India vs New Zealand: ఇండియా-న్యూజిలాండ్ రెండో టీ20.. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న కివీస్

మూడు టీ20 మ్యాచ్‌ల సిరీస్‌లో ఇప్పటికే న్యూజిలాండ్ ఒక మ్యాచ్ గెలిచి ఆధిక్యంలో ఉంది. దీంతో సిరీస్ నిలుపుకోవాలంటే టీమిండియా ఈ మ్యాచ్ గెలవడం తప్పనిసరి. గత వన్డే మ్యాచుల్లో విఫలమైన న్యూజిలాండ్ టీ20లో మాత్రం పుంజుకుని, విజయం సాధించింది.

India vs New Zealand: ఇండియా-న్యూజిలాండ్ రెండో టీ20.. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న కివీస్

India vs New Zealand: ఇండియా-న్యూజిలాండ్ జట్ల మధ్య ఆదివారం సాయంత్రం ఏడు గంటలకు రెండో టీ20 జరగనుంది. ఉత్తర ప్రదేశ్‌లోని లక్నోలో ఈ మ్యాచ్ జరుగుతోంది. మూడు టీ20 మ్యాచ్‌ల సిరీస్‌లో ఇప్పటికే న్యూజిలాండ్ ఒక మ్యాచ్ గెలిచి ఆధిక్యంలో ఉంది.

Gujarat: పంచాయత్ జూనియర్ క్లర్క్ ఎగ్జామ్ పేపర్ లీక్.. పరీక్ష రద్దు చేసిన ప్రభుత్వం

దీంతో సిరీస్ నిలుపుకోవాలంటే టీమిండియా ఈ మ్యాచ్ గెలవడం తప్పనిసరి. గత వన్డే మ్యాచుల్లో విఫలమైన న్యూజిలాండ్ టీ20లో మాత్రం పుంజుకుని, విజయం సాధించింది. హార్థిక్ పాండ్యా ఈ సిరీస్ కెప్టెన్‌గా వ్యవహరిస్తున్నాడు. మొదటి మ్యాచ్‌లో ఓడిపోయినప్పటికీ భారత జట్టు పటిష్టంగానే ఉంది. ముఖ్యంగా బ్యాట్స్‌మెన్ మంచి ఫామ్‌లో ఉన్నారు. శుభ్‌మన్ గిల్, సూర్యకుమార్ యాదవ్ వంటి ఆటగాళ్లు బెస్ట్ ఫామ్‌లో ఉన్నారు. వీళ్లు బ్యాట్‌తో రాణిస్తే ఇండియా విజయం సాధించడం చాలా సులభమవుతుంది. న్యూజిలాండ్ మొదటి టీ20లో విజయం సాధించి ఊపు మీద ఉండటంతో కెప్టెన్ మిచెల్ శాంట్నర్ జట్టులో ఎలాంటి మార్పు చేయలేదు.

Rashtrapati Bhavan: సందర్శకులకు అందుబాటులోకి రానున్న రాష్ట్రపతి భవన్ గార్డెన్.. మార్చి 26 వరకు అవకాశం

గత మ్యాచ్‌లో ఆడిన జట్టునే కొనసాగిస్తున్నాడు. అయితే, టీమిండియా మాత్రం ఒక మార్పుతో బరిలోకి దిగుతోంది. పేసర్ ఉమ్రాన్ మాలిక్ స్థానంలో మరో యువ ఆటగాడు యుజ్వేంద్ర చాహల్‌కు జట్టులో స్థానం కల్పించారు. ఇదీ భారత జట్టు: శుభ్‌మన్ గిల్, ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్), రాహుల్ త్రిపాఠి, సూర్యకుమార్ యాదవ్, హార్థిక్ పాండ్యా (కెప్టెన్), దీపక్ హుడా, వాషింగ్టన్ సుందర్, శివమ్ మావి, కుల్దీప్ యాదవ్, యుజ్వేంద్ర చాహల్, అర్ష్‌దీప్ సింగ్.