Hockey India: నాలుగు దశాబ్దాల తర్వాత సెమీస్‌కు చేరిన టీమిండియా

క్వార్టర్ ఫైనల్స్‌లో 3-1 విజయాన్ని నమోదు చేసిన భారత హాకీ జట్టు టోక్యో ఒలింపిక్స్‌లో సెమీ ఫైనల్‌లోకి ప్రవేశించింది. ఈ విధంగా భారత పతక ఆశలు చిగురించాయి.

Hockey India: నాలుగు దశాబ్దాల తర్వాత సెమీస్‌కు చేరిన టీమిండియా

India (1)

Hockey India Enters Semi-Finals: క్వార్టర్ ఫైనల్స్‌లో 3-1 విజయాన్ని నమోదు చేసిన భారత హాకీ జట్టు టోక్యో ఒలింపిక్స్‌లో సెమీ ఫైనల్‌లోకి ప్రవేశించింది. ఈ విధంగా భారత పతక ఆశలు చిగురించాయి. భారత హాకీ జట్టు 41సంవత్సరాల తర్వాత ఒలింపిక్స్‌లో సెమీ ఫైనల్‌కు చేరుకుంది. సెమీ ఫైనల్స్‌లో కూడా ఇదేరకమైన ఆట కొనసాగుతుందని భావిస్తున్నారు. చివరిసారి 1972లో భారత జట్టు ఒలింపిక్ సెమీస్‌లోకి అడుగుపెట్టింది. ఆ తర్వాత ఎప్పుడూ భారత జట్టు క్వార్టర్స్ దాటలేదు. 1980 ఒలింపిక్స్‌లో భారత జట్టు స్వర్ణం సాధించినప్పటికీ ఆ ఎడిషన్‌లో సెమీ ఫైనల్ స్టేజ్ లేదు. సెమీస్‌కు చేరిన భారత జట్టు ఈ నెల 3న బెల్జియంతో తలపడుతుంది.

భారత్ తరఫున ఏడో నిమిషంలో దిల్‌ప్రీత్ సింగ్, 16 వ నిమిషంలో గుర్జంత్ సింగ్, 57 వ నిమిషంలో హార్దిక్ సింగ్ గోల్స్ చేశారు. 45వ నిమిషంలో బ్రిటన్ తరఫున శామ్యూల్ వార్డ్ ఏకైక గోల్ సాధించాడు. సెమీ ఫైనల్స్‌లో, మూడో క్వార్టర్ ఫైనల్ మ్యాచ్‌లో స్పెయిన్‌ను 3-1తో ఓడించిన ప్రపంచ ఛాంపియన్ బెల్జియంతో భారత్ తలపడుతుంది. రెండో సెమీ ఫైనల్లో ఆస్ట్రేలియా మరియు జర్మనీ తలపడతాయి. రోజు ప్రారంభ మ్యాచ్‌లో జర్మనీ 3-1తో ఒలింపిక్ ఛాంపియన్ అర్జెంటీనాను ఓడించగా, పెనాల్టీ షూటౌట్ తర్వాత ఆస్ట్రేలియా 3-0తో నెదర్లాండ్స్‌ను ఓడించింది.

ఒలింపిక్స్‌లో భారత్ చివరిసారిగా బంగారు పతకం 1980 మాస్కో ఒలింపిక్స్‌లో సాధించింది. ఆతర్వాత ఇప్పుడే మళ్లీ భారత్‌కు బంగారు ఆశలు చిగురించాయి. భారత బ్యాడ్మింటన్ స్టార్ పీవీ సింధు టోక్యో ఒలింపిక్స్‌లో కాంస్య పతకం సాధించి చరిత్ర సృష్టించగా.. ఆదివారం(1 ఆగస్ట్ 2021) ఒలింపిక్స్‌లో భారత్‌కు కలిసి వచ్చిందనే చెప్పాలి.