న్యూజిలాండ్‌పై థ్రిల్లింగ్ విక్టరీ: సెమీఫైనల్స్‌లోకి భారత్

న్యూజిలాండ్‌పై థ్రిల్లింగ్ విక్టరీ: సెమీఫైనల్స్‌లోకి భారత్

మహిళా టీ20 వరల్డ్ కప్‌లో భారత్ సెమీ ఫైనల్స్‌కి చేరుకుంది. గురువారం మెల్‌బౌర్న్ వేదికగా జరిగిన మ్యాచ్‌లో టీమిండియా ఆల్‌రౌండ్ ప్రదర్శనతో ఆకట్టుకుంది. టాస్ గెలిచిన కివీస్‌ బౌలర్లపై.. భారత్ ఆచితూచి ఆడింది.. ఈ క్రమంలో నిర్ణీత ఓవర్లు పూర్తయ్యేసరికి 8వికెట్ల నష్టానికి 133పరుగులు చేయగలిగింది. 

లక్ష్యచేధనలో భాగంగా బరిలోకి దిగిన కివీస్ చివరి బంతి వరకూ పోరాడి 3పరుగుల దూరంలో చిత్తు అయింది. ఉత్కంఠభరితంగా సాగిన మ్యాచ్ ఆద్యంతం చివరి ఓవర్లో టర్న్ అయింది. 6 బంతులకు 16పరుగులు అవసరం ఉండగా 12 పరుగులు మాత్రమే చేసింది. మిడిలార్డర్ వైఫల్యం ఉన్నప్పటికీ సెమీ ఫైనల్స్ లోకి చేరుకోగలిగింది భారత్. 

See Also>>సన్‌రైజర్స్ జట్టు కెప్టెన్‌గా మళ్లీ అతనే!

భారత బ్యాట్స్ ఉమెన్‌లో షఫాలీ వర్మ హాఫ్ సెంచరీకి దగ్గర్లో 46పరుగులకు అవుట్ అయింది. ఇరు జట్లలో అత్యధిక స్కోరు చేయడంతో ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ గెలుచుకుంది. తప్పులు ఉన్నప్పటికీ సెమీ ఫైనల్ కు చేరుకోవడం సంతోషమే. పది ఓవర్ల వరకూ బాగా ఆడగలిగాం. అదే ఆటతీరును కొనసాగించలేకపోయామని భారత కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ అన్నారు.