India vs Australia: 6 వికెట్లు తీసిన అశ్విన్.. ఆస్ట్రేలియా ఆలౌట్.. రెండో రోజు భారత్ 36 పరుగులతో క్రీజులో..

ఇండియా-ఆస్ట్రేలియా జట్ల మధ్య నాలుగో టెస్టు, రెండో రోజు ఆట ముగిసింది. బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో భాగంగా భారత్-ఆస్ట్రేలియా జట్ల మధ్య నాలుగో టెస్టు జరుగుతున్న విషయం తెలిసిందే. గుజరాత్, అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో ఈ మ్యాచ్ జరుగుతోంది. ఇవాళ ఉదయం 255/4 ఓవర్ నైట్ స్కోరుతో బ్యాటింగ్ ప్రారంభించిన ఆసీస్167.2 ఓవర్లలో 480 పరుగులు చేసి ఆలౌట్ అయింది.

India vs Australia: 6 వికెట్లు తీసిన అశ్విన్.. ఆస్ట్రేలియా ఆలౌట్.. రెండో రోజు భారత్ 36 పరుగులతో క్రీజులో..

India vs Australia

India vs Australia: ఇండియా-ఆస్ట్రేలియా జట్ల మధ్య నాలుగో టెస్టు, రెండో రోజు ఆట ముగిసింది. బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో భాగంగా భారత్-ఆస్ట్రేలియా జట్ల మధ్య నాలుగో టెస్టు జరుగుతున్న విషయం తెలిసిందే. గుజరాత్, అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో ఈ మ్యాచ్ జరుగుతోంది. ఇవాళ ఉదయం 255/4 ఓవర్ నైట్ స్కోరుతో బ్యాటింగ్ ప్రారంభించిన ఆసీస్ 167.2 ఓవర్లలో 480 పరుగులు చేసి ఆలౌట్ అయింది.

అనంతరం బ్యాటింగ్ ప్రారంభించిన టీమిండియా మ్యాచు ముగిసే సమయానికి 36 పరుగులు (10 ఓవర్లలో) చేసింది. క్రీజులో రోహిత్ శర్మ 17, శుభ్ మన్ గిల్ 18 పరుగులతో ఉన్నారు. మొదటి ఇన్నింగ్సులో ప్రస్తుతం ఆస్ట్రేలియా 444 పరుగుల ఆధిక్యంలో ఉంది. కాగా, టీమిండియా బౌలర్ రవిచంద్రన్ అశ్విన్ ఈ మ్యాచులో 6 వికెట్లు పడగొట్టాడు. మొహమ్మద్ షమీ 2, జడేజా, అక్షర్ పటేల్ ఒక్కో వికెట్ తీశారు.

నాలుగు టెస్టు మ్యాచుల ఈ సిరీస్ లో తొలి రెండు టెస్టు మ్యాచుల్లో భారత్, మూడో మ్యాచులో ఆస్ట్రేలియా గెలిచిన విషయం తెలిసిందే. 2-1తో టీమిండియా ముందంజలో ఉంది. ప్రస్తుత టెస్టు మ్యాచులో ఆస్ట్రేలియా గెలిస్తే సిరీస్ డ్రా అవుతుంది. నాలుగో టెస్టు మ్యాచు డ్రా అయితే, టీమిండియా గెలుస్తుంది. ఈ మ్యాచులోనూ గెలిచి 3-1తో ఆధిక్యాన్ని ప్రదర్శించాలని భారత్ కసిగా ఉంది.

IndiaVsAustralia: మూడో టెస్టులో ఆస్ట్రేలియా ఘన విజయం.. చిత్తుగా ఓడిన టీమిండియా