Olympic : క్వార్టర్‌ ఫైనల్‌కు చేరిన భారత హాకీ టీం

భారత పురుషుల హాకీ జట్టు విజయం సాధించింది. క్వార్టర్ ఫైనల్ దశకు అర్హత సాధించింది. మన్ ప్రీత్ సింగ్ నాయకత్వంలతోని టీమిండియా జట్టు..గురువారం జరిగిన పూల్ ఏ నాలుగో మ్యాచ్ లో 3-1 గోల్స్ తేడాతో అర్జెంటినా (2016 రియో ఒలింపిక్స్ స్వర్ణ పతకం) ఓడించడం గమనార్హం.

Olympic : క్వార్టర్‌ ఫైనల్‌కు చేరిన భారత హాకీ టీం

India Hockey

India Vs Argentina : ఒలింపిక్స్ 2021లో భారత క్రీడాకారులు రాణిస్తున్నారు. ఇప్పటికే వెయిట్ లిఫ్టింగ్ లో రజత పతకం సాధించిన సంగతి తెలిసిందే. భారత బాక్సర్ లవ్లీనా సెమీస్ కు దూసుకెళ్లడం విశేషం. క్వార్టర్స్ లో చైనీస్ తైపీ బాక్సర్ పై లవ్లీనా విజయం సాధించారు. తాజాగా..భారత పురుషుల హాకీ జట్టు విజయం సాధించింది. క్వార్టర్ ఫైనల్ దశకు అర్హత సాధించింది. మన్ ప్రీత్ సింగ్ నాయకత్వంలతోని టీమిండియా జట్టు..గురువారం జరిగిన పూల్ ఏ నాలుగో మ్యాచ్ లో 3-1 గోల్స్ తేడాతో అర్జెంటినా (2016 రియో ఒలింపిక్స్ స్వర్ణ పతకం) ఓడించడం గమనార్హం. ఈ విజయం ద్వారా క్వార్టర్ బెర్త్ ను ఖరారు చేసుకుంది.

Read More : Jet pack : అమెరికా గగనతలంలో సంచరిస్తున్న జెట్ ప్యాక్ మనుషులు

తొలి క్వార్టర్ లో గోల్ అప్పగించిన భారత హాకీ క్రీడాకారులు తర్వాత పుంజుకున్నారు. ప్రత్యర్థికి ఛాన్స్ ఇవ్వకుండా..ఒత్తిడి పెట్టారు. గోల్ పోస్టులపై వైపు దూసుకపోయారు. దీంతో మూడు గోల్స్ సాధించింది భారత్ హాకీ టీం. వరుణ్ కుమార్, వివేక్ సాగర్ ప్రసాద్, హర్మన్ ప్రీత్ సింగ్ గోల్స్ చేశారు. మొత్తంగా…పూల్ ‘ఏ’ నుంచి కనీసం రెండోస్థానంలో భారత్ క్వార్టర్స్ చేరడం ఖాయమైంది. చివరి లీగ్ మ్యాచ్ లో జపాన్ తో భారత్ తలపడనుంది. ఈ మ్యాచ్ లో విజయం సాధించాలని హాకీ అభిమానులు కోరుకుంటున్నారు.