IND vs NZ : భారత్ బ్యాటింగ్.. టెస్ట్ క్యాప్‌ను ముద్దాడి అందుకున్న అయ్యర్

కాన్పూర్‌లోని గ్రీన్ పార్క్ స్టేడియం వేదికగా ఇండియా-న్యూజిలాండ్ మొదటి టెస్ట్ మ్యాచ్ ప్రారంభమైంది. టాస్ గెలిచిన భారత్ మొదట బ్యాటింగ్ ఎంచుకుంది.

IND vs NZ : భారత్ బ్యాటింగ్.. టెస్ట్ క్యాప్‌ను ముద్దాడి అందుకున్న అయ్యర్

Ind Vs Nz

IND vs NZ : కాన్పూర్‌లోని గ్రీన్ పార్క్ స్టేడియం వేదికగా ఇండియా-న్యూజిలాండ్ మొదటి టెస్ట్ మ్యాచ్ ప్రారంభమైంది. టాస్ గెలిచిన భారత్ మొదట బ్యాటింగ్ ఎంచుకుంది. పరిమిత ఓవర్ల స్పెషలిస్ట్ శ్రేయస్ అయ్యర్ ఈ టెస్టులో అరంగేట్రం చేశారు. మాజీ కెప్టెన్ సునీల్ గవాస్కర్ చేతుల మీదుగా అయ్యర్ టెస్ట్ క్యాప్ అందుకొని ముద్దాడాడు.

చదవండి : IND vs NZ: రాహుల్ ఔట్, టెస్టు సిరీస్ కోసం జట్టులోకి సూర్య కుమార్

కోహ్లీతోపాటు సీనియర్లకు విశ్రాంతి ఇవ్వడంతో.. అజింక్య రహానే కెప్టెన్ బాధ్యతలు నిర్వహిస్తున్నాడు. జట్టులో యువకులకు ప్రాధాన్యం ఇచ్చారు. సీనియర్ బౌలర్లు ఇషాంత్ శర్మ, ఉమేష్ యాదవ్‌లు తిరిగి జట్టులోకి వచ్చారు.

చదవండి : ICC T20 Rankings.. భారత్ నుంచి అతడొక్కడే..

ఒకసారి ఇరు జట్ల ఆటగాళ్లను పరిశీలిస్తే..
భారత్‌: రహానే (కెప్టెన్‌), శుబ్‌మన్‌ గిల్‌, మయాంక్‌ అగర్వాల్‌, చటేశ్వర్‌ పుజారా, శ్రేయస్ అయ్యర్‌‌, జడేజా, సాహా, అశ్విన్‌, అక్షర్‌ పటేల్‌‌, ఇషాంత్ శర్మ‌, ఉమేశ్ యాదవ్‌‌.
న్యూజిలాండ్‌: కేన్‌ విలియమ్సన్‌ (కెప్టెన్‌), లాథమ్‌, విల్‌ యాంగ్‌, రాస్‌ టేలర్‌, నికోల్స్‌, బ్లండెల్‌, రవీంద్ర, జెమీసన్‌, టిమ్‌ సౌథీ, సోమర్‌విల్లె, అజాజ్‌ పటేల్‌.