U19 Asia Cup: ఉత్కంఠభరిత మ్యాచ్‌లో భారత్‌పై పాకిస్తాన్ విజయం

దుబాయ్‌లో జరిగిన అండర్-19 ఆసియా కప్‌లో ఉత్కంఠభరితమైన మ్యాచ్‌లో పాకిస్తాన్ రెండు వికెట్ల తేడాతో భారత్‌ను ఓడించింది.

U19 Asia Cup: ఉత్కంఠభరిత మ్యాచ్‌లో భారత్‌పై పాకిస్తాన్ విజయం

U19 Match

U19 Asia Cup: దుబాయ్‌లో జరిగిన అండర్-19 ఆసియా కప్‌లో ఉత్కంఠభరితమైన మ్యాచ్‌లో పాకిస్తాన్ రెండు వికెట్ల తేడాతో భారత్‌ను ఓడించింది. తొలుత బ్యాటింగ్ చేసిన భారత జట్టు 237పరుగులు చేయగా.. అనంతరం బరిలోకి దిగిన పాకిస్తాన్ దీటుగా ఆడి చివరి బంతికి ఎనిమిది వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది

ఉత్కంఠ‌గా ఆఖరి బంతి వరకు..
ఈ మ్యాచ్‌లో పాకిస్తాన్ విజయానికి చివరి ఓవర్‌లో 8 పరుగులు చేయాల్సి ఉండగా మూడు వికెట్లు మిగిలి ఉన్నాయి. టీమిండియా కెప్టెన్ యష్ దుల్.. రవికుమార్‌కు బంతిని అందించాడు. తొలి బంతికే రవి కుమార్ జమీర్ వికెట్ తీశాడు. దాని తర్వాతి రెండు బంతుల్లో రెండు పరుగులు మాత్రమే ఇచ్చాడు.

పాకిస్తాన్ గెలవాలంటే మూడు బంతుల్లో ఆరు పరుగులు చేయాల్సి వచ్చిన సంధర్భంలో నాలుగో బంతికి రెండు పరుగులు వచ్చాయి, తర్వాతి బంతికి కూడా రెండు పరుగులు వచ్చాయి. పాకిస్తాన్ చివరి బంతికి రెండు పరుగులు చేయాల్సి రాగా.. అహ్మద్ ఖాన్ క్రీజులో ఉన్నాడు. చివరిబంతికి అహ్మద్ ఫోర్ కొట్టి తన జట్టుకు చిరస్మరణీయ విజయాన్ని అందించాడు.

పాకిస్తాన్ తరఫున ఫస్ట్ బౌలింగ్‌లో జీషన్‌ జమీర్‌ అద్భుత ప్రదర్శన చేశాడు. 10 ఓవర్లలో 60 పరుగులిచ్చి ఐదు వికెట్లు తీశాడు. తర్వాత బ్యాటింగ్‌లో, మహ్మద్ షాజాద్ 105 బంతుల్లో 81 పరుగులతో మ్యాచ్ విన్నింగ్ ఇన్నింగ్స్ ఆడాడు.అహ్మద్ ఖాన్ కేవలం 19 బంతుల్లో 29 నాటౌట్ ఇన్నింగ్స్ ఆడి జట్టుకు విజయాన్ని అందించాడు.

అంగ్‌క్రిష్ రఘువంశీ డకౌట్ అవ్వగా.. షేక్ రషీద్ 6పరుగులు, కెప్టెన్ యశ్ ధుల్ 0, నిశాంత్ సంధు కేవలం 8పరుగులకే అవుటయ్యారు. అయితే, హర్నూర్ సింగ్ 46, వికెట్ కీపర్ బ్యాట్స్‌మెన్ ఆరాధ్య యాదవ్ 50 పరుగులు చేశారు.