India: న్యూజిలాండ్ సిరీస్‌కు భారత జట్టు ఎంపిక.. వన్డే కెప్టెన్‌గా శిఖర్ ధావన్.. టీ20 కెప్టెన్‌గా హార్ధిక్ పాండ్యా

వచ్చే నెలలో న్యూజిలాండ్‌తో జరగబోయే సిరీస్ కోసం భారత జట్టును బీసీసీఐ ఎంపిక చేసింది. ఈ సిరీస్‌లో భారత జట్టు మూడు టీ20లు, మూడు వన్డేలు ఆడుతుంది. రెండు సిరీస్‌లకు వేర్వేరు జట్లను ఎంపిక చేసింది.

India: న్యూజిలాండ్ సిరీస్‌కు భారత జట్టు ఎంపిక.. వన్డే కెప్టెన్‌గా శిఖర్ ధావన్.. టీ20 కెప్టెన్‌గా హార్ధిక్ పాండ్యా

India: వచ్చే నెలలో న్యూజిలాండ్‌తో జరగనున్న మూడు టీ20లు, మూడు వన్డేల సిరీస్‌కు భారత జట్టును బీసీసీఐ ఎంపిక చేసింది. టీ20, వన్డేలకు 16 మందితో కూడిన రెండు వేర్వేరు జట్లను సెలెక్ట్ చేసింది. బీసీసీఐకి చెందిన సెలక్షన్ కమిటీ చైర్మన్ చేతన్ శర్మ జట్టు వివరాల్ని సోమవారం మీడియాకు వెల్లడించారు.

Morbi Bridge Collapse: కేబుల్ బ్రిడ్జి కూలిన ఘటనలో నలుగురి అరెస్టు.. కొనసాగుతున్న విచారణ

ప్రస్తుత టీ20 వరల్డ్ కప్‌లో కెప్టెన్‌గా వ్యవహరిస్తున్న రోహిత్ శర్మతోపాటు, కేఎల్ రాహుల్, విరాట్ కోహ్లీకి ఈ టోర్నీకి విశ్రాంతినిచ్చింది. దీంతో వన్డే టోర్నీకి శిఖర్ ధావన్ కెప్టెన్‌గా వ్యవహరించబోతుండగా, టీ20లకు హార్ధిక్ పాండ్యా కెప్టెన్‌గా ఉండబోతున్నారు. రెండు సిరీస్‌లకు రిషబ్ పంత్ వైస్ కెప్టెన్‌గా కొనసాగుతాడు. దినేష్ కార్తీక్‌కు చోటు దక్కలేదు. కుల్‌దీప్ సేన్‌ను వన్డే జట్టు కోసం మొదటిసారిగా జాతీయ జట్టుకు ఎంపిక చేశారు. ఉమ్రాన్ మాలిక్‌కు చాలా రోజుల తర్వాత చోటు దక్కింది. నవంబర్ 18, 20, 22 తేదీల్లో టీ20లు, 25, 27, 30 తేదీల్లో వన్డే మ్యాచ్‌లు జరుగుతాయి. టీ 20 వరల్డ్ కప్ పూర్తవ్వగానే ఈ టోర్నీ మొదలవుతుంది.

iPhone Factory: చైనాలో ఐఫోన్ ఫ్యాక్టరీలో విజృంభిస్తున్న కోవిడ్.. భయంతో పారిపోతున్న కార్మికులు.. వీడియోలు వైరల్

టీ20 జట్టు: హార్ధిక్ పాండ్యా (కెప్టెన్), రిషబ్ పంత్ (వైసె కెప్టెన్), ఇషాన్ కిషన్, శుభ్‌మన్ గిల్, దీపక్ హుడా, సూర్య కుమార్ యాదవ్, శ్రేయస్ అయ్యర్, సంజు శామ్సన్, వాషింగ్టన్ సుందర్, యుజువేంద్ర చాహల్, కుల్దీప్ యాదవ్, హర్షల్ పటేల్, మొహమ్మద్ సిరాజ్, భువనేశ్వర్ కుమార్, అర్ష్‌దీప్ సింగ్, ఉమ్రాన్ మాలిక్
వన్డే జట్టు: శిఖర్ ధావన్ (కెప్టెన్), రిషబ్ పంత్ (వైసె కెప్టెన్), శుభ్‌మన్ గిల్, దీపక్ హుడా, సూర్య కుమార్ యాదవ్, శ్రేయస్ అయ్యర్, సంజు శామ్సన్, వాషింగ్టన్ సుందర్, యుజువేంద్ర చాహల్, కుల్దీప్ యాదవ్, షాబాజ్ అహ్మద్, ఉమ్రాన్ మాలిక్, కుల్‌దీప్ సేన్‌, అర్ష్‌దీప్ సింగ్, షార్దూల్ ఠాకూర్, దీపక్ చాహర్