లెక్కసరి: ఉత్కంఠ పోరులో భారత్ ఘనవిజయం

ఆస్ట్రేలియాతో అడిలైడ్ వేదికగా జరిగిన నిర్ణయాత్మక రెండో వన్డేలో టీమిండియా ఘన విజయం సాధించింది. భారత కెప్టెన్, పరుగుల యంత్రం విరాట్ కోహ్లీ తన కెరీర్ 39వ వన్డేలో సెంచరీ సాధించి భారత్ కు తిరుగులేని విజయాన్నిఅందించాడు.

  • Published By: sreehari ,Published On : January 15, 2019 / 11:46 AM IST
లెక్కసరి: ఉత్కంఠ పోరులో భారత్ ఘనవిజయం

ఆస్ట్రేలియాతో అడిలైడ్ వేదికగా జరిగిన నిర్ణయాత్మక రెండో వన్డేలో టీమిండియా ఘన విజయం సాధించింది. భారత కెప్టెన్, పరుగుల యంత్రం విరాట్ కోహ్లీ తన కెరీర్ 39వ వన్డేలో సెంచరీ సాధించి భారత్ కు తిరుగులేని విజయాన్నిఅందించాడు.

  • 6 వికెట్ల తేడాతో ఆస్ట్రేలియాపై టీమిండియా గెలుపు 

  • మూడు మ్యాచ్ ల సిరీస్ 1-1 తో సమం.. 

  • ఆడిలైడ్ రెండోవన్డేలో ధోనీ, కోహ్లీ విజృంభణ

అడిలైడ్: ఆస్ట్రేలియాతో అడిలైడ్ వేదికగా జరిగిన నిర్ణయాత్మక రెండో వన్డేలో టీమిండియా ఘన విజయం సాధించింది. భారత కెప్టెన్, పరుగుల యంత్రం విరాట్ కోహ్లీ తన కెరీర్ 39వ వన్డేలో సెంచరీ సాధించి భారత్ కు తిరుగులేని విజయాన్ని అందించాడు. 299 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన భారత్ 49.2 ఓవర్లలో 4 వికెట్లు నష్టానికి లక్ష్యాన్ని ఛేదించి తొలివన్డేలో పరాజయానికి బదులు తీర్చుకుంది. 4 బంతులు మిగిలి ఉండగానే 6 వికెట్ల తేడాతో కోహ్లీసేన విజయాన్ని అందుకుంది. తద్వారా మూడు వన్డేల సిరీస్ 1-1 సమం చేసి లెక్క సరి చేశారు.

కోహ్లీ సెంచరీ.. ధోని హాఫ్ సెంచరీ..
కోహ్లీ, మిస్టర్ కూల్ మహేంద్ సింగ్ ధోనీ అద్భుత ప్రదర్శనతో టీమిండియాను విజయపథంలోకి నడిపారు. కోహ్లీ (112 బంతుల్లో 5 ఫోర్లు, 2 సిక్స్) 104 సెంచరీ నమోదు చేయగా, ధోని 54 బంతుల్లో 55 పరుగులు చేసి జట్టును విజయతీరాలకు చేర్చాడు. 6 బంతుల్లో 7 పరుగులు చేయాల్సి ఉండగా.. ఆఖరి ఓవర్ లో తొలి బంతికి ధోనీ సిక్స్ బాది సింగిల్ తీయడంతో భారత్ గెలుపు ఖాయమైంది. తొలివన్డేలో పరాజయానికి ప్రతీకారంగా రెండోవన్డేలో కోహ్లీసేన దూకుడుగా ఆడి లెక్క సరిచేసింది. ఆసీస్ బౌలర్లలో జాసన్, రిచార్డ్ సన్, స్టోనియిస్, మ్యాక్స్ వెల్ తలో వికెట్ తీసుకున్నారు. అంతకుముందు బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా జట్టు నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 298 పరుగులు చేసింది. 

సిడ్నీ వేదికగా తొలి వన్డేలో ధోనీ 96 బంతుల్లో 51 హాఫ్ సెంచరీ నమోదుచేశాడు. రోహిత్ శర్మ ఒక్కడే ఒంటరి పోరాటం చేసి సెంచరీ నమోదు చేసిన భారత్ ను విజయం వరించలేదు. ఆసీస్ పట్టుబిగించడంతో భారత్ తొలివన్డేలో 34 పరుగుల తేడాతో పరాజయం పాలైంది.