IND vs NZ WTC Final, Day 5: ఆశగా ఐదో రోజు.. ఇక రెండు రోజులే.. ఫలితం కష్టమే!

సౌతాంప్టన్‌లో భారత్, న్యూజిలాండ్ మధ్య జరుగుతున్న ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్ మ్యాచ్‌లో, గత నాలుగు రోజులుగా మైదానంలో వర్షం పడుతోంది. ఇరువైపుల ఆటగాళ్ళు వర్షం ఎప్పుడు తగ్గుతుందా? అని ఎదురుచూస్తుంటే, అభిమానులు ఎప్పుడు ఆడుతారా? అని ఎదురుచూస్తున్నారు.

IND vs NZ WTC Final, Day 5: ఆశగా ఐదో రోజు.. ఇక రెండు రోజులే.. ఫలితం కష్టమే!

Ind

Ind vs NZ WTC Final: సౌతాంప్టన్‌లో భారత్, న్యూజిలాండ్ మధ్య జరుగుతున్న ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్ మ్యాచ్‌లో, గత నాలుగు రోజులుగా మైదానంలో వర్షం పడుతోంది. ఇరువైపుల ఆటగాళ్ళు వర్షం ఎప్పుడు తగ్గుతుందా? అని ఎదురుచూస్తుంటే, అభిమానులు ఎప్పుడు ఆడుతారా? అని ఎదురుచూస్తున్నారు. వరుణుడు మాత్రం రోజూ దోబూచులాడుతున్నాడు. ఈ రోజు ఈ మ్యాచ్ ఐదవ రోజు కాగా.. మాములుగా అయితే ఆఖరిరోజు కానీ, ఫస్ట్ డే టాస్ పడలేదు కాబట్టి, రేపు కూడా ఆట కోసం రిజర్వు డే ఉంది.

కానీ, ఈ రెండు రోజులలో తుది ఫలితం వచ్చే అవకాశం మాత్రం చాలా తక్కువగా ఉంది. రెండు జట్లను ఉమ్మడి విజేతలుగా ప్రకటించే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి. నేటి వాతావరణం విషయానికి వస్తే ఉదయం సెషన్‌లో మ్యాచ్ ఆడవచ్చు, కానీ, తరువాత వర్షం పడుతుందని వాతావరణశాఖ చెబుతుంది.

నాల్గవ రోజు వర్షం కారణంగా ఒక్క బంతి కూడా పడకుండానే మ్యాచ్ ముగిసింది. ఈ మ్యాచ్ మొదటి రోజు కూడా వర్షం కారణంగా కొట్టుకుపోయింది. రెండవ రోజు టాస్ జరిగింది. లైటింగ్ సరిగా లేకపోవడంతో రెండవ రోజు.. మూడవ రోజు కూడా ప్రభావితం అయ్యింది. టాస్ గెలిచిన తరువాత న్యూజిలాండ్ బౌలింగ్‌ ఎంచుకుని భారత్‌ను బ్యాటింగ్‌కి ఆహ్వానించింది. 217 పరుగులు చేసింది.

దీని తరువాత, న్యూజిలాండ్ జట్టు మొదటి ఇన్నింగ్స్‌లో 2 వికెట్ల నష్టానికి 101 పరుగులు చేసింది. మొదటి ఇన్నింగ్స్ తర్వాత టీమ్ ఇండియా కంటే 116 పరుగులు వెనుకబడి ఉన్నారు. న్యూజిలాండ్ ఓపెనర్ టామ్ లాథమ్ మరియు డోవాన్ కాన్వే మొదటి ఇన్నింగ్స్‌లో న్యూజిలాండ్‌కు మంచి ఆరంభం ఇచ్చారు. ఇద్దరూ 70 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పి తర్వాత అవుట్ అయ్యారు.