Jasprit Bumrah On Fire : బుమ్ బుమ్ బుమ్రా.. చెలరేగిన పేసర్.. ఇంగ్లండ్ ఓపెనర్లు ఔట్

ఇంగ్లండ్ తో 5వ టెస్ట్ మ్యాచ్ లో తొలి ఇన్నింగ్స్ లో భారీ స్కోర్ చేసిన భారత్.. బౌలింగ్ లోనూ విజృంభిస్తోంది. టీమిండియా కెప్టెన్ జస్ప్రీత్ బుమ్రా బ్యాటింగ్ లో చెలరేగడమే కాదు, బంతితోనూ నిప్పులు చెరుగుతున్నాడు.(Jasprit Bumrah On Fire)

Jasprit Bumrah On Fire : బుమ్ బుమ్ బుమ్రా.. చెలరేగిన పేసర్.. ఇంగ్లండ్ ఓపెనర్లు ఔట్
ad

Jasprit Bumrah On Fire : ఇంగ్లండ్ తో 5వ టెస్ట్ మ్యాచ్ లో తొలి ఇన్నింగ్స్ లో భారీ స్కోర్ చేసిన భారత్.. బౌలింగ్ లోనూ విజృంభిస్తోంది. టీమిండియా కెప్టెన్ జస్ప్రీత్ బుమ్రా బ్యాటింగ్ లో చెలరేగడమే కాదు, బంతితోనూ నిప్పులు చెరుగుతున్నాడు. బుమ్రా ధాటికి ఇంగ్లండ్ ఓపెనర్లు సింగిల్ డిజిట్ స్కోరుకే వెనుదిరిగారు. తొలుత అలెక్స్ లీస్ (6)ను బుమ్రా బౌల్డ్ చేశాడు.

ఆ తర్వాత వర్షం కారణంగా మ్యాచ్ నిలిచిపోగా, అంపైర్లు లంచ్ విరామం ప్రకటించారు. లంచ్ అనంతరం బుమ్రా మరోసారి విజృంభించాడు. మరో ఓపెనర్ జాక్ క్రాలే (9)ను పెవిలియన్ చేర్చాడు. దాంతో ఇంగ్లండ్ 27 పరుగులకే 2 వికెట్లు చేజార్చుకుంది. తొలి ఇన్నింగ్స్ లో 92 పరుగులకే 5 వికెట్లు కోల్పోయిన గడ్డు స్థితి నుంచి 416 పరుగుల భారీ స్కోర్ వరకు వచ్చింది టీమిండియా.

Jasprit Bumrah: సార‌థిగా కంటే బౌల‌ర్‌గానే జ‌ట్టుకు బాగా అవ‌స‌రం: ద్ర‌విడ్‌

ఇంగ్లండ్ తో జరుగుతున్న టెస్ట్ మ్యాచ్ లో టీమిండియా తొలి ఇన్నింగ్స్ లో 416 పరుగులకు ఆలౌట్ అయింది. రెండోరోజు ఆట ఆరంభంలో టీమిండియా ఆటగాళ్లు దూకుడు ప్రదర్శించారు. ఓవర్ నైట్ స్కోరు 338/7తో తొలి ఇన్నింగ్స్ కొనసాగించిన భారత్ వేగంగా ఆడింది. ఈ క్రమంలో ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా సెంచరీ బాదాడు. జడేజా 194 బంతుల్లో 104 పరుగులు చేశాడు. ఇక తాత్కాలిక కెప్టెన్ జస్ప్రీత్ బుమ్రా సంచలన బ్యాటింగ్ చేశాడు. బుమ్రా బ్యాట్ తో రెచ్చిపోవడం హైలైట్ గా నిలిచింది. బుమ్రా 16 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్స్ లు బాది 31 పరుగులు చేశాడు.

