Hockey World Cup: హాకీ వరల్డ్ కప్ నుంచి భారత్ ఔట్.. క్వార్టర్స్ కూడా చేరకుండానే నిష్క్రమణ

న్యూజిలాండ్‌తో ఆదివారం జరిగిన మ్యాచ్‌లో షూటౌట్‌లో భారత జట్టు పరాజయం పాలైంది. క్రాస్ ఓవర్ మ్యాచ్‌లో 4-5 తేడాతో న్యూజిలాండ్ చేతిలో ఓడిపోయింది. పురుషుల హాకీ వరల్డ్ కప్‌కు ఆతిథ్యం ఇస్తున్న భారత జట్టు అంచనాలు అందుకోవడంలో విఫలమైంది.

Hockey World Cup: హాకీ వరల్డ్ కప్ నుంచి భారత్ ఔట్.. క్వార్టర్స్ కూడా చేరకుండానే నిష్క్రమణ

Hockey World Cup: హాకీ వరల్డ్ కప్-2023 నుంచి భారత జట్టు నిష్క్రమించింది. క్వార్టర్స్ కూడా చేరకుండానే టోర్నీ నుంచి వైదొలిగింది. న్యూజిలాండ్‌తో ఆదివారం జరిగిన మ్యాచ్‌లో షూటౌట్‌లో భారత జట్టు పరాజయం పాలైంది. క్రాస్ ఓవర్ మ్యాచ్‌లో 4-5 తేడాతో న్యూజిలాండ్ చేతిలో ఓడిపోయింది.

Hyderabad: హైదరాబాద్‌లో అగ్ని ప్రమాదం.. సిలిండర్లు పేలి అంటుకున్న మంటలు

పురుషుల హాకీ వరల్డ్ కప్‌కు ఆతిథ్యం ఇస్తున్న భారత జట్టు అంచనాలు అందుకోవడంలో విఫలమైంది. ఇండియాకంటే తక్కువ ర్యాంకు కలిగిన జట్టు చేతిలో హర్మన్‌ప్రీత్ సేన ఓటమి పాలైంది. మ్యాచ్‌లో ముందుగా ఇండియా-న్యూజిలాండ్ జట్లు 3-3 గోల్స్‌తో సమానంగా నిలిచాయి. ఇండియా తరఫున లలిత్ ఉపాధ్యాయ్, సుఖ్‌జిత్ సింగ్, వరుణ్ కుమార్ తలో గోల్ సాధించారు. అయితే, పెనాల్టీ కార్నర్లను సద్వినియోగం చేయడంలో డ్రాగ్ ఫ్లీకర్ హర్మన్ ప్రీత్ విఫలం కావడం భారత జట్టు విజయావకాశాల్ని దెబ్బతీసింది. 11 పెనాల్టీ కార్నర్లలో ఇండియా రెండింటిని మాత్రమే వినియోగించుకుంది. డిఫెన్స్‌లో విఫలం కావడం వల్ల ఇండియా ఓడిపోయింది.

Hyderabad Illegal Constructions : బాబోయ్.. హైదరాబాద్‌లో లక్షకు పైనే అక్రమ నిర్మాణాలు, అధికారులు ఇప్పటికైనా కళ్లు తెరుస్తారా?

మ్యాచ్ ప్రారంభమైన తర్వాత ఇండియా ఆధిక్యం ప్రదర్శించింది. మొదట 2-0తో ఇండియా స్పష్టమైన ఆధిక్యంలో ఉంది. ఆ తర్వాత 3-1 స్కోరు సాధించి ఇండియా ఆధిక్యంలోనే ఉంది. అయితే, పెనాల్టీ కార్నర్ల విషయంలో మాత్రం భారత జట్టు విఫలమైంది. న్యూజిలాండ్ ఆటగాళ్లు దూకుడుగా ఆడుతూ, భారత జట్టుపై ఎదురు దాడికి దిగారు. ఈ క్రమంలో పెనాల్టీ కార్నర్‌లను అడ్డుకోవడంలో మన జట్టు విఫలమైంది. దీంతో మ్యాచ్ నిర్ణీత సమయం ముగిసే సరికి స్కోరు 3-3తో సమానంగా నిలిచింది. దీంతో పెనాల్టీ షూటౌట్ నిర్వహించాల్సి వచ్చింది. హోరాహోరీగా సాగిన పెనాల్టీ షూటౌట్‌లో న్యూజిలాండ్ 5 గోల్స్ చేయగా, ఇండియా 4 గోల్స్ మాత్రమే చేయగలిగింది.

Gujarat Court: ఆవుల్ని వధించడం ఆపేస్తే, భూమ్మీదున్న సమస్యలన్నీ తీరిపోతాయట.. గుజరాత్ కోర్టు వింత వ్యాఖ్యలు

దీంతో భారత్ 5-4తో మ్యాచ్‌లో ఓటమి పాలైంది. దీంతో వరల్డ్ కప్ నుంచి భారత్ నిష్క్రమించినట్లైంది. అయితే, టోర్నీలో ఇండియా మరో రెండు మ్యాచ్‌లు ఆడే అవకాశం ఉంది. ఈ నెల 26న జపాన్‌తో భారత్ మ్యాచ్ ఆడుతుంది. ఈ మ్యాచ్ ద్వారా టోర్నీలో భారత స్థానం నిర్ణయమవుతుంది. 9-16 స్థానంలో భారత్ నిలవొచ్చు. దీనిలో గెలిస్తే ఆ తర్వాత ఈ నెల 28న మరో మ్యాచ్ ఆడాల్సి ఉంటుంది. దీని ద్వారా 9-12 స్థానంలో ఉండే అవకాశం ఉంది.