WTC Final: బాల్ పడకుండానే నాలుగో రోజు ఆట రద్దు

వర్షం కారణంగా నాలుగో రోజు మ్యాచ్ రద్దు చేసినట్లు బీసీసీఐ కన్ఫామ్ చేసింది. బీసీసీఐ, ఐసీసీ ట్వీట్ ద్వారా విషయాన్ని ప్రకటించాయి. నాలుగో రోజు ఆటను కూడా వర్షం తుడిచిపెట్టేసింది.

WTC Final: బాల్ పడకుండానే నాలుగో రోజు ఆట రద్దు

Ind Vs Nz

WTC Final: వర్షం కారణంగా నాలుగో రోజు మ్యాచ్ రద్దు చేసినట్లు బీసీసీఐ కన్ఫామ్ చేసింది. బీసీసీఐ, ఐసీసీ ట్వీట్ ద్వారా విషయాన్ని ప్రకటించాయి. నాలుగో రోజు ఆటను కూడా వర్షం తుడిచిపెట్టేసింది. వరల్డ్ ఛాంపియన్ షిప్ టెస్టు ఆటను వర్షం సవ్యంగా సాగనివ్వడం లేదు. తొలి మూడు రోజులు బ్యాట్, బాల్ బాగానే అనుకూలించాయి.

కివీస్.. తొలి ఇన్నింగ్స్‌లో భారత్‌ను 217 రన్స్‌కు ఆలౌట్‌ చేయగా.. తర్వాత బ్యాటింగ్‌లోనూ అదరగొట్టింది. ఓపెనర్లు టామ్‌ లాథమ్‌, డెవాన్‌ కాన్వే ఆరంభంలో అదరగొట్టడంతో.. వీరిద్దరూ తొలి వికెట్‌కు 70 పరుగులు జోడించారు. ప్రమాదకరంగా మారుతున్న ఈ జోడి పార్ట్‌నర్‌షిప్‌‌ని అశ్విన్‌ బ్రేక్ చేశాడు. 34.2 ఓవర్‌ దగ్గర ఓ చక్కటి బంతితో లాథమ్‌ను బోల్తా కొట్టించాడు.

ఆ తర్వాత వచ్చిన కెప్టెన్‌ కేన్‌ విలియమ్సన్‌ తనదైన శైలిలో నిలకడగా ఆడుతూ కాన్వేకు సహకారం అందించాడు. ఈ క్రమంలోనే కాన్వే అర్థశతకం పూర్తి చేసుకున్నారు. ఇషాంత్‌ వేసిన 49వ ఓవర్‌లో లెగ్‌సైడ్‌ వెళ్లే బంతిని షాట్‌ ఆడబోయి షమి చేతికి చిక్కాడు కాన్వే. దీంతో న్యూజిలాండ్‌ 101 పరుగుల దగ్గర రెండో వికట్ కోల్పోయింది.

అదే సమయంలో బ్యాడ్ లైట్ కారణంగా మూడో రోజు ఆటను అంఫైర్లు నిలిపివేశారు. నాలుగో రోజు మ్యాచ్ మొదలయ్యే సమయానికి వర్షం కురుస్తుండటంతో రోజంతా ఎదురుచూస్తూ ఉన్నారు. మైదానమంతా వర్షపు నీరు నిలిచిపోయింది. అలా మ్యాచ్ రద్దు చేసిన అంపైర్లు వర్షం లేకపోతే ఐదో రోజు మ్యాచ్ సజావుగా కురుస్తుంది.