Rishabh Pant Sixes : క్రికెట్ గాడ్ రికార్డును బ్రేక్ చేసిన రిషబ్ పంత్

షమీ 16 పరుగులు చేయగా, సిరాజ్ 1 పరుగు చేసి చివరి వికెట్ రూపంలో అవుటయ్యాడు. ఈ వికెట్ కూడా ఆండర్సన్ ఖాతాలో చేరింది. ఈ మ్యాచ్ లో ఆండర్సన్ 5 వికెట్లు తీశాడు. ఇతర ఇంగ్లండ్ బౌలర్లలో మాథ్యూ పాట్స్ 2, బ్రాడ్ 1, స్టోక్స్ 1, రూట్ 1 వికెట్ పడగొట్టారు. అనంతరం తొలి ఇన్నింగ్స్ ప్రారంభించిన ఆతిథ్య ఇంగ్లండ్ 16 పరుగుల వద్ద తొలి వికెట్ కోల్పోయింది. ఆ తర్వాత 27 పరుగుల వద్ద రెండో వికెట్ కోల్పోయింది.

Must Watch: https://www.youtube.com/watch?v=Q0eu7HCRBgw

ఇంగ్లండ్ పేసర్ స్టువర్ట్ బ్రాడ్ బౌలింగ్ లో నాడు యువరాజ్ సింగ్ ఒకే ఓవర్లో 6 సిక్సులు కొట్టడం భారత క్రికెట్ అభిమానులు ఎప్పటికీ మరువలేరు. ఇవాళ బర్మింగ్ హామ్ టెస్టులో బ్రాడ్ కు మరోసారి అలాంటి పరిస్థితే ఎదురైంది. టీమిండియా కెప్టెన్ బుమ్రా బ్యాటింగ్ చేస్తుండగా బ్రాడ్ ఇన్నింగ్స్ 84వ ఓవర్లో బౌలింగ్ కు దిగాడు. అయితే, ఆ ఓవర్లో బ్రాడ్ కు ఏదీ కలిసి రాలేదు. ఏకంగా 35 పరుగులు సమర్పించుకున్నాడు. టెస్టు క్రికెట్లో ఒకే ఓవర్లో అత్యధిక పరుగుల రికార్డు ఇదే.(Jasprit Bumrah On Fire)

ఈ ఓవర్లో తొలి బంతికి బుమ్రా 4 కొట్టగా, రెండో బంతికి వైడ్, నాలుగు బైస్ తో కలిపి 5 రన్స్ లభించాయి. ఆ తర్వాత మూడో బంతిని బ్రాడ్ నోబాల్ వేయగా, బుమ్రా దాన్ని సిక్స్ గా మలిచాడు. బుమ్రా ఆ తర్వాత వరుసగా నాలుగు బంతుల్లో మూడు ఫోర్లు, ఒక సిక్స్ బాదాడు. ఇక చివరి బంతికి సింగిల్ రన్ తీయడంతో ఆ ఓవర్లో మొత్తంగా 35 పరుగులు లభించాయి.

గతంలో ఒకే ఓవర్లో అత్యధిక పరుగులు సాధించిన రికార్డు వెస్టిండీస్ దిగ్గజం బ్రయాన్ లారా, ఆస్ట్రేలియా ఆటగాడు బెయిలీ, సఫారీ ఆటగాడు కేశవ్ మహరాజ్ ల పేరిట ఉంది. లారా 2003లో దక్షిణాఫ్రికా బౌలర్ రాబిన్ పీటర్సన్ బౌలింగ్ లో 28 పరుగులు సాధించాడు. బెయిలీ 2013లో ఇంగ్లండ్ బౌలర్ ఆండర్సన్ బౌలింగ్ లో 28 పరుగులు సాధించాడు. కేశవ్ మహరాజ్ 2020లో ఇంగ్లండ్ ఆటగాడు రూట్ బౌలింగ్ లో 28 పరుగులు నమోదు చేశాడు.

టీమిండియా ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా అద్భుతంగా ఆడి సెంచరీ పూర్తి చేసుకున్నాడు. క్లిష్ట పరిస్థితుల్లో ఎంతో సంయమనంతో ఆడిన జడేజా 183 బంతుల్లో 100 పరుగులు సాధించాడు. రెండో రోజు ఆట ఆరంభంలోనే జడేజా ఈ ఘనత అందుకున్నాడు. తొలిరోజు ఆటలో సెంచరీ హీరో రిషబ్ పంత్ కు విశేషంగా సహకారం అందించిన జడేజా… కెరీర్ లో చిరస్మరణీయం అనదగ్గ శతకాన్ని లిఖించాడు.