India vs Australia 3rd Test: ముగిసిన మొదటి రోజు ఆట.. ఆధిక్యంలో ఆస్ట్రేలియా.. Live Updates

బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భాగంగా ఇండోర్‌లోని హోల్కర్ క్రికెట్ స్టేడియంలో ఆస్ట్రేలియా, ఇండియా మధ్య మూడో టెస్ట్ మ్యాచ్ జరుగుతుంది. టాస్ గెలిచిన భారత కెప్టెన్ రోహిత్ శర్మ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్నాడు.

India vs Australia 3rd Test:  ముగిసిన మొదటి రోజు ఆట.. ఆధిక్యంలో ఆస్ట్రేలియా.. Live Updates

IND vs AUS Test Match

India vs Australia 3rd Test: ఇండియా-ఆస్ట్రేలియా జట్ల మధ్య జరుగుతున్న మూడో టెస్టు మొదటి రోజు ఆట ముగిసింది. మొదటి రోజు ఆటలో ఆస్ట్రేలియా ఆధిక్యం సాధించింది. తొలుత టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఇండియా తక్కువ పరుగులకే ఆలౌటైంది. 33.2 ఓవర్లలో, 109 పరుగులకే ఆలౌటైంది. భారత ఇన్నింగ్స్‌లో విరాట్ కోహ్లీ అత్యధికంగా 22 పరుగులు చేశాడు. తర్వాత బ్యాటింగ్ ఆరంభించిన ఆస్ట్రేలియా నిలకడగా ఆడుతోంది. మొదటి రోజు ఆట ముగిసే సమయానికి 156 పరుగులకు నాలుగు వికెట్లు కోల్పోయింది. భారత్‌పై తొలి ఇన్నింగ్స్‌లో 47 పరుగుల ఆధిక్యంలో ఉంది. భారత బౌలింగులో రవీంద్ర జడేజా అదరగొట్టాడు. ఆస్ట్రేలియా కోల్పోయిన నాలుగు వికెట్లను జడేజానే తీయడం విశేషం.

The liveblog has ended.

LIVE NEWS & UPDATES

  • 01 Mar 2023 04:35 PM (IST)

    నాలుగో వికెట్ కోల్పోయిన ఆస్ట్రేలియా

    ఆస్ట్రేలియా 146 పరుగుల వద్ద నాలుగో వికెట్ కోల్పోయింది. 26 పరుగులు చేసిన స్టీవెన్ స్మిత్ (కెప్టెన్) రవీంద్ర జడేజా బౌలింగ్‌లో, శ్రీకర్ భరత్‌కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. ప్రస్తుతం క్రీజులో పీటర్ హ్యాండ్స్‌కోంబ్, క్యామెరూన్ గ్రీన్ ఉన్నారు. ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్‌లో 45 పరుగుల ఆధిక్యంలో కొనసాగుతుంది. ఆసీస్ స్కోరు 154/4గా ఉంది.

  • 01 Mar 2023 04:19 PM (IST)

    బౌలింగ్‌లో అదరగొడుతున్న రవీంద్ర జడేజా

    భారత ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా బౌలింగ్‌లో సత్తా చాటుతున్నాడు. మొదటి ఇన్నింగ్స్‌లో బ్యాటింగ్‌లో 4 పరుగులే చేసి నిరాశపర్చినప్పటికీ, బౌలింగ్‌లో అదరగొడుతున్నాడు. ఇప్పటివరకు ఆస్ట్రేలియా మూడు వికెట్లు కోల్పోగా, ఆ మూడు రవీంద్ర జడేజానే తీయడం విశేషం. జడేజా తీసిన వికెట్లలో ఒకటి ఎల్బీడబ్ల్యూ కాగా, మరోటి తనే క్యాచ్ పట్టాడు.

  • 01 Mar 2023 04:09 PM (IST)

    మూడో వికెట్ కోల్పోయిన ఆస్ట్రేలియా

    ఆస్ట్రేలియా 125 పరుగుల వద్ద మూడో వికెట్ కోల్పోయింది. అర్ధ సెంచరీ చేసి నిలకడగా ఆడుతున్న ఉస్మాన్ ఖవాజా ఔటయ్యాడు. 147 బంతుల్లో 60 పరుగులు చేసిన ఉస్మాన్ రవీంద్ర జడేజా బౌలింగ్‌లో శుభ్‌మన్‌గిల్‌కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. ప్రస్తుతం ఆస్ట్రేలియా స్కోరు 125/3గా ఉంది. ప్రస్తుతం క్రీజులో స్టీవెన్ స్మిత్, పీటర్ హ్యాండ్స్‌కోంబ్ ఉన్నారు. భారత్‌పై ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్‌లో 17 పరుగుల ఆధిక్యంలో ఉంది.

