India vs Australia : టీమిండియా టీం, పంత్, గిల్‌లకు దక్కని స్థానం

India vs Australia : టీమిండియా టీం, పంత్, గిల్‌లకు దక్కని స్థానం

India vs Australia 1st Test : ఆస్ట్రేలియా – భారత్ తొలి టెస్టు మ్యాచ్‌కు అన్ని ఏర్పాట్లు జరుగుతున్నాయి. డే అండ్ టెస్టు, పింక్ బాల్‌తో ఆట జరుగనుంది. ఈ మ్యాచ్‌ గురించి అందరూ ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. ఆడిలైడ్ ఓవల్‌లో 2020, డిసెంబర్ 17వ తేదీన ఈ మ్యాచ్ ప్రారంభం కానుంది. ఇందుకు సంబంధించి..BCCI తన జట్టు సభ్యులను ప్రకటించింది. రిషబ్ పంత్, శుభ్‌మన్ గిల్‌లను పక్కకు పెట్టేయడం గమనార్హం.

టీమిండియా :
విరాట్ కోహ్లీ (కెప్టెన్‌), మయాంక్ అగర్వాల్, పృథ్వీ షా, చతేశ్వర్ పూజారా, అజింక్య రహానె, హనుమా విహారీ, వృద్ధిమాన్ సాహా (వికెట్‌ కీపర్‌), రవిచంద్రన్‌ అశ్విన్, ఉమేష్ యాదవ్, మహ్మద్ షమీ, జస్ప్రీత్ బుమ్రా.

ఛతేశ్వర్ పుజార, పృథ్వీ షాలు కలిసి ఓపెనింగ్ ప్రారంభించే అవకాశం ఉంది. పంత్ స్థానంలో జట్టులోకి వచ్చిన..సాహా వికెట్ కీపర్‌గా బాధ్యతలు చేపట్టనున్నాడు. వ్యక్తిగత
కారణాలతో ఆసీస్ పర్యటనకు వెళ్లలేకపోయిన..రోహిత్ ఇటీవలే ఫిట్‌నెస్ పరీక్షలు పూర్తి చేసుకుని రెడీ అయ్యాడు. డిసెంబర్ 15వ తేదీన ఆస్ట్రేలియాకు వెళ్లాడు. చివరి రెండు టెస్టులకు అందుబాటులో ఉంటాడని బీసీసీఐ వెల్లడించింది. ఇక కెప్టెన్ విరాట్ కోహ్లీ…ఈ మ్యాచ్ ఆడిన అనంతరం భారత్‌కు రానున్నాడు. అతని భార్య అనుష్క శర్మ డెలివరీ నేపథ్యంలో అందుబాటులో ఉండడం లేదు. ఇతనిస్థానంలో అజింక్యా రహానే కెప్టెన్‌గా వ్యవహరించనున్నాడు.

కానీ..పృథ్వీ షాను ఎంపిక చేయడంపై అభిమానులు ఆశ్చర్యపోయారు. మొన్న జరిగిన వార్మప్ మ్యాచ్‌లో నాలుగు ఇన్నింగ్స్‌లలో షా 0, 19, 40, 03 పరుగులు మాత్రమే చేశాడు. స్పిన్నర్‌గా రవిచంద్రన్ అశ్విన్‌కు అవకాశం కల్పించారు. కుల్దీప్ యాదవ్, రవీంద్ర జడేజా‌లకు ప్లేస్ దక్కింది. మహ్మద్ షమీ, బుమ్రా, ఉమేశ్ యాదవ్‌లతో టీమిండియా బౌలింగ్ బలంగా ఉందని విశ్లేషకులు వెల్లడిస్తున్నారు.