IND vs AUS 4th Test 2023: చివరి టెస్టులో టీమిండియాలో కీలక మార్పులు.. ఆ ఇద్దరు ప్లేయర్లు రీఎంట్రీ..!

ఆస్ట్రేలియాతో గురువారం నుంచి అహ్మదాబాద్‌లో జరిగే చివరి టెస్ట్ మ్యాచ్ భారత్‌కు కీలకం కానుంది. ఈ మ్యాచ్‌లో విజయం సాధించడం ద్వారా ప్రపంచ టెస్ట్ ఛాంపియన్ షిప్ ఫైనల్‌కు నేరుగా చేరుకొనేందుకు అవకాశం ఉంటుంది.

IND vs AUS 4th Test 2023: చివరి టెస్టులో టీమిండియాలో కీలక మార్పులు.. ఆ ఇద్దరు ప్లేయర్లు రీఎంట్రీ..!

IND vs AUS Test Series

IND vs AUS 4th Test 2023: బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భాగంగా ఆస్ట్రేలియా, ఇండియా జట్లమధ్య నాలుగు టెస్ట్ మ్యాచ్ ల సిరీస్ ఇండియాలో జరుగుతుంది. ఈ సిరీస్‌లో ఇప్పటికే మూడు మ్యాచ్‌లు పూర్తికాగా.. 2-1 ఆధిక్యంలో టీమిండియా ఉంది. సిరీస్‌లో నిర్ణయాత్మక నాల్గో టెస్ట్ మ్యాచ్ గురువారం (మార్చి 9) నుంచి అహ్మదాబాద్ వేదికగా ప్రారంభమవుతుంది. ఈ మ్యాచ్ లో విజయం సాధించడం ద్వారా సిరీస్ ను కైవసం చేసుకోవాలని టీమిండియా పట్టుదలతో ఉంది. మరోవైపు చివరి మ్యాచ్ లో విజయంతో సిరీస్‌ను డ్రా చేయాలని కంగారూ జట్టు భావిస్తుంది.

IND vs AUS: బస్సులో క్రికెటర్ల హోలీ.. కోహ్లీ, రోహిత్ అల్లరి.. వీడియో షేర్ చేసిన శుభ్‌మన్‌గిల్

గురువారం నుంచి అహ్మదాబాద్‌లో జరిగే టెస్ట్ మ్యాచ్ భారత్ కు కీలకం కానుంది. ఈ మ్యాచ్ లో విజయం సాధించడం ద్వారా ప్రపంచ టెస్ట్ ఛాంపియన్ షిప్ ఫైనల్‌కు నేరుగా చేరుకొనేందుకు అవకాశం ఉంటుంది. మూడో టెస్ట్ మ్యాచ్ లో ఓటమిని నాల్గో టెస్టులోనూ పునరావృతం కాకుండా భారత్ పటిష్ట ప్రణాళికతో మైదానంలో దిగేందుకు సిద్ధమవుతోంది. ఈ క్రమంలో ఇద్దరు ఆటగాళ్లు జట్టులోకి పునరాగమనం చేయనున్నట్లు తెలుస్తోంది. మూడో టెస్టుకు దూరంగాఉన్న టీమిండియా పాస్ట్ బౌలర్ మహ్మద్ షమీ తిరిగి నాల్గో టెస్టులో ఆడే అవకాశాలు ఉన్నాయి. అహ్మద్ సిరాజుద్దీన్ స్థానంలో షమీ తుది జట్టులోకి రానున్నట్లు తెలుస్తోంది.

IND vs AUS Test Series 2023: డబ్ల్యూటీసీ ఫైనల్‌కు భారత్ చేరాలంటే.. శ్రీలంక జట్టు ఓడాల్సిందేనా..

టీమిండియాలో తుదిజట్టులోకి ఇషాన్ కిషన్‌కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి. ప్రస్తుతం వికెట్ కీపర్ గా కొనసాగుతున్న కేఎస్ భరత్ మూడు టెస్ట్ మ్యాచ్ లలోనూ పరుగులు రాబట్టడంలో విఫలమవుతూ వస్తున్నాడు. అహ్మదాబాద్ జట్టు టీమిండియాకు కీలక మ్యాచ్ కానున్న నేపథ్యంలో భరత్ స్థానంలో ఇషాంత్ కిషన్‌కు తుదిజట్టులో చేరే అవకాశాలు ఉన్నాయి.

భారత్ జట్టు అంచనా..

రోహిత్ శర్మ (కెప్టెన్), శుభ్‌మన్ గిల్, ఛతేశ్వర్ పుజారా, విరాట్ కోహ్లీ, శ్రేయాస్ అయ్యర్, రవీంద్ర జడేజా, శ్రీకర్ భరత్/ ఇషాన్ కిషన్, రవిచంద్ర అశ్విన్, అక్షర్ పటేల్, ఉమేష్ యాదవ్, షమీ/సిరాజుద్దీన్.