  • 01 Mar 2023 03:28 PM (IST)

    రెండో వికెట్ కోల్పోయిన ఆస్ట్రేలియా

    తొలి ఇన్నింగ్స్‌లో నిలకడగా ఆడుతున్న ఆస్ట్రేలియా రెండో వికెట్ కోల్పోయింది. రవీంద్ర జడేజా బౌలింగులో మార్నస్ లాబస్చేంజ్, జడేజాకే క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. మార్నస్ 91 బంతుల్లో 31 పరుగులు చేశాడు. ప్రస్తుతం ఆస్ట్రేలియా స్కోరు 108/2. భారత్ తొలి ఇన్నింగ్స్ 109/10

  • 01 Mar 2023 03:24 PM (IST)

    అర్ధ సెంచరీ పూర్తి చేసుకున్న ఉస్మాన్ ఖవాజా

    ఇండియా-ఆస్ట్రేలియా మధ్య జరుగుతున్న మూడో టెస్టులో ఆస్ట్రేలియా బ్యాట్స్‌మెన్ ఉస్మాన్ ఖవాజా అర్ధ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. 103 బంతుల్లోనే ఉస్మాన్ ఖవాజా 50 పరుగులు పూర్తి చేసుకున్నాడు. ఇది ఉస్మాన్ ఖవాజాకు 21వ అర్ధ సెంచరీ. ప్రస్తుతం క్రీజులో ఉస్మాన్, మార్నస్ ఉన్నారు.

  • 01 Mar 2023 02:20 PM (IST)

    టీ బ్రేక్ సమయానికి ఆసీస్ స్కోర్ 71/1

    ఆస్ట్రేలియా ఆటగాళ్లు నిలకడగా ఆడుతున్నారు. ఆరంభంలోనే వికెట్ కోల్పోయి‌నప్పటికీ.. ఖావాజా (33), మార్నస్ లబుషేన్ (16) భారత్ బౌలర్లను ధీటుగా ఎదుర్కొంటూ పరుగులు రాబడుతున్నారు. వీరిద్దరి భాగస్వామ్యంలో 123 బంతులకు 59 పరుగులు చేశారు. ప్రస్తుతం 22 పూర్తయ్యే సరికి ఆస్ట్రేలియా ఒక్క వికెట్ కోల్పోయి 71 పరుగులు చేసింది. టీబ్రేక్ సమయానికి భారత్ జట్టు తొలి ఇన్నింగ్స్ లో చేసిన పరుగులను అధిగమించాలంటే ఆసీస్ మరో 38 పరుగులు చేయాల్సి ఉంటుంది. టీమిండియా బౌలర్లలో జడేజా ఒక వికెట్ తీసుకున్నాడు. ఆసీస్ రెండో వికెట్ పడగొట్టేందుకు ఇండియా బౌలర్లు తంటాలు పడుతున్నారు.

  • 01 Mar 2023 01:09 PM (IST)

    తొలి వికెట్ కోల్పోయిన ఆస్ట్రేలియా

    టీమిండియా తొలిఇన్నింగ్స్‌లో 109 పరుగులకే ఆలౌట్ అయింది. వెంటనే తొలిఇన్నింగ్స్ బ్యాటింగ్ ప్రారంభించిన ఆస్ట్రేలియా జట్టుకు ఆదిలోనే ఎదురుదెబ్బ తగిలింది. రెండో ఓవర్లోనే ట్రావిస్ హెడ్ (9) ఔట్ అయ్యాడు. జడేజా వేసిన రెండో ఓవర్లో ఎల్బీ‌డబ్ల్యూగా వెనుదిరిగాడు.

  • 01 Mar 2023 01:05 PM (IST)

    ఇండియా తొలి ఇన్నింగ్స్ స్కోర్ బోర్డు

    ఇండియా తొలి ఇన్నింగ్స్ స్కోర్ బోర్డు

  • 01 Mar 2023 01:02 PM (IST)

    తక్కువ పరుగులకే టీమిండియా ఆలౌట్..

