భారత్ vs బంగ్లా: డే అండ్ నైట్ టెస్టు మ్యాచ్‌ల సమయాలివే

భారత్ vs బంగ్లా: డే అండ్ నైట్ టెస్టు మ్యాచ్‌ల సమయాలివే

వరల్డ్ టెస్టు చాంపియన్‌షిప్‌లో భాగంగా భారత్ వర్సెస్ బంగ్లాదేశ్ ల మధ్య జరగనున్న టెస్టు సిరీస్ లో ప్రత్యేకతలు సంతరించుకున్నాయి. తొలి టెస్టును ఇండోరే వేదికగా ఆడుతున్నప్పటికీ రెండో మ్యాచ్ ను డే అండ్ నైట్ టెస్టు మ్యాచ్ గా ఆడేలా బీసీసీఐ నిర్ణయించింది. 

ఈ మేర కోల్ కతాలోని ఈడెన్ గార్డెన్స్ వేదికగా ఆడేందుకు ఇరు జట్లు అంగీకరించాయి. మ్యాచ్ ను మధ్యాహ్నం ఒంటి గంట నుంచి రాత్రి 8గంటల వరకూ జరపాలని క్రికెట్ అసోసియేషన్ ఆఫ్ బెంగాల్(క్యాబ్) బీసీసీఐకు రిక్వెస్ట్ చేసింది. ఫలితంగా నవంబరు 22నుంచి 26వరకూ డే అండ్ నైట్ టెస్టు మ్యాచ్ జరగనుంది. 

క్యాబ్ చేసిన రిక్వెస్ట్ ను ఆలోచించి రెండో టెస్టు వేళల్లో మార్పులు చేశాం. గేమ్ ఆడటం మధ్యాహ్నం ఒంటి గంటకు మొదలైనప్పటికీ ఫస్ట్ సెషన్ 3గంటలకు పూర్తి అవుతుంది. రెండో సెషన్ 3గంటల 40నిమిషాలకు మొదలై సాయంత్రం 5గంటల 40నిమిషాల వరకూ కొనసాగుతుంది. ఇందులో చివరి భాగం సాయంత్రం 6గంటలకు మొదలై రాత్రి 8గంటల వరకూ జరుగుతుంది. 

టెస్టు క్రికెట్‌లో నాలుగేళ్లుగా డే అండ్ నైట్ టెస్టు మ్యాచ్‌లు జరుగుతున్నాయి. భారత క్రికెటర్లు మాత్రం పింక్ బాల్‌తో తమకి అనుభవం లేదంటూ డే అండ్ నైట్ టెస్టు మ్యాచ్‌ను  వ్యతిరేకిస్తూ వచ్చారు. బీసీసీఐ అధ్యక్షుడిగా సౌరవ్ గంగూలీ బాధ్యతలు చేపట్టి భారత క్రికెటర్లని ఒప్పించడంతో భారత్ సైతం ఆ జాబితాలో చేరిపోయింది. మరోవైపు బంగ్లాదేశ్ కూడా ఇప్పటి వరకూ డే/నైట్ టెస్టులు ఆడలేదు. భారత ప్లేయర్లు పింక్ బాల్ అనుభవం లేకపోవడంతో నవంబరు 12నుంచే ప్రాక్టీస్ చేయడం మొదలుపెట్టారు.