IndiaVsSouthAfrica T20I : బిగ్ ఫైట్… ఇండియా-సౌతాఫ్రికా టీ20 సిరీస్.. రేపటి నుంచే

వ‌రుస సిరీస్‌ల‌లో విజ‌యంతో దూకుడు మీదున్న భార‌త క్రికెట్ జ‌ట్టు.. సౌతాఫ్రికాతో టీ20 సిరీస్ ఆడ‌నుంది. కేర‌ళ‌లోని తిరువ‌నంత‌పురంలో బుధవారం ఈ సిరీస్‌లో ప్రారంభ మ్యాచ్ జ‌ర‌గ‌నుంది.

IndiaVsSouthAfrica T20I : బిగ్ ఫైట్… ఇండియా-సౌతాఫ్రికా టీ20 సిరీస్.. రేపటి నుంచే

IndiaVsSouthAfrica T20I : క్రికెట్ ఫ్యాన్స్ కు మరో ఎంటర్ టైన్ మెంట్. మరో బిగ్ ఫైట్ జరగనుంది. వ‌రుస సిరీస్‌ల‌లో విజ‌యంతో దూకుడు మీదున్న భార‌త క్రికెట్ జ‌ట్టు.. సౌతాఫ్రికాతో టీ20 సిరీస్ ఆడ‌నుంది. కేర‌ళ‌లోని తిరువ‌నంత‌పురంలో బుధవారం ఈ సిరీస్‌లో ప్రారంభ మ్యాచ్ జ‌ర‌గ‌నుంది. ఇప్ప‌టికే ఇరు దేశాల జ‌ట్లు తిరువ‌నంత‌పురం చేరుకున్నాయి. రేపు తిరువ‌నంత‌పురంలోని గ్రీన్ ఫీల్డ్ ఇంట‌ర్నేష‌నల్ స్టేడియంలో రాత్రి 7 గంట‌ల‌కు తొలి మ్యాచ్ జ‌ర‌గ‌నుంది.

ఈ సిరీస్‌లో రెండో టీ20 మ్యాచ్ అక్టోబ‌ర్ 2న గువాహటిలో జ‌ర‌గ‌నుంది. ఆ త‌ర్వాత సిరీస్‌లో చివ‌రి టీ20 మ్యాచ్ ఇండోర్‌లో అక్టోబ‌ర్ 4న‌ జ‌ర‌గ‌నుంది. ఇటీవ‌లే ఆస్ట్రేలియాతో జ‌రిగిన టీ20 సిరీస్‌లో విక్టరీ సాధించిన భారత జ‌ట్టు.. ద‌క్షిణాఫ్రికా జ‌ట్టుతో సిరీస్‌లో ఫేవ‌రెట్‌గా బ‌రిలోకి దిగ‌నుంది. ప్రారంభ మ్యాచ్‌ను పుర‌స్కరించుకుని తిరువ‌నంత‌పురం స్టేడియం దగ్గర టీమిండియా కెప్టెన్ రోహిత్ శ‌ర్మ‌కు చెందిన భారీ క‌టౌట్‌ను అభిమానులు ఏర్పాటు చేశారు.