ఆసీస్ పేసర్ల ఆధిపత్యం, టీమిండియా 233/6

ఆసీస్ పేసర్ల ఆధిపత్యం, టీమిండియా 233/6

India tour of Australia : భారత్ – ఆస్ట్రేలియా క్రికెట్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఉత్కంఠగా ఎదురు చూస్తున్న బోర్డర్ – గవాస్కర్ ట్రోఫీ స్టార్ట్ అయ్యింది. పింక్ బాల్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో భారత్ జోరు పెంచుతుందని అందరూ ఊహించారు. కానీ అలా జరగలేదు. పూర్తిగా డిఫెన్స్ గేమ్ ఆడింది. ఆట ముగిసే సరికి 6 వికెట్ల నష్టానికి 233 పరుగులు మాత్రమే చేయగలగింది. రవిచంద్రన్ అశ్విన్ (15 బ్యాటింగ్), సాహా (9 బ్యాటింగ్) క్రీజులో ఉన్నారు.

తొలుత టాస్ గెలిచిన భారత్…ఆరంభంలోనే షాక్ తగిలింది. ఖాతా కూడా తెరవకముందే..ఓపెనర్ పృథ్వీ షా (0) వికెట్ కోల్పోయింది. మిచెల్ స్టార్క్ బౌలింగ్‌లో ఇతను క్లీన్ బౌల్డ్ అయ్యాడు. మరో ఓపెనర్ మయాంక్ అగర్వాల్ (17) ఆచితూచి ఆడినా ఎక్కువ సేపు క్రీజులో నిలవలేదు. పుజారాతో కలిసి రెండో వికెట్‌కు అతడు 32 పరుగుల భాగస్వామ్యం అందించాడు. జట్టు స్కోరు 32 పరుగుల వద్ద మయాంక్ వికెట్ కోల్పోయింది. మరోవైపు పుజారా క్రీజులో పాతుకపోయాడు. ఇతనికి కోహ్లీ జత కలిశాడు. వీరిద్దరూ కలిసి ఆసీస్ బౌలర్ల సహనం పరీక్షించారు.

100 స్కోరు వద్ద పుజారా (43, 160 బంతులు, 2 ఫోర్లు) పెవిలియన్ చేరాడు. ఈ క్రమంలో కోహ్లీ స్కోరును బోర్డును పరుగెత్తించే పనిలో పడ్డాడు. అర్ధ సెంచరీ పూర్తి చేసుకున్న కోహ్లీ..సెంచరీ వైపుకు దూసుకెళుతున్నాడు. అనూహ్యంగా..కోహ్లీ (74) రనౌట్ అయ్యాడు. అప్పటికీ జట్టు స్కోరు 4 వికెట్లు కోల్పోయి 188. రహానే (42), విహారి (16) పరుగులు సాధించి అవుట్ అయ్యారు. సాహా 9, అశ్విన్ 15 పరుగులతో క్రీజులో ఉన్నారు. మొత్తంగా 89 ఓవర్లలో టీమిండియా 6 వికెట్లు కోల్పోయి 233 పరుగులు చేసింది. ఆసీస్ బౌలర్లలో మిచెల్ స్టార్క్ 2, హేజిల్ వుడ్, కమిన్స్, లైయన్ తలో వికెట్ తీశారు.