాధించింది. మూడు వన్డేల సిరీస్ లో భాగంగా వెస్టిండీస్ తో జరిగిన తొలి వన్డేలో టీమిండియా 6 వికెట్ల తేడాతో ఘనవిజయం నమోదు చేసింది. అహ్మదాబాద్ నరేంద్రమోదీ స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్ లో విండీస్ నిర్దేశించిన 177 పరుగుల టార్గెట్ ను రోహిత్ సేన కేవలం 28 ఓవర్లలోనే 4 వికెట్లు కోల్పోయి ఛేదించింది.

కెప్టెన్ రోహిత్ శర్మ హాఫ్ సెంచరీతో అదరగొట్టాడు. ఓపెనర్ గా బరిలోకి దిగిన రోహిత్ శర్మ 51 బంతుల్లో (10 ఫోర్లు, ఒక సిక్స్) 60 పరుగులు చేశాడు. మరో ఓపెనర్ ఇషాన్ కిషన్ 28 పరుగులు చేయగా, మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లి కేవలం 8 పరుగులే చేసి నిరాశపరిచాడు. రిషబ్ పంత్ (11) రనౌట్ రూపంలో వెనుదిరిగాడు.

Raj Angad Bawa: ఒకప్పుడు గోల్డ్ మెడల్ విన్నర్ మనువడే వరల్డ్ కప్ విన్నర్

మిడిలార్డర్ లో సూర్యకుమార్ యాదవ్ (34 నాటౌట్), దీపక్ హుడా (26 నాటౌట్) ఎలాంటి తడబాటు లేకుండా మ్యాచ్ ను ముగించారు. దీపక్ హుడాకు ఇదే తొలి అంతర్జాతీయ వన్డే మ్యాచ్. విండీస్ బౌలర్లలో పేసర్ అల్జారీ జోసెఫ్ 2, స్పిన్నర్ అకీల్ హోసీన్ 1 వికెట్ తీశారు.

టాస్ ఓడి బ్యాటింగ్ కు దిగిన వెస్టిండీస్ జట్టు 43.5 ఓవర్లలో 176 పరుగులకే ఆలౌటైంది. జాసన్ హోల్డర్ 57 పరుగులతో టాప్ స్కోరర్ గా నిలిచాడు. ఈ మ్యాచ్ లో భారత బౌలర్లు అదరగొట్టాడు. విండీస్ బ్యాటర్లను బెంబేలెత్తించారు. భారత బౌలర్లు విజృంభించడంతో మొదట బ్యాటింగ్ కు దిగిన వెస్టిండీస్ 43.5 ఓవర్లలో 176 పరుగులకు ఆలౌటైంది. విండీస్ ఆటగాళ్లు పరుగులు చేసేందుకు ఆపసోపాలు పడ్డారు.

ముఖ్యంగా స్పిన్నర్లు యజువేంద్ర చాహల్ (4/49), వాషింగ్టన్ సుందర్ (3/30) కరీబియన్లను కకాకవిలం చేశారు. కాగా, ఆల్ రౌండర్ జాసన్ హోల్డర్ హాఫ్ సెంచరీతో జట్టుని ఆదుకున్నాడు. హోల్డర్ 71 బంతుల్లో 57 పరుగులు చేశాడు. అతడికి లోయరార్డర్ లో ఫాబియన్ అలెన్ (29) నుంచి సహకారం లభించింది. దాంతో విండీస్ స్కోరు 150 మార్కు దాటింది. భారత బౌలర్లలో చాహల్ 4, సుందర్ 3, ప్రసిద్ధ్ కృష్ణ 2, సిరాజ్ ఒక వికెట్ తీశారు. నాలుగు వికెట్లు తీసి విండీస్ పతనాన్ని శాసించిన చాహల్ కు ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ దక్కింది.

U19 World Cup 2022: తరాలు మారినా తిరుగులేనిది U19 టీమిండియా చరిత్ర… కైఫ్ నుంచి యశ్ వరకూ

 

కాగా, ఈ మ్యాచ్ లో విజయంతో మూడు వన్డేల సిరీస్ లో 1-0 తేడాతో భారత్ ఆధిక్యంలో ఉంది. ఇరు జట్ల మధ్య రెండో వన్డే ఈ నెల 9న ఇదే మైదానంలో జరగనుంది.

స్కోర్లు..
వెస్టిండీస్-176
భారత్-28 ఓవర్లలో 178/4