IND vs NZ: టాస్ గెలిచిన కివీస్.. మళ్లీ బ్యాటింగే

IND vs NZ: టాస్ గెలిచిన కివీస్.. మళ్లీ బ్యాటింగే

కివీస్ పర్యటనలో రెండో మ్యాచ్ కు భారత్ సిద్ధమైంది. ఈడెన్ పార్క్ వేదికగా కివీస్ జట్టు భారత్‌పై ప్రతీకారం తీర్చుకోవాలని ఎదురుచూస్తోంది. ఈ క్రమంలో టాస్ గెలిచిన న్యూజిలాండ్ కెప్టెన్ కేన్ విలియమ్సన్ బ్యాటింగ్ తీసుకున్నాడు. మరోసారి చేధనకు దిగి భారత్ తొలి టీ20ఫలితాన్ని పునరావృతం చేస్తుందని భారత అభిమానులు ఎదురుచూస్తున్నారు. 

విలియమ్సన్ అంచనా ప్రకారం.. పిచ్ కాస్త స్లోగా అనిపించడం బ్యాటింగ్ కు బాగా కలిసొస్తుందని భావించాడట. కెప్టెన్ కోహ్లీ మాత్రం టాప్ గెలిచినా తాము బౌలింగే తీసుకోవాలనుకున్నట్లు చెప్పాడు. వాతావరణం అనుకూలించడం.. బౌండరీలు చాలా దగ్గరగా ఉండడంతో భారీ స్కోరుకోసం ఇరుజట్లు ప్రయత్నిస్తున్నాయి. జట్లలో ఏ మార్పు లేకుండా పాత జట్టునే కొనసాగిస్తున్నాయి ఇండియా-కివీస్‌లు.

India: Rohit Sharma, Lokesh Rahul (wk), Virat Kohli (c), Shreyas Iyer, Shivam Dube, Manish Pandey, Ravindra Jadeja, Shardul Thakur, Mohammed Shami, Yuzvendra Chahal, Jasprit Bumrah.

New Zealand: Martin Guptill, Colin Munro, Kane Williamson (c), Colin de Grandhomme, Ross Taylor, Tim Seifert (wk), Mitchell Santner, Blair Tickner, Tim Southee, Ish Sodhi, Hamish Bennett.