India vs England : చరిత్ర సృష్టించారు, భారత్ ఘన విజయం

ఇంగ్లండ్ తో జరిగిన నాలుగో టెస్ట్ మ్యాచ్ లో భారత బౌలర్లు విజృంభించారు. చివరి రోజు పది వికెట్లు తీసి చిరస్మరణీయమైన విజయాన్ని అందించారు.

India vs England : చరిత్ర సృష్టించారు, భారత్ ఘన విజయం

India Won By 157 Runs

India vs England : ఇంగ్లండ్ తో జరిగిన నాలుగో టెస్ట్ మ్యాచ్ లో భారత బౌలర్లు విజృంభించారు. చివరి రోజు పది వికెట్లు తీసి చిరస్మరణీయమైన విజయాన్ని అందించారు. 368 పరుగుల లక్ష్యం చేరుకోలేక ఇంగ్లండ్ బ్యాట్స్ మెన్స్ చేతులెత్తేశారు. 368 పరుగుల టార్గెట్‌తో రెండో ఇన్నింగ్స్ స్టార్ట్ చేసిన ఇంగ్లండ్ టీమ్..210 పరుగులకు ఆలౌట్ అయ్యింది. 157 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది భారత్. 5 టెస్టుల సిరీస్ లో 2-1 ఆధిక్యంలో భారత్ నిలిచింది.

Read More : India Vs England : చరిత్ర సృష్టిస్తారా ? భారత్ – ఇంగ్లండ్ నాలుగో టెస్టు రసవత్తరం

తొలి సెషన్ లో ఇరుజట్లు సమానంగా నిలిచాయి. ఓపెనర్లు రోరీ బర్న్స్ (50)…హమీద్ (63) పరుగులు చేసి మంచి పునాది వేశారు. 100 పరుగుల వద్ద ఉన్నప్పుడు రోరీ, 141 రన్ల వద్ద హమీద్ అవుట్ అయ్యాడు. తర్వాత వచ్చిన వారు భారత బౌలర్లను సమర్థవంతంగా ఎదుర్కొలేకపోయారు. తక్కువ స్కోరుకే వెనుదిరిగారు. భారత బౌలర్లు వరుసగా వికెట్లు తీస్తూ…ఇంగ్లండ్ టీంను కట్టడి చేయగలిగారు. ఇంగ్లండ్ టీంలో చివరి బ్యాట్స్ మెన్స్ భారత బౌలర్లకు పరీక్షగా నిలిచారు. వికట్ పోకుండా…మెల్లిగా ఆడుతూ..భారత బౌలర్ల సహనాన్ని పరీక్షించారు. ఉమేశ్ యాదవ్ మూడు, బుమ్రా రెండు, జడేజా రెండు, థాకూర్ రెండు వికెట్లు తీశారు.

భారత్ తొలి ఇన్నింగ్స్ 191. రెండో ఇన్నింగ్స్ 466.
ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్ 290. రెండో ఇన్నింగ్స్ 210.

Read More : Covishield : 4 వారాలకే కొవిషీల్డ్ సెకండ్ డోస్.. కేరళ హైకోర్టు కీలక ఆదేశం 
భారత్ విజయం..50 ఏళ్ల నిరీక్షణకు తెరపడింది. అంతే కాకుండా.. ఈ సిరీస్‌లో 2-1 ఆధిక్యంలోకి దూసుకుపోయింది. ఇక ఓవల్ గ్రౌండ్‌లో భారత్ గత 50 ఏళ్లుగా ఒక్క విజయాన్ని కూడా నమోదు చేయలేదు.  ఆ స్టేడియంలో చివరి సారిగా 1971లో టీమిండియా గెలిచింది. అజిత్ వాడేకర్ సారథ్యంలోని భారత జట్టు ఆతిథ్య జట్టును 4 వికెట్ల తేడాతో ఓడించింది. అదే ఈ మైదానంలో భారత్ అందుకున్న చివరి విజయం. ఆ తర్వాత 8 మ్యాచ్‌లు ఆడిన టీమిండియా ఒక్కదాంట్లో విజయం సాధించ లేదు. చివరి మూడింటిలో చిత్తుగా ఓడి.. అంతకుముందు ఐదు మ్యాచ్‌ల్లో డ్రా చేసుకుంది.