Visakha ODI: విశాఖలో 19న ఇండియా-ఆస్ట్రేలియా వన్డే మ్యాచ్.. టిక్కెట్ల విక్రయం ప్రారంభం

మార్చి 10, శుక్రవారం సాయంత్రం నాలుగు గంటల నుంచి టిక్కెట్లు ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉంటాయి. మార్చి 14 నుంచి ఆఫ్‌లైన్ టిక్కెట్ల విక్రయం ప్రారంభమవుతుంది. ఆన్‌లైన్‌లో టిక్కెట్లు కావాలనుకునే వాళ్లు పేటీఎం యాప్, పేటీఎం ఇన్‌సైడర్ యాప్, ఇన్‌సైడర్.ఇన్ వెబ్‌సైట్‌ల నుంచి కొనుగోలు చేయవచ్చు.

Visakha ODI: విశాఖలో 19న ఇండియా-ఆస్ట్రేలియా వన్డే మ్యాచ్.. టిక్కెట్ల విక్రయం ప్రారంభం

Visakha ODI: ఇండియా-ఆస్ట్రేలియా జట్ల మధ్య ఈ నెల 19న విశాఖపట్నంలో వన్డే మ్యాచ్ జరగబోతుంది. ఇది డే అండ్ నైట్ మ్యాచ్. ఈ మ్యాచ్‌కు సంబంధించిన టిక్కెట్ల విక్రయం నేటి నుంచి ప్రారంభం కానుంది. మార్చి 10, శుక్రవారం సాయంత్రం నాలుగు గంటల నుంచి టిక్కెట్లు ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉంటాయి.

YS Viveka Case: వివేకా హత్య కేసులో అరెస్టు చేయకుండా ఆదేశాలివ్వండి.. కోర్టులో అవినాష్ రెడ్డి పిటిషన్

మార్చి 14 నుంచి ఆఫ్‌లైన్ టిక్కెట్ల విక్రయం ప్రారంభమవుతుంది. ఆన్‌లైన్‌లో టిక్కెట్లు కావాలనుకునే వాళ్లు పేటీఎం యాప్, పేటీఎం ఇన్‌సైడర్ యాప్, ఇన్‌సైడర్.ఇన్ వెబ్‌సైట్‌ల నుంచి కొనుగోలు చేయవచ్చు. ఆఫ్‌లైన్‌లో టిక్కెట్లు కావాలనుకునే వాళ్లు ఈ నెల 14 నుంచి పీఎం పాలెం క్రికెట్ స్టేడియం-బి, జీవీఎంసీ మున్సిపల్ స్టేడియం, రాజీవ్ గాంధీ క్రీడా ప్రాంగణాల్లో కొనుగోలు చేయవచ్చు. టికెట్ల ధరలు రూ.600, రూ.1,500, రూ.2000, రూ.3000, రూ.3,500, రూ.6000గా ఉండే అవకాశాలున్నాయి. ఇప్పటికే ఇండియా-ఆస్ట్రేలియా జట్ల మధ్య నాలుగో టెస్టు జరుగుతున్న సంగతి తెలిసిందే.

Germany Shooting: జర్మనీలోని హ్యాంబర్గ్‌ చర్చిలో కాల్పులు.. పలువురి మృతి

ఈ టోర్నీ ముగిసిన తర్వాత ఇరు జట్ల మధ్య వన్డే టోర్నీ ఆరంభమవుతుంది. ఇది మూడు వన్డేల సిరీస్. ఇందులో తొలి వన్డే ముంబైలోని వాంఖడే స్టేడియంలో ఈ నెల 17న జరుగుతుంది. తర్వాత రెండో వన్డే 19న విశాఖపట్నంలో జరుగుతుంది. మూడో వన్డే చెపాక్ స్టేడియంలో జరుగుతుది. విశాఖపట్నంలో చివరిసారిగా వన్డే మ్యాచ్ 2019లో జరిగింది. గత ఏడాది మాత్రం ఇక్కడ ఒక టీ20 మ్యాచ్ జరిగింది.