#BorderGavaskarTrophy: ఆస్ట్రేలియాతో మిగతా 2 టెస్టులకు టీమిండియాలో మార్పుల్లేవ్.. తొలి వన్డేకు మాత్రం రోహిత్ దూరం

బార్డర్ గవాస్కర్ ట్రోఫీలో భాగంగా ఆస్ట్రేలియాతో జరగాల్సిన మిగతా 2 టెస్టులకు టీమిండియాలో ఎటువంటి మార్పులూ లేవని బీసీసీఐ ప్రకటించింది. మెరుగైన ప్రదర్శన ఇవ్వలేకపోతున్న కేఎల్ రాహుల్ ను మూడు, నాలుగో టెస్టుల్లో ఆడనివ్వబోరంటూ మొదట ప్రచారం జరిగింది. అయితే, టీమిండియా స్క్వాడ్ లో కేఎల్ రాహుల్ పేరు కూడా ఉంది.

#BorderGavaskarTrophy: ఆస్ట్రేలియాతో మిగతా 2 టెస్టులకు టీమిండియాలో మార్పుల్లేవ్.. తొలి వన్డేకు మాత్రం రోహిత్ దూరం

#BorderGavaskarTrophy: బార్డర్ గవాస్కర్ ట్రోఫీలో భాగంగా ఆస్ట్రేలియాతో జరగాల్సిన మిగతా 2 టెస్టులకు టీమిండియాలో ఎటువంటి మార్పులూ లేవని బీసీసీఐ ప్రకటించింది. మెరుగైన ప్రదర్శన ఇవ్వలేకపోతున్న కేఎల్ రాహుల్ ను మూడు, నాలుగో టెస్టుల్లో ఆడనివ్వబోరంటూ మొదట ప్రచారం జరిగింది. అయితే, టీమిండియా స్క్వాడ్ లో కేఎల్ రాహుల్ పేరు కూడా ఉంది.

భారత్-ఆస్ట్రేలియా మధ్య మొత్తం నాలుగు టెస్టు మ్యాచులు జరుగుతున్నాయి. తొలి టెస్టులో భారత్ చేతిలో ఆస్ట్రేలియా ఇన్నింగ్స్, 132 పరుగుల తేడాతో, రెండో టెస్టులో 6 వికెట్ల తేడాతో ఓడిపోయింది. దీంతో బార్డర్ గవాస్కర్ ట్రోఫీని భారత్ కైవసం చేసుకునే అవకాశాలు మెండుగా ఉన్నాయి. కాగా, టెస్టు మ్యాచుల తర్వాత జరగనున్న వన్డే మ్యాచులకు కూడా బీసీసీఐ భారత్ స్క్వాడ్ ను ప్రకటించింది. తొలి వన్డే మ్యాచుకు మాత్రం రోహిత్ శర్మ వ్యక్తిగత కారణాల వల్ల దూరం కానున్నాడు.

మూడు, నాలుగో టెస్టుల స్క్వాడ్
రోహిత్ శర్మ (కెప్టెన్), కేఎల్ రాహుల్, శుభమన్ గిల్, ఛతేశ్వర్ పుజారా, విరాట్ కోహ్లీ, కేఎస్ భరత్ (వికెట్ కీపర్), ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్), రవిచంద్రన్ అశ్విన్, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, రవీంద్ర జడేజా, షమీ, మహ్మద్ సిరాజ్, శ్రేయాస్ అయ్యర్, సూర్యకుమార్ యాదవ్, ఉమేశ్ యాదవ్, జయదేవ్ ఉనద్కత్.

టీమిండియా వన్డే స్క్వాడ్
రోహిత్ శర్మ (సి), శుభమన్ గిల్, విరాట్ కోహ్లీ, శ్రేయాస్ అయ్యర్, సూర్యకుమార్ యాదవ్, కేఎల్ రాహుల్, ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్), హార్దిక్ పాండ్యా (వైస్ కెప్టెన్), రవీంద్ర జడేజా, కుల్దీప్ యాదవ్, వాషింగ్టన్ సుందర్, చాహల్, షమీ, మహ్మద్ సిరాజ్, ఉమ్రాన్ మాలిక్, శార్దూల్ ఠాకూర్, అక్షర్ పటేల్, జయదేవ్ ఉనద్కత్. మొదటి వన్డే మ్యాచుకు మాత్రం రోహిత్ దూరం కానున్నాడు. దీంతో తొలి వన్డేకు హార్దిక్ పాండ్యా సారథ్యం వహిస్తాడు. మార్చి 17 నుంచి మూడు వన్డే మ్యాచుల సిరీస్ ప్రారంభం కానుంది.

రోహిత్ కీలక వ్యాఖ్యలు

టీమిండియా ఓపెనర్ కేఎల్ రాహుల్ రెండో టెస్టు మొదటి ఇన్నింగ్స్ లో కేవలం 17 పరుగులు మాత్రమే చేయగలిగాడు. రెండో ఇన్సింగ్ లో ఒక్క పరుగుకే ఔటయ్యాడు. దీంతో అతడిని మూడో టెస్టులో తీసుకుంటారా? అన్న సందేహాలు వ్యక్తమయ్యాయి. ఇవాళ మ్యాచ్ అనంతరం రోహిత్ శర్మ చేసిన పలు వ్యాఖ్యలు ఆ అనుమానాలను బలపర్చాయి.

ఇటువంటి పిచ్ లలో ఆడేటప్పుడు పరుగులు బాగా చేసేందుకు పలు పద్ధతులు పాటించాలని అన్నాడు. జట్టులో విభిన్న రకాల ఆటగాళ్లు ఉంటారని, పరుగులు రాబట్టడంతో ప్రతి ఆటగాడికి తనదైన పద్ధతి ఉంటుందని చెప్పాడు. అయితే, ప్రతి ఆటగాడు వ్యక్తిగతంగా ఏ పద్ధతిని పాటిస్తున్నాడన్న విషయంపై తాము దృష్టి పెట్టాలని అనుకోవడం లేదని అన్నాడు. ఇది టీమిండియాకు పెద్ద సిరీస్ అని చెప్పాడు. ఇదే విషయాన్ని దృష్టిలో ఉంచుకుని కేఎల్ రాహుల్ ఆటతీరును చూస్తున్నానని అన్నాడు. కేఎల్ రాహుల్ బ్యాటింగ్ తీరు గురించి జట్టులో చర్చ జరుగుతోందని చెప్పాడు. దీంతో కేఎల్ రాహుల్ మూడో టెస్టు మ్యాచులో ఆడకపోవచ్చన్న విశ్లేషణలు వచ్చాయి. అయితే, మూడో, నాలుగో టెస్ట్ మ్యాచుల స్క్వాడ్ లోనూ అతడి పేరు ఉంది.

 

Border–Gavaskar Trophy: బోర్డర్- గవాస్కర్ ట్రోఫి; ఆ మూడు తప్పా.. ఆతిథ్య జట్లదే పైచేయి.. ఎందుకో తెలుసా!