పంత్ బదులు కీపర్‌గా రాహుల్!

పంత్ బదులు కీపర్‌గా రాహుల్!

ఆస్ట్రేలియాతో జరిగిన తొలి మ్యాచ్‌లోనే భారత్‌కు పరాభవం ఎదురైంది. 10వికెట్ల తేడాతో వన్డే సిరీస్ లో తొలి మ్యాచ్ గెలిచింది ఆస్ట్రేలియా. మ్యాచ్ మధ్యలో జరిగిన ఓ సంఘటన అందరిలో ప్రశ్న తలెత్తేలా చేసింది. కీపింగ్ బాధ్యతలను రిషబ్ పంత్ నుంచి కేఎల్ రాహుల్‌కు అప్పగించాడు. పంత్‌ను పక్కకుబెట్టడం ప్రయోగమా.. వైద్యులు చెప్పిన కారణంగా రాహుల్‌కు ఇవ్వాల్సి వచ్చిందా అని  కోహ్లీ తీసుకున్న నిర్ణయం వెనుక సందేహాలు మొదలయ్యాయి. 

భారత ఇన్నింగ్స్ 44వ ఓవర్లో రిషబ్ పంత్ గాయపడ్డాడు. కమిన్స్ వేసిన బౌన్సర్‌ను ఫుల్‌షాట్ ఆడేందుకు యత్నించి పంత్ గాయపడ్డాడు. బంతి పంత్ బ్యాట్‌కు తాకి టాప్ ఎడ్జ్ తీసుకుని హెల్మెట్‌ను బలంగా తాకింది. పాయింట్ వద్ద ఫీల్డింగ్ చేస్తున్న ఆష్టన్ టర్న్ చేతిలో పడింది. క్యాచ్ విషయంలో ఆన్ ఫీల్డ్ అంపైర్ ఔట్ ప్రకటించలేదు. 

నిజాయతీగా వ్యవహరించిన పంత్.. పెవిలియన్‌కు నడుచుకుంటూ వెళ్లిపోయాడు. అనంతరం పంత్ కంకషన్‌కు గురైనట్లు టీమ్ మేనేజ్మెంట్ నిర్ణాయానికొచ్చింది. ఈ ఘటనపై బీసీసీఐ ట్విట్టర్‌లో స్పందించింది. గాయానికి గురైన పంత్ వైద్యుల పర్యవేక్షణలో ఉన్నాడని, అందుకే రాహుల్ వికెట్‌ కీపర్‌గా వ్యవహరిస్తున్నాడని తెలిపింది. 

ఆస్ట్రేలియా ఇన్నింగ్స్ ప్రారంభంలో పంత్ స్థానంలో రాహుల్ వికెట్ కీపర్ అవతారమెత్తాడు. మనీశ్ పాండే.. కంకషన్ ప్లేయర్ రూపంలో మైదానంలోకి దిగి ఫీల్డింగ్ చేశాడు. 3 వన్డేల సిరీస్‌లో భాగంగా ముంబైలో జరుగుతున్న ఈ వన్డేలో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ 255 పరుగులకే ఆలౌటైంది.