మ్యాచ్‌లో మొదటి దెబ్బ మనీశ్ పాండే క్యాచ్

మ్యాచ్‌లో మొదటి దెబ్బ మనీశ్ పాండే క్యాచ్

టీమిండియా ఆస్ట్రేలియాపై ప్రతీకారం తీర్చుకోవడంలో ప్రధానంగా ఫీల్డింగే ప్లస్ పాయింట్. భారత బ్యాట్స్‌మెన్ భారీ టార్గెట్ ముందుంచినా కొట్టేసేలా కనిపించిన ఆసీస్‌ను టీమిండియా ఫీల్డింగ్ బలంతో జట్టును కుంగదీసింది. ఇందులో ప్రధానంగా ఆసీస్ ఓపెనర్ డేవిడ్ వార్నర్ వికెట్ పడగొట్టడమే కీలకంగా అనిపించింది. మ‌నీష్ పాండే ఫీల్డింగ్ స్కిల్స్‌తో ఆశ్చర్యపరిచాడు.

అద్భుత‌మైన క్యాచ్‌తో రాజ్‌కోట్‌లో ఆసీస్ ఓపెన‌ర్ వార్న‌ర్‌కు షాక్ ఇచ్చాడు. ష‌మీ వేసిన బౌలింగ్‌లో క‌వ‌ర్స్ మీదుగా భారీ షాట్‌కు య‌త్నించాడు వార్న‌ర్‌. అద్భుత‌మైన క్యాచ్‌ అందుకుని ధీమాగా బంతిని వెనక్కి విసిరేశాడు మనీశ్. గాలిలో వేగంగా వెళ్తున్న బంతిని.. మ‌నీష్ గాలిలోకి ఎగిరి ఒంటి చేత్తో అందుకున్నాడు. మెరుపు వేగంతో అందుకున్న క్యాచ్ ఆసీస్ పై తొలి దెబ్బ పడేలా చేసింది.

వార్న‌ర్ 12 బంతుల్లో రెండు ఫోర్ల‌తో 15 ర‌న్స్ చేశాడు. 341 పరుగుల లక్ష్యచేధనతో బరిలోకి దిగిన ఆసీస్.. 36పరుగుల ముందే ఆల్ అవుట్ గా వెనుదిరిగింది. మూడో వన్డేను ఇరు జట్లు బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం వేదికగా ఆడనున్నాయి.

What a catch ?

Manish Pandey takes a one-handed stunner to dismiss David Warner early for 15.

Brilliant start for India!#INDvAUS pic.twitter.com/h0BG8GjLdp
— ICC (@ICC) January 17, 2020

Manish ??#INDvsAUS #Manishpandey pic.twitter.com/CkKbMMBXnS
— Vinod Mudhiraj (@muraricool4) January 17, 2020