IND vs AUS 1st ODI: 5 వికెట్ల తేడాతో టీమిండియా గెలుపు.. కేఎల్ రాహుల్ 75 పరుగులు బాది నాటౌట్

కేఎల్ రాహుల్ టీమిండియాను గెలిపించాడు. ఓపెనర్లు ఇషాన్ కిషన్ (3 పరుగులు), శుభ్ మన్ గిల్ (20) సహా విరాట్ కోహ్లీ (4), సూర్యకుమార్ యాదవ్ (0) క్రీజులో ఎక్కువ సేపు నిలవలేకపోయారు. హార్దిక్ పాండ్యా 30 బంతుల్లో 25 పరుగులు చేసి ఔటయ్యాడు. ఓ దశలో టీమిండియా ఆసలు గెలుస్తుందా? అన్న సందేహాలు వచ్చాయి.

IND vs AUS 1st ODI: కేఎల్ రాహుల్ టీమిండియాను గెలిపించాడు. ఇండియా, ఆస్ట్రేలియా జట్ల మధ్య మూడు వన్డే మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా ఇవాళ తొలి వన్డే వాంఖడే స్టేడియంలో జరిగింది. టీమిండియా కెప్టెన్ హార్దిక్ పాండ్యా టాస్ గెలిచి, తొలుత ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. 188 పరుగులకే ఆస్ట్రేలియా ఆలౌట్ అయింది.

లక్ష్య ఛేదనలో మొదట భారత టాప్ ఆర్డర్ బ్యాటర్లు తడబడ్డారు. ఓపెనర్లు ఇషాన్ కిషన్ (3 పరుగులు), శుభ్ మన్ గిల్ (20) సహా విరాట్ కోహ్లీ (4), సూర్యకుమార్ యాదవ్ (0) క్రీజులో ఎక్కువ సేపు నిలవలేకపోయారు. హార్దిక్ పాండ్యా 30 బంతుల్లో 25 పరుగులు చేసి ఔటయ్యాడు. ఓ దశలో టీమిండియా ఆసలు గెలుస్తుందా? అన్న సందేహాలు వచ్చాయి.

అయితే, 5వ స్థానంలో బ్యాటింగ్ కు దిగిన కేఎల్ రాహుల్ క్రీజులో నిలదొక్కుకుని అద్భుతంగా ఆడాడు. 91 బంతుల్లో 75 పరుగులు చేశాడు. అతడికి ఇది 13వ అర్ధ సెంచరీ. కేఎల్ రాహుల్ కు రవీంద్ర జడేజా చక్కని సహకారం అందించాడు. రవీంద్ర జడేజా 69 బంతుల్లో 45 పరుగులు చేశాడు. దీంతో టీమిండియా 39.5 ఓవర్లలో 191 పరుగులు చేసింది. 5 వికెట్ల తేడాతో గెలుపొందింది.

టీమిండియా బ్యాటర్లు అందరూ విఫలమైన వేళ కేఎల్ రాహుల్ అద్భుతంగా ఆడిన తీరు అభిమానుల్లో ఎంతో ఉత్సాహాన్ని కలిగించింది. ఇటీవల టెస్టు మ్యాచుల్లో కేఎల్ రాహుల్ ఘోరంగా విఫలమై తీవ్ర విమర్శలు ఎదుర్కొన్నాడు. అతడిని జట్టులోకి తీసుకోవద్దని కొందరు అన్నారు. నేడు కేఎల్ రాహుల్ టీమిండియాను గెలిపించాడు. ఆస్ట్రేలియా బౌలర్లలో స్టార్క్‌కు 3, స్టోయినిస్‌కు 2 వికెట్లు దక్కాయి.

అంతకుముందు, భారత బౌలర్లు చెలరేగడంతో 35.4 ఓవర్లకే ఆస్ట్రేలియా 188 పరుగులకే కుప్పకూలింది. ఆసీస్ బ్యాటర్లలో మిచెల్ మార్ష్ (81) తప్ప మిగతా బ్యాటర్లు ఎవరూ చెప్పుకోదగ్గ స్కోరు చేయలేదు. భారత బౌలర్లలో షమీ, సిరాజ్ కు మూడేసి వికెట్లు, రవీంద్ర జడేజాకు 2 వికెట్లు, హార్దిక్ పాండ్యా, కుల్దీప్ యాదవ్ కు చెరో వికెట్ దక్కాయి.

DC vs GG WPL 2023 : అదరగొట్టిన గుజరాత్ అమ్మాయిలు.. ఢిల్లీపై విజయం

ట్రెండింగ్ వార్తలు