India vs Australia: రోహిత్ సెంచరీ బాదిన వేళ.. ఆస్ట్రేలియా తీరును ఎత్తిపొడుస్తూ వసీం జాఫర్ వ్యాఖ్యలు

ఆ పిచ్ ను చూస్తేనే బ్యాటర్లు దడుచుకుంటారని, పరుగులు రాబట్టలేరని చాలా మంది భావించారు. ఆస్ట్రేలియా బ్యాట్స్‌మన్ పీటర్ హ్యాండ్‌కాంబ్ కూడా పిచ్ బాగోలేదని, చాలా క్లిష్టతరంగా ఉందని, తొలిరోజు ఆట సమయంలో అన్నాడు. అయితే, సెంచరీ బాది ఆ అంచనాలన్నింటినీ పటాపంచలు చేశాడు టీమిండియా స్టార్ బ్యాట్స్‌మెన్ రోహిత్ శర్మ. దీంతో అతడిపై ప్రశంసల జల్లు కురుస్తోంది.

India vs Australia: రోహిత్ సెంచరీ బాదిన వేళ.. ఆస్ట్రేలియా తీరును ఎత్తిపొడుస్తూ వసీం జాఫర్ వ్యాఖ్యలు

India vs Australia

India vs Australia: నాగపూర్ పిచ్ బాగోలేదని అన్నారు.. లెఫ్టార్మ్ స్పిన్నర్లకు మాత్రమే అనుకూలంగా ఉందని విమర్శలు గుప్పించారు. చివరకు తొలి టెస్టు మ్యాచు మొదలైంది. మ్యాచు తొలి రోజు ఆటలో ఆస్ట్రేలియా బ్యాట్స్‌మెన్ తుస్సుమన్నారు. కేవలం 177 పరుగులకే ఆలౌట్ అయ్యారు. ఇక ఆ మైదానం బ్యాట్స్‌మెన్ కు సహకరించబోదని ప్రచారం జరిగింది.

ఆ పిచ్ ను చూస్తేనే బ్యాటర్లు దడుచుకుంటారని, పరుగులు రాబట్టలేరని చాలా మంది భావించారు. ఆస్ట్రేలియా బ్యాట్స్‌మన్ పీటర్ హ్యాండ్‌కాంబ్ కూడా పిచ్ బాగోలేదని, చాలా క్లిష్టతరంగా ఉందని, తొలిరోజు ఆట సమయంలో అన్నాడు. అయితే, సెంచరీ బాది ఆ అంచనాలన్నింటినీ పటాపంచలు చేశాడు టీమిండియా స్టార్ బ్యాట్స్‌మెన్ రోహిత్ శర్మ. దీంతో అతడిపై ప్రశంసల జల్లు కురుస్తోంది.

టీమిండియా మాజీ క్రికెటర్ వసీం జాఫర్ ఓ ఆసక్తికర వీడియో పోస్ట్ చేస్తూ రోహిత్ ఆటతీరు ఎలా ఉందో చెప్పారు. పిచ్ చాలా క్లిష్టతరంగా ఉందని అందరూ భావించారని వసీం జాఫర్ అన్నారు. అయితే, రోహిత్ మాత్రం ఆ పిచ్ ను బ్యాట్స్‌మెన్ కు అనుకూలమైన పిచ్ గా మార్చాడని చెప్పారు. రోహిత్ ఆటతీరు ఎల్లప్పుడూ ఇలాగే ఉంటుందని అన్నారు.

అందరినీ నవ్వించే ఓ వీడియోను కూడా వసీం జాఫర్ పోస్ట్ చేశారు. కాగా, భారత్-ఆస్ట్రేలియా మధ్య తొలి మ్యాచు జరుగుతోన్న నాగ్ పూర్ లోని విదర్భ క్రికెట్ అసోసియేషన్ స్టేడియంలో రోహిత్ 171 బంతుల్లో చేసిన సెంచరీ.. గతంలో అతడు చెన్నైలో చేసిన సెంచరీని గుర్తు తెస్తోంది. అప్పట్లోనూ ఇటువంటి పరిస్థితుల్లోనే రోహిత్ ఇంగ్లండ్ పై 161 పరుగులు చేశాడు. నేటి మ్యాచులో అతడు మొత్తం 120 పరుగులు చేసి, ఔటయ్యాడు.

Kona Srikar Bharat: తెలుగు కుర్రాడు శ్రీకర్ భరత్ ఎలా ఆడాడంటే..