India Tour Of Zimbabwe 2022 : టీమిండియా కెప్టెన్‌గా కేఎల్ రాహుల్, వైస్ కెప్టెన్‌గా శిఖర్ ధావన్

టీమిండియా త్వరలో జింబాబ్వే ప‌ర్య‌ట‌న‌కు వెళ్ల‌నుంది. 3 వ‌న్డేలు ఆడ‌నుంది. ఈ సిరీస్‌కు భార‌త జ‌ట్టును బీసీసీఐ ప్ర‌క‌టించింది. జింబాబ్వేతో ఈ నెల 18 నుంచి మొద‌లు కానున్న వ‌న్డే సిరీస్‌కు టీమిండియా స్టార్ క్రికెట‌ర్ కేఎల్ రాహుల్ అందుబాటులోకి వ‌చ్చాడు.

India Tour Of Zimbabwe 2022 : టీమిండియా కెప్టెన్‌గా కేఎల్ రాహుల్, వైస్ కెప్టెన్‌గా శిఖర్ ధావన్

India Tour Of Zimbabwe 2022 : టీమిండియా త్వరలో జింబాబ్వే ప‌ర్య‌ట‌న‌కు వెళ్ల‌నుంది. 3 వ‌న్డేలు ఆడ‌నుంది. ఈ సిరీస్‌కు భార‌త జ‌ట్టును బీసీసీఐ ప్ర‌క‌టించింది. జింబాబ్వేతో ఈ నెల 18 నుంచి మొద‌లు కానున్న వ‌న్డే సిరీస్‌కు టీమిండియా స్టార్ క్రికెట‌ర్ కేఎల్ రాహుల్ అందుబాటులోకి వ‌చ్చాడు. అంతేకాకుండా ఈ సిరీస్‌కు టీమిండియా కెప్టెన్‌గా రాహుల్‌ను ఎంపిక చేస్తూ బీసీసీఐ నిర్ణ‌యం తీసుకుంది. వైస్ కెప్టెన్‌గా శిఖ‌ర్ ధావన్ వ్య‌వ‌హ‌రించ‌నున్నాడు. సిరీస్‌లోని 3 వ‌న్డేలు జింబాబ్వేలోని హ‌రారేలో జ‌ర‌గ‌నున్నాయి.

కేఎల్ రాహుల్ నేతృత్వంలో బ‌రిలోకి దిగనున్న భార‌త జ‌ట్టులో శిఖ‌ర్ ధావ‌న్‌తో(వైస్ కెప్టెన్) పాటు రుతురాజ్ గైక్వాడ్‌, శుభ్‌మ‌న్ గిల్‌, దీప‌క్ హుడా, రాహుల్ త్రిపాఠి, ఇషాన్ కిషన్(వికెట్ కీపర్)‌, సంజూ శాంస‌న్(వికెట్ కీపర్)‌, వాషింగ్ట‌న్ సుంద‌ర్‌, శార్ధూల్ ఠాకూర్‌, కుల్‌దీప్ యాద‌వ్‌, అక్ష‌ర్ ప‌టేల్‌, అవేశ్ ఖాన్‌, ప్ర‌సిద్ధ్ కృష్ణ‌, మహ్మద్ సిరాజ్‌, దీప‌క్ చాహ‌ర్‌లు ఉన్నారు.

కేఎల్ రాహుల్.. భారత జట్టుకు టాప్ ఓపెనర్. అంతేకాదు పార్ట్ టైమ్ వికెట్ కీపర్ కూడా. కోవిడ్ బారిన పడటంతో కేఎల్ రాహుల్ భారత్-విండీస్ సిరీస్ కు దూరమయ్యాడు. ఆగస్టు 18న భారత్, జింబాబ్వే మధ్య తొలి వన్డే మ్యాచ్ జరగనుంది. ఆగస్టు 20న రెండో వన్డే, ఆగస్టు 22న మూడో వన్డే జరగనున్నాయి. జింబాబ్వేతో వన్డే సిరీస్ తర్వాత కేఎల్ రాహుల్ ఆసియా కప్ కు ఎంపిక చేసిన భారత జట్టులో కలుస్తాడు. ఆగస్టు 28న ఆసియా కప్ ప్రారంభం కానుంది. తొలి మ్యాచ్ లోనే చిరకాల ప్రత్యర్థులు భారత్, పాకిస్తాన్ తలపడనున్నాయి.

 

టీమిండియా కెప్టెన్‌గా కేఎల్ రాహుల్..