INDvsAUS: ఆస్ట్రేలియా టార్గెట్ 341

INDvsAUS: ఆస్ట్రేలియా టార్గెట్ 341

టీమిండియా దూకుడు చూపించింది. తొలి వన్డే ఓటమికి అదే స్థాయిలో సమాధానం చెప్పాలని రెచ్చిపోయింది. ఆరంభం నుంచి దూకుడు ప్రదర్శించిన కోహ్లీ సేన ఆస్ట్రేలియాకు 341పరుగుల టార్గెట్ ఇచ్చింది. ఓపెనర్లు రోహిత్(42; 44బంతుల్లో 6ఫోర్లు).. ధావన్(96; 90బంతుల్లో 13ఫోర్లు, 1సిక్సు)లు చక్కటి ఆరంభాన్ని ఇచ్చారు.

సెంచరీకి ముందు ధావన్ అవుట్ అయినప్పటకీ కోహ్లీ(78; 76బంతుల్లో 6ఫోర్లు)తో రాహుల్(80; 52బంతుల్లో 6ఫోర్లు, 3సిక్సులు) స్కోరు బోర్డును పరుగులు పెట్టించారు. ఓ వైపు వికెట్లు పడుతున్నా రాహుల్.. దూకుడు తగ్గించలేదు. ఈ క్రమంలో శ్రేయాస్ అయ్యర్(7)తర్వాత దిగి 49.4వ బంతికి అలెక్స్ క్యారీ చేతిలో రనౌట్ గా వెనుదిరిగాడు.

మిగతా బ్యాట్స్‌మెన్ మనీశ్ పాండే(2), రవీంద్ర జడేజా(20), మొహమ్మద్ షమీ(1)పరుగులు చేయగలిగారు. రిచర్డ్‌సన్(2), ఆడం జంపా(3)వికెట్లు తీయగలిగారు. 

రాజ్ కోట్ వేదికగా రెండో వన్డేలో భారత్ గెలిచేందుకు మెరుగైన అవకాశాలు కనిపిస్తున్నాయి. మూడో వన్డేను ఇరు జట్లు బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం వేదికగా ఆడనున్నాయి.