India vs New Zealand: ఇండియా-న్యూజిలాండ్ మూడో టీ20.. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఇండియా

ఈ రోజు జరిగే మ్యాచ్‌లో గెలిచిన జట్టు సిరీస్ సొంతం చేసుకుంటుంది. గుజరాత్, అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో నేటి టీ20 మ్యాచ్ జరుగుతుంది. సాయంత్రం ఏడు గంటలకు మ్యాచ్ ఆరంభమవుతుంది. ప్రపంచంలోనే అత్యంత పెద్ద స్టేడియంలలో ఇదీ ఒకటి.

India vs New Zealand: ఇండియా-న్యూజిలాండ్ మూడో టీ20.. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఇండియా

India vs New Zealand: ఇండియా-న్యూజిలాండ్ జట్ల మధ్య బుధవారం మూడో టీ20 మ్యాచ్ జరగబోతుంది. మూడు టీ20ల సిరీస్‌లో ఇప్పటికే రెండు జట్లూ చెరో మ్యాచ్ గెలిచి సమంగా ఉన్న నేపథ్యంలో ఇరు జట్లకూ ఈ మ్యాచ్ కీలకం కానుంది. ఈ రోజు జరిగే మ్యాచ్‌లో గెలిచిన జట్టు సిరీస్ సొంతం చేసుకుంటుంది.

Budget 2023: క్రీడారంగానికి పెద్దపీట వేసిన బడ్జెట్.. గతంకంటే ఎక్కువ కేటాయింపులు

గుజరాత్, అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో నేటి టీ20 మ్యాచ్ జరుగుతుంది. సాయంత్రం ఏడు గంటలకు మ్యాచ్ ఆరంభమవుతుంది. ప్రపంచంలోనే అత్యంత పెద్ద స్టేడియంలలో ఇదీ ఒకటి. ఈ స్టేడియంలో దాదాపు 1.3 లక్షల మంది కూర్చునే వీలుంది. ఈ స్టేడియంలోని పిచ్‌ను నిపుణులు పరిశీలించారు. క్యూరేటర్ల అంచనా ప్రకారం పిచ్ బ్యాటింగ్‌కు అనుకూలిస్తుంది. అదే సమయంలో స్పిన్ బౌలింగ్‌కు కూడా అనుకూలంగా ఉంటుంది. దీంతో ఇటు బ్యాటింగ్‌లో, అటు స్పిన్ బౌలింగ్‌లో రాణించిన జట్టు విజయం సాధించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.

Telangana: తెలంగాణలో ‘మన ఊరు-మన బడి’ కార్యక్రమం ప్రారంభం.. గంభీరావుపేటలో ప్రారంభించిన మంత్రి కేటీఆర్

బ్యాటింగ్‌కు అనుకూలం కాబట్టి, ఈ మ్యాచ్‌లో భారీ స్కోరు నమోదయ్యే అవకాశం ఉంది. పైగా స్టేడియం పెద్దగా ఉన్నప్పటికీ స్క్వేర్ బౌండరీ లైన్స్ మాత్రం 60 మీటర్ల దూరంలోనే ఉన్నాయి. దీంతో ఫోర్లు, సిక్సర్లు ఎక్కువగా నమోదు కావొచ్చు. అయితే, వికెట్‌కు ముందు, వెనుక మాత్రం బౌండరీ లైన్లు చాలా దూరంలో ఉన్నాయి. వీటి దూరం దాదాపు 75 మీటర్లు ఉంది. వన్డే సిరీస్‌లో అంతగా రాణించలేకపోయినప్పటికీ, కివీస్ జట్టు టీ20ల్లో పుంజుకుంది. అందుకని ఈ జట్టును తక్కువగా అంచనా వేయడానికి లేదు.

అందువల్ల భారత ఆటగాళ్లు పూర్తి స్థాయిలో రాణించాల్సి ఉంది. భారత జట్టు ఈసారి మార్పులేమీ లేకుండానే బరిలోకి దిగుతోంది. పిచ్ బ్యాటింగ్‌కు అనుకూలించే అవకాశం ఉన్నందువల్ల కెప్టెన్ హార్ధిక్ పాండ్యా టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్నాడు.