    ఆసీస్‌తో జరుగుతున్న మూడో టెస్ట్ మ్యాచ్ తొలి ఇన్నింగ్స్‌లో టీమిండియా 109 పరుగులకే ఆలౌట్ అయింది. ఆసీస్ స్పిన్ బౌలర్ల ధాటికి భారత బ్యాటర్లు ఏ ఒక్కరూ క్రీజ్‌లో నిలువలేక పోయారు. ఆస్ట్రేలియా బౌలర్లలో కునెమన్ ఐదు వికెట్లు పడగొట్టగా, నాథన్ లైయన్ మూడు, మర్ఫీ ఒక వికెట్ తీసుకున్నాడు. చివరిలో సిరాజుద్దీన్ రనౌట్ రూపంలో వెనుదిరిగాడు.

  • 01 Mar 2023 12:29 PM (IST)

    తొమ్మిదో వికెట్ కోల్పోయిన టీమిండియా ..

    టీమిండియా తొమ్మిదో వికెట్ కోల్పోయింది. ఉమేష్ యాదవ్ (17) కునెమన్ బౌలింగ్ లో ఔట్ అయ్యాడు. అక్షర్ పటేల్ (11), మహ్మద్ సిరాజు(0) క్రీజులో ఉన్నారు.

  • 01 Mar 2023 11:37 AM (IST)

    లంచ్ బ్రేక్ సమయానికి భారత్ స్కోర్ 84/7

    ఆసీస్ బౌలర్ల ధాటికి టీమిండియా ఆటగాళ్లు బెంబేలెత్తిపోయారు. క్రీజ్‌లో ఎక్కువ సేపు నిలవకుండానే పెవిలియన్ బాట పట్టారు. దీంతో 26ఓవర్లు పూర్తికాగా.. లంచ్ బ్రేక్ సమయానికి టీమిండియా ఏడు వికెట్లు కోల్పోయి 84 పరుగులు చేసింది. రవిచంద్ర అశ్విన్ (1), అక్షర్ పటేల్ (6) క్రీజులో ఉన్నారు.

  • 01 Mar 2023 11:33 AM (IST)

    ఏడో వికెట్ కోల్పోయిన భారత్..

    టీమిండియా ఏడో వికెట్ కోల్పోయింది. కేఎస్ భరత్ (17) ఔట్ అయ్యాడు. లైన్ వేసిన 25వ ఓవర్లో ఐదో బంతికి వికెట్ల ముందు దొరికిపోయాడు. 25 ఓవర్లు పూర్తయ్యే సరికి టీమిండియా స్కోర్ 82/7.

  • 01 Mar 2023 11:15 AM (IST)

    కోహ్లీ ఔట్ ..

    టీమిండియా ఆరో వికెట్ కోల్పోయింది. మార్ఫీ వేసిన 21.4 ఓవర్లో విరాట్ కోహ్లీ (22) ఔట్ అయ్యాడు. 22 ఓవర్లు పూర్తయ్యే సరికి టీమిండియా స్కోర్ 71/6.

     

  • 01 Mar 2023 10:50 AM (IST)

    16ఓవర్లకు టీమిండియా స్కోర్ 61/5 ..

    ఆసీస్ బౌలర్ల ధాటికి టీమిండియా బ్యాటర్లు బెంబేలెత్తిపోయారు. నాథన్ లైయన్, కునెమన్‌ బౌలింగ్ మాయాజాలంకు క్రీజ్ లో నిలవలేక వరుసగా పెవిలియన్ బాటపట్టారు. దీంతో  టీమిండియా స్కోర్ నెమ్మదించింది. 16 ఓవర్లు పూర్తయ్యే సరికి టీమిండియా స్కోర్ 61/5కు చేరింది. విరాట్ కోహ్లీ (18), శ్రీకర్ భరత్ (5) క్రీజ్ లో ఉన్నారు.

  • 01 Mar 2023 10:30 AM (IST)

    ఐదో వికెట్ డౌన్..

    టీమిండియా ఐదో వికెట్ కోల్పోయింది. శ్రేయాస్ అయ్యర్ (0) డకౌట్ అయ్యాడు. కునెమన్ వేసిన 11.2 ఓవర్లో బౌల్డ్ అయ్యాడు. ప్రస్తుతం టీమిండియా స్కోర్ 11.2 ఓవర్లకు 45/5

  • 01 Mar 2023 10:28 AM (IST)

    నాల్గో వికెట్ డౌన్..

    టీమిండియా నాల్గో వికెట్ కోల్పోయింది. రవీంద్ర జడేజా (4) ఔట్ అయ్యాడు. నాథన్ లైయన్ వేసిన 10.5 ఓవర్లో కునెమన్‌ క్యాచ్ ఇచ్చి పెవిలియన్ బాటపట్టాడు. క్రీజ్‌లోకి శ్రేయాస్ అయ్యర్ వచ్చాడు.

  • 01 Mar 2023 10:22 AM (IST)

    మూడు వికెట్లు కోల్పోయిన భారత్..

