Team India : టీమ్ ఇండియాలో RRR, రోహిత్‌‌కు తొలి పరీక్ష

టీ20 ప్రపంచకప్‌ వైఫల్యాన్ని న్యూజిలాండ్‌ సిరీస్‌తో చెరిపేయాలని భారత్‌ భావిస్తుంటే..తృటిలో కప్‌ చేజార్చుకున్న కివీస్‌ మళ్లీ పుంజుకోవాలని చూస్తుంది.

Team India : టీమ్ ఇండియాలో RRR, రోహిత్‌‌కు తొలి పరీక్ష

India

India vs New Zealand : టీమ్‌ ఇండియాలో త్రిబుల్‌ ఆర్‌ సినిమాకు రంగం సిద్ధమైంది. రాహుల్‌ ద్రవిడ్‌, రోహిత్‌ శర్మ, లోకేశ్‌ రాహుల్‌ రూపంలోని భారత నాయకత్రయం పగ్గాలు అందుకోబోతోంది. ఈ ముగ్గురు పొట్టి ఫార్మాట్‌లో టీమ్‌ ఇండియాను ముందుకు నడిపించేందుకు సిద్ధమయ్యారు. టీ20 ప్రపంచకప్‌ వైఫల్యాన్ని న్యూజిలాండ్‌ సిరీస్‌తో చెరిపేయాలని భారత్‌ భావిస్తుంటే..తృటిలో కప్‌ చేజార్చుకున్న కివీస్‌ మళ్లీ పుంజుకోవాలని చూస్తుంది. ఈ నేపథ్యంలో జైపూర్‌లో 2021, నవంబర్ 17వ తేదీ బుధవారం ఆసక్తికర పోరుకు రంగం రెడీ అయ్యింది. తీరిక లేని షెడ్యూల్‌తో ఆటగాళ్లు అలిసిపోవడం వల్లే టీ20 ప్రపంచకప్‌లో భారత జట్టు మెరుగైన ప్రదర్శన చేయలేకపోయిందనే విమర్శలు వెల్లువెత్తాయి.మెగాటోర్నీ ముగిసి మూడు రోజులు గడవక ముందే రోహిత్‌ సేన తిరిగి మైదానంలో అడుగుపెట్టనుంది.

Read More : Earthquake : విశాఖకు భూకంప భయం, నిద్రలేని రాత్రులు గడుపుతున్న జనాలు!

ఆస్ట్రేలియా చేతిలో ఓడిన న్యూజిలాండ్‌.. ఏమాత్రం విశ్రాంతి తీసుకోకుండా జైపూర్‌ చేరింది. మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా ఇరు జట్ల మధ్య సవాయ్‌ మాన్‌సింగ్‌ స్టేడియంలో తొలి టీ20 జరుగనుంది. ఐదేళ్ల తర్వాత భారత జట్టు కొత్త సారథి నేతృత్వంలో బరిలోకి దిగనుంది. పూర్తి స్థాయి కెప్టెన్‌గా రోహిత్‌ శర్మకు, హెడ్‌కోచ్‌గా ‘ది వాల్‌’ రాహుల్‌ ద్రవిడ్‌కు ఇదే తొలి మ్యాచ్‌ కానుండటం ఆసక్తికరంగా మారింది. జట్టులో ఐదుగురు ఓపెనర్లు ఉన్నారు. కొందరికి మిడిల్ ఆర్డర్ స్థానాలు కేటాయించడం సవాలే అంటున్నారు క్రీడా విశ్లేషకులు. రోహిత్, రాహుల్ తొలి టీ20 ఇన్నింగ్స్ ఆరంభించే అవకాశాలున్నాయని భావిస్తున్నారు. వెంకటేశ్ అయ్యర్ ను మిడిల్ ఆర్డర్ లో పంపించే అవకాశాలున్నాయి. జడేజా గైర్హాజరీలో అక్షర్ పటేల్ స్పిన్ ఆల్ రౌండర్ పాత్రను పోషించనున్నారు. యూఏఈ రాణించిన అశ్విన్ తుది జట్టులో స్థానం సంపాదించుకోవచ్చు. దీపక్ చాహర్, చాహల్ బరిలోకి దిగడం ఖాయమంటున్నారు.