India vs South africa: టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న టీమిండియా కెప్టెన్ శిఖర్ ధావన్

 భారత్-దక్షిణాఫ్రికా మధ్య తొలి వన్డే ప్రారంభమైంది. టాస్ గెలిచిన టీమిండియా సారథి శిఖర్ ధావన్ మొదట ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. లక్నోలోని భారతరత్న అటల్ బిహారీ వాజ్ పేయీ స్టేడియంలో ఈ మ్యాచ్ జరుగుతోంది. టీమిండియాలో శిఖర్ ధావన్, శుభ్ మన్ గిల్, రుతురాజ్ గైక్వాడ్, ఇషాంత్ కిషన్, శ్రేయాస్ అయ్యర్, సంజూ శాంసన్, శార్దూల్ ఠాకూర్, కుల్దీప్ యాదవ్, రవి బిష్ణోయి, సిరాజ్, అన్వేశ్ ఖాన్ ఉన్నారు. ఈ మ్యాచ్‌కు మొదట వర్షం అడ్డంకిగా మారిన విషయం తెలిసిందే.

India vs South africa: టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న టీమిండియా కెప్టెన్ శిఖర్ ధావన్

India vs South africa: భారత్-దక్షిణాఫ్రికా మధ్య తొలి వన్డే ప్రారంభమైంది. టాస్ గెలిచిన టీమిండియా సారథి శిఖర్ ధావన్ మొదట ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. లక్నోలోని భారతరత్న అటల్ బిహారీ వాజ్ పేయీ స్టేడియంలో ఈ మ్యాచ్ జరుగుతోంది. టీమిండియాలో శిఖర్ ధావన్, శుభ్ మన్ గిల్, రుతురాజ్ గైక్వాడ్, ఇషాంత్ కిషన్, శ్రేయాస్ అయ్యర్, సంజూ శాంసన్, శార్దూల్ ఠాకూర్, కుల్దీప్ యాదవ్, రవి బిష్ణోయి, సిరాజ్, అన్వేశ్ ఖాన్ ఉన్నారు.

ఈ మ్యాచ్‌కు మొదట వర్షం అడ్డంకిగా మారిన విషయం తెలిసిందే. ముందుగా నిర్ణయించాల్సిన షెడ్యూల్ ప్రకారం ఇవాళ మ్యాచ్ మధ్యాహ్నం 1.30 గంటలకే ప్రారంభం కావాల్సి ఉంది. వర్షం కారణంగా తొలి వన్డే ఆలస్యంగా ప్రారంభమైంది. మైదానాన్ని అంపైర్లు పరిశీలించి బాగానే ఉందని చెప్పడంతో చివరకు మ్యాచ్ ప్రారంభమైంది. దక్షిణాఫ్రికాపై టీ20 సిరీస్ ను 2-1 తేడాతో టీమిండియా గెలుచుకుంది. నేటి నుంచి మూడు మ్యాచుల వన్డే సిరీస్ ప్రారంభమైంది. రెండో వన్డే ఈ నెల 9న, మూడవ వన్డే ఈ నెల 11న జరుగుతుంది. కాగా, ఈ సిరీస్ అనంతరం టీమిండియా టీ20 ప్రపంచ కప్ కోసం ఆస్ట్రేలియా బయలుదేరనుంది.

10 TV live: “నాన్ స్టాప్ న్యూస్ అప్ డేట్స్ కోసం 10TV చూడండి”..