    టీమిండియాకు ఆదిలోనే ఎదురుదెబ్బ తగిలింది. వరుసగా మూడు వికెట్లు కోల్పోయింది. మొదటి వికెట్ రూపంలో రోహిత్ శర్మ (12) ఔట్ కాగా. ఆ వెంటనే శుభ్‌మన్ గిల్ (21) కునెమన్ బౌలింగ్ లో స్టీవ్ స్మిత్ కు క్యాచ్ ఇచ్చి ఔట్ అయ్యాడు. రోహిత్ శర్మ తరువాత క్రీజ్‌లోకి వచ్చిన ఛతేశ్వర్ పుజారా సైతం వెంటనే ఔట్ అయ్యాడు. 8.2 ఓవర్ కు నాథన్ లైయన్ వేసిన ఓవర్లో పుజారా (1) క్లీన్ బౌల్డ్ అయ్యాడు.

  • 01 Mar 2023 10:04 AM (IST)

    తొలి వికెట్ డౌన్.. రోహిత్ శర్మ ఔట్..

    మూడో టెస్టులో భాగంగా తొలుత బ్యాటింగ్ ప్రారంభించిన టీమిండియా కొద్ది సేపట్లోనే వికెట్ కోల్పోయింది. రోహిత్ శర్మ (12) ఔట్ అయ్యాడు. కునెమన్‌ వేసిన ఐదవ ఓవర్లో ఔట్ అయ్యాడు.

  • 01 Mar 2023 09:41 AM (IST)

    రెండు ఓవర్లు పూర్తి.. ఇండియా 10/0

    ఆస్ట్రేలియా, ఇండియా మూడో టెస్ట్ మ్యాచ్ ప్రారంభమైంది. రోహిత్ శర్మ, శుభ్‌మన్ గిల్ క్రీజ్ లోకి వచ్చారు. మిచెల్ స్టార్క్ తొలి ఓవర్ వేశారు. తొలి ఓవర్లో నాలుగు పరుగులు వచ్చాయి. రెండో ఓవర్ కామెరాన్ గ్రీన్ రెండో ఓవర్ వేయగా.. ఆరు పరుగులు వచ్చాయి.

  • 01 Mar 2023 09:37 AM (IST)

    ఆస్ట్రేలియా తుది జట్టు ..

    స్టీవ్ స్మిత్ (కెప్టెన్), ట్రావిస్ హెడ్, ఉస్మాన్ ఖవాజా, లుబషేన్, హ్యాండ్స్‌కాంబ్, కామెరూన్ గ్రీన్, అలెక్స్‌ కేరీ, మిచెల్ స్టార్క్‌, టాడ్‌ మర్ఫీ, నాథన్‌ లైయన్‌, కునెమన్‌.

  • 01 Mar 2023 09:35 AM (IST)

    భారత్ తుది జట్టు..

    రోహిత్‌ శర్మ (కెప్టెన్‌), శుభ్‌మన్ గిల్‌‌, ఛెతేశ్వర్‌ పుజారా, విరాట్ కోహ్లీ, శ్రేయస్ అయ్యర్‌‌, రవీంద్ర జడేజా, కేఎస్ భరత్‌, అశ్విన్‌, అక్షర్ పటేల్‌, ఉమేశ్‌ యాదవ్‌, సిరాజ్‌.

  • 01 Mar 2023 09:33 AM (IST)

    రాహుల్ ఔట్.. శుభ్‌మన్ గిల్ ఇన్..

    ఇండియా, ఆస్ట్రేలియా మధ్య జరిగిన రెండు టెస్టు మ్యాచ్‌లలో ఫామ్ కోల్పోయి పరుగులు రాబట్టడంలో విఫలమైన కె.ఎల్. రాహుల్ మూడో టెస్టు తుదిజట్టులో స్థానం కోల్పోయాడు. రాహుల్ ప్లేస్‌లో శుభ్‌మన్ గిల్ తుది జట్టులో ఎంపికయ్యాడు. మరోవైపు గాయం కారణంగా మహ్మద్ షమీకి విశ్రాంతి ఇచ్చి ఉమేష్ యాదవ్‌ను తుది జట్టులోకి తీసుకున్నారు.

  • 01 Mar 2023 09:28 AM (IST)

    టాస్ గెలిచిన టీమిండియా..

    ఇండోర్‌లో ఆస్ట్రేలియాతో జరుగుతున్న మూడో టెస్టు మ్యాచ్ లో భారత కెప్టెన్ రోహిత్ శర్మ టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ తీసుకున్నాడు.