నాల్గో టెస్టు : రెండోరోజు ముగిసిన ఆట : 89 పరుగుల ఆధిక్యంలో భారత్, స్కోరు 294/7

10TV Telugu News

India vs England 4th Test : ఇంగ్లండ్‌తో జ‌రుగుతున్న ఆఖరి నాలుగో టెస్ట్ తొలి ఇన్నింగ్స్‌లో టీమిండియా పట్టు బిగించింది. రెండో రోజు ఆట ముగిసేసరికి భారత్ 93.5 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 294 పరుగులు చేసింది. దాంతో కోహ్లీసేన తొలి ఇన్నింగ్స్ లో 89 పరుగుల ఆధిక్యంలో ఉంది. రెండో రోజు ఆటలో సెంచరీతో రెచ్చిపోయిన రిషబ్ పంత్ ఈ సిరీస్‌‌లో (105)తో టెస్టుల్లో మూడో సెంచరీ నమోదు చేశాడు.


సొంతగడ్డపై తొలి సెంచరీ కాగా.. ఇంగ్లాండ్, ఆస్ట్రేలియాలో రెండు సెంచరీలు నమోదు చేశాడు. రోహిత్ శర్మ (49) ఔట్ కాగా.. వాషింగ్టన్‌ సుందర్‌ (60)హాఫ్ సెంచరీ, అక్షర్‌ పటేల్‌ (11) నాటౌట్‌గా నిలిచారు. ఇంగ్లాండ్ బౌలర్లలో అండర్సన్ 3 వికెట్లు తీసుకోగా, స్టోక్స్ లీచ్ తలో 2 వికెట్లు పడగొట్టారు.


ఈ సిరీస్‌లో ఇప్పటికే 2-1 ఆధిక్యంలో టీమ్‌ఇండియా కొనసాగుతోంది. ఈ మ్యాచ్‌లోనూ విజయం సాధించి టీమిండియా ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌ ఫైనల్‌కు చేరాలని ఆశిస్తోంది. మరోవైపు ఇంగ్లాండ్‌ గెలిచి సిరీస్‌ డ్రా చేయాలని ఉవ్విళ్లూరుతోంది.
rISHAB